అందుకే రేపు మురారి ,సత్యలను ఏకాంతం గా వదిలేద్దాం .. వాళ్లకలా ప్రైవసీ ఇవ్వటమే వాళ్లకి మనమిచ్చే గిఫ్ట్ ..
ఏమంటావ్ ? అంది రచన కొంటె గా సత్య వైపు చూస్తూ ..
ఓహ్ .. అలా అయితే .. ఓకే .. గానీ రేపు ఓ ఇంపార్టెంట్ టాస్క్ ఉంది కదా .. మురారి ఉండటం ఎంతో ముఖ్యం ..
అన్నాడు యశ్వంత్ .
ఓహ్ .. కం ఆన్ .. యశ్వంత్ . .. మనమంతా ఉన్నాం కదా .. మేనేజ్ చేస్కోలేమా ? అంది రచన .
సరే రచనా .. అని సత్య వైపు తిరిగి .. సత్యా .. నువ్వు మురారి తో హ్యాపీ గా స్పెండ్ చెయ్ .. మిగతా పనులు మేము
చూసుకుంటాం .. అన్నాడు యశ్వంత్ .
థాంక్స్ యశ్వంత్ .. బట్ నేను మురారికి నైట్ 12 గం లకి విష్ చేద్దామనుకుంటున్నా .. అంది సత్య .
ఓకే .. అది నీ ఇష్టం .. అన్నాడు యశ్వంత్ .
బట్ యశ్వంత్ .. మేము ఏర్పాట్లు మహల్ లో చేసాం .. అంది రచన .
వాట్ ? అరె తెలిసీ అలా ఎలా ఆలోచిస్తావు రచనా ? పార్టీ చేసుకోవాలంటే మనుషులు ఉండాలి .. దెయ్యాలు కాదు ..
అన్నాడు యశ్వంత్ చిరాకుగా ..
మహల్ లోపల కాదులే యశ్వంత్ .. అయినా మరో మంచి చోటు ఏముంది ఈ ఊరిలో .. నువ్వే చెప్పు .. అయినా
నేను బాగా అరేంజ్ మెంట్స్ చేసుకొన్నాను .. రాత్రి 12గం ఎవరూ రాకుండా ఉండే చోటు అదేకదా .. ప్లీజ్ అంది సత్య .
నీకింత ధైర్యం ఎలా వచ్చింది సత్యా ? ఐ డోంట్ బిలీవ్ దిస్ .. అన్నాడు యశ్వంత్ .
ధైర్యం అంటే మురారి వల్లనే .. అయినా మనం మహల్ కి ఎన్నిసార్లు వెళ్లి రాలేదు ? ఆ దెయ్యం మనల్ని ఏం చేయ
గలిగింది ? అంది సత్య .
సరే .. నువ్వింత కాన్ఫిడెంట్ గా ఉంటే నువ్వనుకున్నట్లే కానీ .. అని ఆ గది లోంచి బయటకి వెళ్ళిపోయాడు యశ్ .
యశ్ ముభావం గా వెళ్ళిపోవడం తో .. రచనా .. యశ్ కేమన్నా కోపం వచ్చిందా ? అని అడిగింది సత్య .
నెవెర్ .. నువ్వేం వర్రీ కాకు . మనం సిస్టం లో మురారి కోసం బెస్ట్ మెసేజ్ టైపు చేద్దామనుకున్నం కదా .. పద
ముందు ఆ పని చేద్దాం .. అంది రచన .
ఇద్దరూ కలిసి సత్య గదికి వచ్చారు .
సిస్టం ముందు కూర్చుంది సత్య . సిస్టం కి కొంచెం దూరం లో నేల పై ఉన్న పరుపు పై మేను వాల్చింది రచన .
చెప్పు రచనా .. వర్డ్ ఓపెన్ చేసాను .. ఏదైనా మంచి థాట్ చెప్పు అంది సత్య .
ఆమె వంక చిరునవ్వుతో చూసింది రచన .
(ఇంకా ఉంది )
No comments:
Post a comment