నాకు తెలుసు సామీ .. ఆ పని జరుగుతాది .. నువ్వు నిశ్చింత గుండు స్వామీ .. అన్నాడు వీరాస్వామి .
సరే .. ఆ పట్నం వాళ్ళలో మా ఇంటిలో ఉన్న అమ్మాయి .. అదే.. ధాత్రి .. తనకి మాత్రం ఏటువంటి హానీ
జరక్కూడదు .. ఆ పిల్ల మీద నా కొడుకు మనసు పడ్డాడు .. అన్నాడు భూపతి .
అలాగే సామీ .. కానీ ఆ పిల్ల కూడా నీకు శత్రువే కదా .. అన్నాడు అతడు .
రత్నం రాజు ఎందఱో ఆడపిల్లల మీద మనసు పడ్డాడు .. కానీ ఈ పిల్లని పెళ్లి చేసుకుoటానంటున్నాడు . వాడి
ముచ్చట నేనెందుకు కాదంటాను ? అర్థమైందా ? అన్నాడు భూపతి .
అర్థమైంది సామీ ... నేనోల్లోస్తా .. అని చీకట్లో కలసి పోయాడు వీరస్వామి .
భూపతి ఇంటి ముఖం పట్టాడు .
*************************
ఏమైంది ? ఇంత ఆలస్యమయింది ? మీరు రావటానికి ? ఇంట్లోకి ప్రవేశిస్తున్న రచన ,సత్య లని చూసి అన్నాడు
శివ .
హా .. కొంచెం ఆలస్యమయిందిలే శివా .. ఇంతకీ వీళ్ళిద్దరూ ఎక్కడ ? అని అడిగింది రచన .
మురారి .. అలా కొంచెం హోటల్ దాకా వేల్లోస్తానన్నాడు . యశ్వంత్ ఆ గదిలో ఉన్నాడు . .. అని చెప్పి తానూ
బయటకి నడిచాడు శివ .
నువ్వు యశ్వంత్ ని కలవాలిగా .. పద .. అంది కొంటె గా సత్య రచనని చూస్తూ .
చిన్నగా నవ్వి .. నువ్వీ రోజు బాగా హుషారుగా ఉన్నావు .. అని ..
ముందుకి నడుస్తూ .. యశ్వంత్ నయితే కలవాల్సిందే .. గుడి గురించి ఏమైనా తెలిసిందేమో కనుక్కోవాలి కదా ..
అంది రచన .
అవును .. పద పద .. యశ్వంత్ తో మాట్లాడుదాం .. అని రచన వెనకే యశ్వంత్ గదివైపు నడిచింది సత్య .
గదిలో ఓ చెక్క సోఫా లో కూర్చుని ఏదో ఆలోచిస్తున్న యశ్వంత్ .. వీరి అడుగుల సడి విని వీరి వైపు చూసాడు ..
వచ్చేసారా ? కానీ ఎందుకింత ఆలస్యమయింది ? అని అడిగాడు యశ్వంత్ .
వెళ్లి యశ్వంత్ సమీపం గా కూర్చున్నారు ఇద్దరూ .
మా సంగతి తర్వాత .. ముందు ఈరోజు గుడి గురించి ఆ చెరువు దగ్గరకి మీరు వెళ్లారు కదా .. ఏమైనా తెలిసిందా ?
అని ఆసక్తి గా అడిగింది రచన .
ముందు మీరు ఫ్రెష్ అవొచ్చు కదా .. అన్నాడు యశ్వంత్ .
అదంతా తర్వాత .. ముందు నువ్వు చెప్పు యశ్వంత్ .. అంది సత్య .
సరే ... అని జరిగినదంతా వివరంగా చెప్పాడు యశ్వంత్ .
స్ట్రేంజ్ ... అంది సత్య .
అవును .. ఐతే రాణి మహల్ వెనుక మడుగు లో కూడా ఆ చెరువు ఉన్నట్టు సొరంగ మార్గం ఉంది అంటావా ?
అంది రచన సాలోచన గా .
ఖచ్చితం గా చెప్పలేను రచనా .. కాని ఉందేమో అని నా అనుమానం . అన్నాడు యశ్వంత్ .
సరే ఐతే రేపు ఆ పని పూర్తీ చేయాల్సిందే అంది రచన .
తప్పకుండా .. అన్నాడు యశ్వంత్ . ఇంతకీ సరస్వతి విషయం ఏమయింది ? అడిగాడు .
ఆఫీసర్ స్టేట్మెంట్ తీసుకున్నాడు యశ్వంత్ . రేపు మన మురారి పుట్టిన రోజు . సత్య తనకోసం ఏవో ఏర్పాట్లు
చేసుకుంది .. అందుకే మాకు కాస్త ఆలస్యమయింది . అంది రచన .
ఓహ్ నిజమే కదూ .. అన్నాడు యశ్వంత్ సంతోషం గా .
ఇంకా ఉంది
1 comment:
going very interesting ly..
Post a Comment