యశ్వంత్ .. మహల్ కె బయల్దేరుతున్నావా ? సత్య ప్రశ్నకి వెనక్కి తిరిగి .. హా .. మురారి నిద్రపోతున్నాడా ? ?
అడిగాడు యశ్వంత్ నిర్లిప్తం గా .
అతడి వంక వెటకారం గా చూసి .. ఇంకా నిద్రపోవట మేంటి ? రెడీ అవుతున్నాడు .. గుడి వెతకటం ముఖ్యమే కదా .
అంది సత్య కొంచెం వ్యంగ్యం గా .
అవును . మురారి ఉండటం చాలా ముఖ్యం . నువ్వూ వస్తావా సత్యా .. అన్నాడు యశ్వంత్ .
తప్పకుండా యశ్వంత్ . తప్పక వస్తాను .. అని టేబుల్ పక్కనే ఉన్న కుర్చీ తీసుకొని కూర్చుంది .
ఇంతలో .. హాయ్ .... అంటూ చేతులు ఊపుతూ వచ్చింది రచన .
హాయ్ .. రచనా .. సమయానికి వచ్చావ్ .. మహల్ కె స్టార్ట్ అవుతున్నాము . అన్నాడు యశ్వంత్ .
ఓహ్ .. అని సత్య వైపు చూసి హాయ్ సత్యా .. గుడ్ మార్నింగ్ .. అప్పుడే ఫ్రెష్ అయ్యావే .. అంటూ వచ్చి ఆమె కి
ఎదురుగా ఉన్న కుర్చీ లో కూర్చుంది . ..
ఆమె వైపు ద్వేషం తో నిండిన చూపు చూసి పెదవులపై ఓ అబద్ధపు నవ్వు పులిమి నీకోసమే చూస్తున్నాము
రచనా ... నువ్వోచ్చాకే బయల్దేరోచ్చు కదా అని . అంది సత్య
ఇంతలో అందరికి కాఫీ తీసుకొచ్చాడు శివ . మురారి కూడా రెడీ అయి వచ్చాక అందరూ కాఫీ సిప్ చేయసాగారు .
మురారి క్రీగంట సత్య వైపు చూసాడు . ఈ వైజయంతి కూడా అక్కడికి వస్తుంది . ఏమియ్యి ఉంటుంది ఈమె ఉద్దేశ్యం
?గుడి బయటపడనివ్వకుండా చేస్తుంది . ఓ క్షుద్ర శక్తి పన్నాగాల ముందు మానవ ప్రయత్నం ఫలిస్తుందా ??
అని ఆలోచిస్తున్నాడు మురారి .
పదండి పదండి ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు . త్వరగా వెళ్దాం ..... తొందర పెట్టింది సత్య .
లెట్స్ గో అంటూ ముందుకి కదిలాడు యశ్వంత్ .
అందరూ యశ్వంత్ ని అనుసరించారు .
***********************************
కాసేపట్లోనే అందరూ మహల్ వెనుక భాగానికి చేరుకున్నారు . యష్ .. అటుచూడు .. వింతగా ఉంది కదూ .. అని
శివ చూపించిన వైపు అందరూ చూశారు .
అందరి కళ్ళు ఆశ్చర్యం తో పెద్దవయ్యాయి . ఓహ్ గాడ్ .. ఒక్కరోజు లోనే ఈ మడుగు లో ఇన్ని కలవ పూలు ఎలా
పూసాయి . ..? అన్నాడు మురారి ఆశ్చర్యంగా .
నిజమే .. నిన్నటి వరకూ మడుగులో నీళ్ళే లేవు .. ఈరోజు ఇన్ని కలువ పూలు .. ఎంత అందంగా ఉన్నాయో ..
ఆశ్చర్యానందాలతో అంది రచన .
మురారి వాటిని చూసి ఆలోచన లో పడ్డాడు . దీని వెనుక ఏదో రహస్యం ఉండి ఉంటుంది అనుకున్నాడు మనసులో
సత్య వాటిని చూసి కోపంగా పళ్ళు కొరికింది . విధాత్రీ .. నేను నీ ప్రయత్నాన్ని సఫలం కానివ్వను . అని కోపంగా
ముందుకి నడిచింది .
సత్యా .. ఆగు .. నేనూ ఆ పూలని కాస్త దగ్గరగా చూస్తాను .. అని రచన పరుగున ఆ మడుగు దగ్గరకి వచ్చింది .
వంగి మడుగులో ఉన్న ఓ కలువ ని తీసి పరీక్షగా చూసింది . ఆమె కళ్ళు వింతగా మెరిసాయి ..
ఇంకా ఉంది
మీతో ఓ చిన్న మాట : రుధిర సౌధం సీరియల్ ని ఆదరిస్తున్న బ్లాగ్ వీక్షకులకి సదా కృతజ్ఞురాలిని . మీ అభిమానం
ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తు ... 100 భాగం వరకూ చేరుకున్న ఈ సీరియల్ ఇంకా ముందుకి
కొనసాగాలని భావిస్తూ
మీ రాధిక
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది..

2 comments:
Nice to read this. Congratulations
thank you so much padmarpita gaaru..
Post a comment