రచన తన ఒడిలో యశ్వంత్ తల ని పెట్టింది యశ్వంత్ ని నేల పై పరుండబెట్టి ..
అతను ఆమె కళ్ళలోకి చూశాడు . ఆమె కళ్ళలో అంతులేని ఆర్ద్రత . తన చేతితో అతని తలని ప్రేమగా నిమిరింది
ఆమె .
సత్య ఓటమి ని తాళలేక కోపంగా చూసింది వారివంక .
నీకెలా తెలిసింది రచనా ? నీటిలోపల యశ్వంత్ ప్రమాదం లో ఉన్నాడని ? అడుగుతున్నాడు శివ .
శివ ప్రశ్న యశ్ చెవులకి లీలగా వినిపిస్తుంటే అతడు మాత్రం రచన కళ్ళలోని లోతైన భావాలని చదువుతున్నాడు .
విధాత్రి .. రాకుమారి విధాత్రి .. మీకు నా కృతజ్నతలు . అతని మనసు పలికింది .
ఆమె కళ్ళలో సన్నని వెలుగు మాయమై వెంటనే .. యశ్ ఎలా ఉంది నీకు ? అసలు నీటిలో అంత ఇబ్బంది ఎలా
పడ్డావు ? ఆదుర్దాగా అడిగింది రచన .
అతడి పెదవులపై సన్నని చిరునవ్వు .
యశ్ .. ఆర్ యు ఓకే .. ? భయంగా ,ఆందోళన గా అడిగాడు మురారి నీటిలోంచి పైకి వచ్చి .
మెల్లిగా రచన ఒడిలోంచి లేచి అందరివైపు చూసి ఐ యాం ఓకే ఫ్రెండ్స్ .. అన్నాడు యశ్వంత్ .
చూశావా యశ్వంత్ ? ఎంత ప్రమాదం దాటిందో ? ఇలాంటివన్నీ చూస్తేనే భయం కలుగుతుంది . మనమీ ప్రయత్నం
మానుకుంటే మంచిదేమో . .. అమాయకత్వం నటిస్తూ అంది సత్య లో ఉన్న వైజయంతి .
రచన పొడి టవల్ తెచ్చి ఇచ్చింది . తల తుడుచు కుంటూ ప్రమాదం ఉంటుందని తెలిసేకదా సత్యా మనమీ పని కి
పూనుకున్నది .. ఇప్పుడు భయపడి వెనక్కి తగ్గితే అది ఓడిపోవటమే . ఓడిపోవటాన్ని నేను ఇష్టపడను . అన్నాడు
యశ్వంత్ .
ఓడిపోతే అది పెద్ద విషయం కాదు యశ్వంత్ . కానీ ప్రాణాలు పోతే .. నొక్కి పెట్టి అంది సత్య .
ప్రాణం పోవటమా ? ఎవరివల్ల .. ఆ బ్లడీ వైజయంతి వల్ల నా ? నెవెర్ .. తను మన ప్రాణాలు తీయగలిగి ఉంటె
ఇప్పుడు కాదు ఎప్పుడో తీసేయగలిగేది . తనని మించిన శక్తి మనకి తోడుగా ఉంది ... చెడు ఎప్పుడూ మంచి
ముందు పరాజయం పొందక తప్పదు . మనిషి సంకల్పం ముందు ఏమైనా ఓడిపోవలసిందే అన్నాడు యశ్వంత్
స్థిరంగా ...
కోపంగా ఎర్రబడిన కళ్ళతో చూసింది వైజయంతి(సత్య ) .
మురారి వారిద్దరి సంభాషణ ని విని .. యశ్వంత్ ఇంత ప్రమాదం నుండి బయటపడ్డావు కాసేపు నువ్వు విశ్రాంతి
తీసుకో .. అన్నాడు మురారి .
అవును .. బట్ నేను విశ్రాంతి తీసుకోదల్చుకోలేదు . అని కొలను వైపు చూశాడు . ఏమాత్రం చెదిరి పోకుండా
కలువలు కొలువుదీరున్నాయి .
రచన మడుగు ఒడ్డునే కూర్చుంది ఆలోచిస్తూ ....
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a comment