సత్య కళ్ళు అసహనం తో ,కోపం తో మరింత ఎర్రబడ్డాయి .
అదన్న మాట సంగతి . వీరంతా ఈ మహల్ అడుగుపెట్టినప్పటి నుంచీ వీరందరినీ సంహరించడానికి ఎంతగా
ప్రయత్నించిన వీరంతా నన్ను ఎదురించి నిలబడడానికి కారణం ఇదన్న మాట . అంటే నా కళ్ళ ముందరే మహల్
చేయి జారిపోకూడదు . నా శక్తి వీరి ముందు ఓడిపోకూడదు . నేను వీరి ప్రాణాలని తీయలేకపోవోచ్చు గాక . కాని
ఇబ్బందుల పాలు చేయగలను . తద్వారా మహల్ ని రచన ని దక్కనివ్వను .. మనసులో స్థిరంగా అనుకొని ..
రచన దగ్గరగా వెళ్లి రచనా .. నాకెందుకో ఇదంతా వృధా ప్రయాస లా అనిపిస్తుంది . యశ్వంత్ నీ కనుల ముందరే
అంత ఇబ్బంది పడ్డాడు . అయినా నువ్వేం అడ్డుకోలేదు . మళ్లి మడుగు లోకి దూకినా నువ్వు వద్దన లేదు .
ఈ మహల్ కోసం నువ్వు వారి ప్రాణాల ని పణం గా పెట్టడం సమంజసమా ? అంది సత్య లో ఉన్న వైజయంతి తన
మాటలు రచన కి మాత్రమే వినబడేలా .
సత్య మాటలకి విస్తుపోయి చూసింది రచన .
సత్యా .. నువ్వేనా ఇలా అంటుంది ? నా ఉద్దేశ్యం నీకు తెలీదా ? యశ్ ,మురారి ఎవరి బలవంతం తోనూ ఈ పని
చేయటం లేదు . మనస్ఫుర్తి గా చేస్తున్నారు . నువ్విలా అంటుంటే నాకు ఇబ్బందిగా ఉంది .. అంది రచన
చిన్నబుచ్చు కుంటూ .
అయ్యో .. నా ఉద్దేశ్యం నిన్ను తప్పుబట్టడం కాదు రచనా .. నువ్వే ఆలోచించు . ఈరోజు కాకపోతే రేపు యశ్వంత్
నువ్వూ భార్యా భర్తలు కావాల్సిన వారు . యశ్వంత్ కి ఏమైనా జరిగి ఉంటె పరిస్థితి ఏమిటి అన్నది ఆలోచించావా ?
అంది సత్య .
రచన ఆమె వైపు విచిత్రంగా చూసింది . నువ్వు మాట్లాడుతూ ఉంటె నీ మాట తీరు .. అసలు నువ్వు సత్య వేనా అని
పిస్తుంది . అని అక్కడి నుంచి ముందుకి నడచి మడుగు ఒడ్డునే నిలబడి యశ్వంత్ ,మురారిలని గమనించ సాగింది
రచన .
సత్య కొంచెం తొట్రుపాటు పడినా .. తేరుకొని .. నువ్వీ క్షణం నా మాటల్ని పట్టించుకో పోవొచ్చు గాక . కానీ నా
పలుకులు నీ గుండె ని గుచ్చుకోవటం గమనించానే చిన్నదానా ... అనుకొంది మనసులో .
ఇంతలో నీటి పైకి తేలారు యశ్వంత్ ,మురారిలు .
శివ ఆత్రుతగా ఏమైనా కనిపించిందా ? అని అడిగాడు .
లేదు శివా .. మడుగు అడుగంతా గాలించాం . ఆ చెరువు లో కనిపించినట్లు ఏటువంటి రాతి పలకలు కనబడలేదు .
నిరాశగా అన్నాడు యశ్వంత్ .
మురారి సత్య వైపు అనుమానం గా చూశాడు . " ఈమె వల్ల ఈ ప్రయత్నం విఫలం కాలేదు కదా ? అనే ఉద్దేశ్యం తో
చూసిన మురారి చూపును చూసి వ్యంగ్యంగా నవ్వింది సత్య .
ఇంకా ఉంది
1 comment:
Ayyo.. Ee episode lo peddaga story ledu. Naakemo kadhantaa okasari chadavalani aatramga undi
Post a comment