వెళ్ళిపోతున్న రచన ని చూసి హాయిగా నిట్టూర్చి తన చేతిలోని పూలవంక చిరునవ్వుతో చూసింది .
ఆమె మనసు ఆక్షణం ఆమె రాణి మహల్ పరిసరాలలో ఉందన్న సంగతి మరచింది . మనసుపడ్డ వాడికోసం ఆశగా
ఎదురు చూస్తుంది .
మురారి కి ఇష్టమైన ఫ్లవర్స్ .. ఇష్టమైన కలర్ డ్రెస్ .. ఇష్టమైన నేను .. తన పుట్టినరోజుని సంతోషం గా
ఆహ్వానించాలి ... చల్లగాలికి ఎగురుతున్న కురులని సరిచేసుకుంటూ మనసులో తీర్మానిన్చుకుంది సత్య ..
మహల్ గేటు దాటి బయటకి వచ్చిన రచన గేటు బయట ఎవరో తచ్చాడుతున్నట్లు అనిపించి .. ఎవరూ ? అని
అరచింది.
హే మెల్లిగా .. నేనే .. అన్నది ఓ మగ స్వరం .
యశ్ .. నువ్వా ? నువ్వేం చేస్తున్నావిక్కడ ? విస్తుపోతూ అడిగింది రచన .
ఏం చేయను ? నీకూ ,సత్య కి వచ్చిన ఐడియా మూలం గా నేనిక్కడ ఉండాల్సి వచ్చింది .. సత్య కి ,మురారికి
కాపలా ఉండాలి కదా .. వాళ్లకి ఎటువంటి సమస్యా ఎదురు కాకుండా .. అన్నాడు యశ్వంత్ .
యశ్ .. వాళ్ళ ఏకాంతానికి .. అని రచన ఏదో చెప్పబోతుంటే ..
వాళ్ళ ఏకాంతానికి ఏ భంగం వాటిల్లదు .. కానీ నువ్వు ఇక్కడే ఉండు .. నాకు తోడుగా .. శివ కూడా .. ఇక్కడే
ఎక్కడో ఉండుంటాడు .. అన్నాడు యశ్వంత్ .
గాడ్ .. ఎలా చెప్పను ? వాళ్ళని సరదాగా గడపమని చెప్పి మనం వాళ్ళని గమనిస్తూ ఉంటామా ? బావుంది ..
సత్య చూస్తే ఏమనుకుంటుంది ? అంది రచన కోపం గా .
రచనా .. సిల్లీగా మాట్లాడకు .. ఇక్కడ వాళ్ళని ప్రమాదం ఒడ్డున పెట్టి నేను నిశ్చింతగా నిద్రపోలేను .. అయినా నేను
మురారికి చెప్పాను .. ఏదైనా సమస్య వస్తే తన దగ్గర ఓ అలారం ఉంది మొగించమని .. అన్నాడు చుట్టూ గమనిస్తూ
యశ్వంత్ .
వాళ్ళ సెలబ్రేషన్ ని కూడా నువ్వు ఆపరేషన్ చేస్తున్నావా యశ్ .. ? సత్య ఈ మధ్య డల్ గా ఉంటుంది .. ఆ డల్ నెస్
పోవటానికి తనలో కొంత సంతోషం నింపాలని నా ప్రయత్నం .. అర్థం చేసుకో యశ్ .. అంది రచన .
రచన .. నువ్వు వెళ్లి పడుకో .. మనం తర్వాత మాట్లాడుకుందాం .. నేను సత్య కి తెలియనివ్వను .. అంతేకాదు ..
నేను వాళ్ళని గమనించను .. కానీ మురారి అలారం మోగిస్తే అలెర్ట్ గా ఉండాలికదా .. అన్నాడు యశ్వంత్ .
గో టు హెల్ .. అని చిరాగ్గా ముందుకి నడిచింది రచన .
****************************************
మురారీ .. అంటూ లోపలికి వచ్చిన రచన ని చూసి .. రా రచనా .. అన్నాడు మురారి .
తన చేతిలో ఉన్న గులాబీల బోకే అతని చేతికందించి హ్యాపీ బర్త్ డే .. అంది రచన .
థాంక్స్ .. అని .. నీ ఫ్రెండ్ మహాల్ల్లో వెయిట్ చేస్తుంది .. వెళ్ళాలి అన్నాడు మురారి .
అవును .. కానీ యశ్ .. అని ఆమె ఏదో అంటుండగా ..
యశ్ .. ఆలోచన నాకు తెలుసు రచనా .. యు డోంట్ వర్రీ .. నేను చూసుకుంటాను .. అన్నాడు మురారి .
సరే .. నేనిక్కడే నిద్రపోతాను .. బాగా లేట్ ఐంది .. భుపతివాళ్ళు నిద్రపోయుంటారు అంది రచన .
సరే రచనా .. నేవెల్తాను అని బయటికి నడిచాడు మురారి .
ఇంకా ఉంది

No comments:
Post a Comment