Powered By Blogger

Monday, 31 March 2014

రుధిర సౌధం 107

మడుగు లో తన కాళ్ళని ఆడిస్తూ .. లేదు యశ్వంత్ .. నేనేమీ తప్పు చేయటం లేదు కదా అని ఆలోచిస్తున్నాను ..

అంది నిరాసక్తంగా రచన .

అదేంటి ?ఇంతకీ ఏ విషయం లో ఇలా ఆలోచిస్తున్నావు ? అని అడిగాడు యశ్వంత్ .

యశ్ .. ఇంతకి ముందు సత్య నాతొ ఏమందో తెలుసా ? అంటూ సత్య కి తనకి నడుమ జరిగిన సంభాషణ కోసం

చెప్పింది రచన .

ఓహ్ అంతేనా ? దీనికోసమా ఇంత ఆలోచిస్తున్నావు ? ఒక్కోసారి  మీ ఆడవాళ్ళు వెంటవెంటనే అభిప్రాయా లు

మార్చేసుకుంటారు .. సత్య కూడా అంతే .. నాకలా జరగటం చూసి తనలా మాట్లాడి ఉంటుంది . తనకి మురారి

నచ్చచెబుతాడు లే . నువ్వేం ఆలోచించకు .. అయినా ఎన్ని అడ్డంకుల నైనా ఎదుర్కొని ఇంతా చేస్తున్నాం .

అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాల కోసం ఆలోచన అవసరమా ? పద .. నాకు చాలా ఆకలిగా ఉంది .

అని లేచి ఆమె కి తన చేయి అందించాడు యశ్వంత్ .

ఆమె అతడి వైపు చిరునవ్వు తో చూసి అతడి చేతిని అందుకొని లేవటానికి ప్రయత్నించింది . కానీ మడుగు లో

కాళ్ళు పెట్టుకొని కూర్చోవడం వల్ల ఆమె గౌన్అంచు దేనికో చిక్కుకు పోయింది .

అయ్యో .. యశ్ .. నా గౌన్ దేనికో చిక్కుకు పోయింది .. చిరిగిపోతుందేమో .. ఆందోళన గా అంది రచన

డోంట్ వర్రీ మేడం .. నేను దాన్ని చిరిగిపోకుండా తీస్తాను గా అని మడుగులోకి దిగాడు యశ్వంత్ . ఆమె గౌన్

చిక్కుకు పోయినట్లు కనిపిస్తున్న చోట చేయి పెట్టి తీయబోయాడు . ఏదో తలుపు ఘడియ లా అనిపించి నొసలు

చిట్లించి రచనా వన్ మినిట్ అని నీటిలోకి మునిగి చూశాడు .

అతని కళ్ళు ఆశ్చర్యానందాలతో చెమర్చాయి . మడుగు అడుగుభాగం అంతా వెదికిన దొరకని రాతి పలక ద్వారం

మడుగు గోడల మీద కనిపించేసరికి అతడికి సంతోషం తో మాటలు రాలేదు .

యశ్ .. ఏమయింది ? నా గౌన్ దేనికి చిక్కుకు పోయింది ? ఒడ్డు మీద నుంచి అడిగింది రచన.

అతడి నీటి పైకి వచ్చి రచనా .. వుయ్ గాట్ ఇట్ .. సంతోషంతో గట్టిగా అరిచాడు యశ్వంత్ .

ఏమయింది యశ్వంత్ ... ద్వారం కనిపించిందా ? కళ్ళింత చేసి అడిగింది రచన .

ముందు నువ్వు మడుగులోకి రా .. అని ఆమె చేయి పట్టుకొని మడుగులోకి లాగాడు యశ్వంత్ .

ద్వారం ఘడియ కి చిక్కుకుపోయిన గౌన్ జాగ్రత్త గా తీసి రచన ని చూపించాడు ఆ రాతి పలకని .

మనిషి కుర్చుని మాత్రమే లోపలికి ప్రవెసించగలిగి నట్లు ఉందది . రచన కనులు ఆనందం తో వెలిగాయి .

ఇద్దరూ కల్సి రాతి పలక ని అతి కష్టం గా తొలగించగానే .. మడుగులోని నీరంతా ఆ మార్గం గుండా రాతి పలక

వెనుక ఉన్న సొరంగ మార్గం లోకి వెళ్ళిపోయాయి .

మడుగు నీళ్ళు లేకుండా బురద తో నిండిపోయున్నా మళ్ళి ఒకరంద్రం గుండా నీళ్ళు ధారగా రావటం గమనించాడు

యశ్వంత్ .

రచనా .. మడుగులో నీళ్ళు ఖాళీ కాగానే మళ్ళి ఆ చెరువు లో నీరు వచ్చి చేరుతోంది . మడుగు నిండే లోగా మనం

ఈ లోపలికి వెళ్ళాలి ఈ పలక మూసేయాలి లేదంటే సొరంగమార్గం అంతా నీళ్ళతో నిండిపోతే కష్టమైపోతుంది . అన్నాడు యశ్వంత్ .

తల ఊపి మేను ఒంచి లోపలికి వెళ్ళింది రచన . ఆమె వెనుకే వెళ్లి పలక ని యథా స్థానం లో పెట్టాడు యశ్వంత్ .

ఇంకా ఉంది మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

1 comment:

స్వర్ణమల్లిక said...

Chaalaa bagundi. Ee episode naku nachindi. Kadha munduku kadilindi.