సూర్యుడు పడమట అస్తమించటానికి సిద్ధ పడుతున్నాడు .
చల్లగాలి మేను ని పలకరిస్తుంటే అలవోక గా కురులను సర్దుకుంటూ వెహికల్ నడుపుతున్న రచన ని చూసి అంది
సత్య .. కాసేపు ఈ చల్లగాలిలో కుర్చుందామా ? అని .
వెహికల్ ఓ పక్కగా ఆపి ఇద్దరూ కార్ దిగి పైర్ల మధ్యలో ఉన్న రాతి నేలపై కూర్చున్నారు .
ఈ రావణ పురం వచ్చాక ఏవేవో జరిగిపోయాయి రచనా .. అందుకే మురారి పుట్టిన రోజుని మర్చి పోయాను .
నువ్వు బాగా గుర్తు చేసావు నాకు .. కానీ ఈ పూలతో ఎక్కడ డెకరేట్ చేయాలి ... మురారి ని ఎలా సర్ప్రైజ్ చేయాలో
ఆలోచిస్తున్నా .. అని నువ్వే ఏదన్నా సలహా ఇవ్వరాదూ .. అంది సత్య .
చిరునవ్వుతో .. నువ్వు మురారితో ఏకాంతం గా ఉండాలి అనుకుంటే రావనపురం లో రాణి మహల్ కన్నా గొప్ప
ప్లేస్ ఎక్కడుంటుంది ? అంది చిలిపిగా రచన .
అక్కడ .. బావుంది నీ సలహా .. మాకింకా ఏకాంతం ఉంటుందా ? అక్కడ వైజయంతి ఉంది కదా .. మమ్మల్ని
ప్రశాంతం గా ఎక్కడ ఉంచుతుంది .. ? అంది కాస్త చిరాకు ని ప్రదర్శిస్తూ ..
అలా ఐతే మహల్ బయట అద్దాల మంటపాలు ఉన్నాయి కదా .. కావాలంటే నేను నీకు సహాయం చేస్తాను అంది
రచన .
చూద్దాం రచనా .. మహల్ లో ఎందుకులే అని ఆలోచిస్తున్నా .. అంది సత్య .
నీ ఇష్టం .. అంది రచన .
కాని నువ్వు చెప్పినట్టు వేరే అందమైన ప్లేస్ కూడా ఏదీ కనపడటం లేదుగా .. సరే మహల్ మండపం లో నే ..
ప్లాన్ చేస్తాను .. ఐతే నువ్వు సరాసరి మహల్ కి పోనిస్తావా ? అంది సత్య .
పద ... అని వెహికల్ వైపు నడిచింది రచన . ఆమె ని అనుసరించింది సత్య . వెహికల్ ముందుకి సాగిపోయింది .
ఊర్లోకి వచ్చేశాం .. మహల్ కె పోనిస్తున్నా లే .. అంది చిరునవ్వుతో రచన .
ఆమె వైపు చూసి మనోహరం గా నవ్వింది సత్య .
వెహికల్ సరాసరి మహల్ వైపు సాగింది .
*******************
వీరాస్వామీ ... ఏంటి ఇక్కడకి రమ్మన్నావు ? అన్నాడు భూపతి .
ఇప్పుడు మనల్ని గమనించే వోలు ఉన్నారు సామీ .. అందుకే ఈడకి రమ్మన్నది .. అన్నాడు వీరాస్వామి .
సరే .. విషయం ఏంటి చెప్పు ? అన్నాడు భూపతి అసహనం గా .
బసవరాజు ఆత్మని వాళ్ళు విడిపించారు కానీ నేను మళ్ళి తిరిగి బంధించాను . మహల్ లో ఉన్న గుడి ద్వారం ఏడ
పట్టుకోవాలో వాడికే తెలుసు . కానీ వాడిది మొండి ఆత్మ . అందుకే ఇన్నేల్లైనా ఆ మహల్ నే అంటి పెట్టుకున్నాడు .
అన్నాడు వీరాస్వామి .
చూడు వీరాస్వామీ .. మరోసారి వాళ్ళు ఆ బసవ రాజు ని నీనుంచి రక్షించరని నమ్మక మేముంది ? ఇప్పుడు నాకు
ఆ మహల్ లో బంగారం తో పాటూ ,వైష్ణవీ మాత విగ్రహం తో పాటు .. ఆ పట్నం వాళ్ళ చావూ కావాలి ..
దానికి ఏం చేయాలో ఆలోచించు ... అన్నాడు భూపతి .
ఇంకా ఉంది

No comments:
Post a comment