రచన వెనుకగా వచ్చి నీకెలా తెలిసింది రచనా ? యశ్వంత్ ఆపదలో ఉన్నాడని ?అడిగాడు శివ .
ఆమె వెనక్కి తిరిగి తెలియడం లేదు శివా .. నాకే తెలియకుండా నేను మడుగులోకి దూకాను . యశ్వంత్ ని
రక్షించాను . కానీ ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంది నా ప్రమేయం లేకుండానే ఇదంతా జరిగినట్లు అనిపిస్తుంది . అంది
రచన మడుగు లోని కలువల వంక చూస్తూ .
శివ ఆలోచనలో పడ్డాడు .. తల తిప్పి సత్య ,మురారిల తో మాట్లాడుతున్న యశ్వంత్ వైపు చూసాడు .
శివా .. ఇంత జరిగినా ఈ మడుగులోని పూలు ముందెలా ఉన్నాయో అలానే ఉన్నాయి . ఆశ్చర్యంగా లేదూ ..
అంది రచన .
యశ్వంత్ మీదినుంచి దృష్టి ని మరల్చి కలువల వైపు చూసాడు శివ .
నొసలు చిట్లించి మళ్ళి కలువల వైపు చూశాడు శివ . అతని మెదడు లో ఒక ఆలోచన స్ఫురించింది . స్ఫురించిన
వెంటనే యశ్ .. గట్టిగా అరిచాడు .
ఏమైంది శివా ? అని కుర్చున్నాదల్లా లేచి నిలుచుంది రచన .
శివ అరుపుకి యశ్ ,మురారిల తో బాటు సత్య కూడా ఆసక్తిగా చూసింది శివ వైపు .
యశ్ ఇలారా .. ఈ కలువలు మనకి మార్గాన్ని చూపిస్తున్నాయి యశ్వంత్ . ఆనందంగా అరిచాడు శివ .
యశ్వంత్ ,మురారి పరుగున మడుగు వద్దకి వచ్చారు . సత్య అసహనం గా చూసింది వీరివైపు .
ఏంటి శివా ? ఎలా చెప్పగలుగుతున్నావు ? అన్నారు ఇద్దరూ ఒకేసారి .
రచన ఆశ్చర్యంగా శివ వైపు మడుగు వైపు చూస్తుంది .
అలా చూడు .. రచన చెప్పినట్లు ఈ కలువలు మీరు మడుగులో దూకక ముందు ఎలా ఉన్నాయో అలానే
ఉన్నాయి .. అంతే కాదు కలువల అమరిక దక్షిణం వైపు చూపిస్తుంది ఒక బాణం గుర్తు లా . సరిగ్గా గమనించండి ..
అన్నాడు శివ .
శివ చెప్పింది విన్నాక మడుగులో పూలని పరీక్షగా చూశారు మురారి , యశ్వంత్ ... వారి పెదవులపై చిరునవ్వు
అప్రయత్నం గా వెలువడింది .
ఈ మహల్ లో మనకి హాని చేయాలనుకున్న క్షుద్ర శక్తి తో పాటూ మరేదో శక్తి ఉంది .. ఆ శక్తి మనకి హెల్ప్
చేస్తుందేమో అనిపిస్తుంది యశ్వంత్ . ఈ కలువ పూలు .. నిన్ను రచన అనుకోకుండా కాపాడటం .. ఇవన్ని
చూస్తుంటే మీకూ నాలా అనిపించటం లేదా ? అన్నాడు శివ .
శివ వైపు చిరునవ్వుతో చూసి నిజమే శివా ... అన్నాడు యశ్వంత్ .
ఇంకెవరు ఆ వైష్ణవీ మాతే మనకి అడుగడుగునా సహాయం చేస్తుందేమో ఎవరికీ తెల్సు ? అంది తన చేతిలోకి
ఓ కలువని తీసుకుంటూ రచన .
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
1 comment:
Nice writeup......Super and Exciting...
Post a comment