శివా .. ఏదో అరుపులు వినిపిస్తున్నాయి .. సం థింగ్ రాంగ్ .. అని మండపం వైపు చూసాడు యశ్వంత్ .
యశ్ అటు చూడు .. సత్య మహల్ వైపు అలా ఎందుకు పరిగెడుతుంది ? ఏదో జరుగుతుంది లెట్స్ గో యశ్ .. అని
ముందుకి దూకాడు శివ .
యశ్వంత్ కూడా ముందుకి పరుగుతీసాడు .
సత్య ఎంత వేగం గా పరుగుతీసిందంటే ఆమె మహల్ ద్వారం చేరుకోగానే హటాత్తుగా మహల్ ద్వారం తెరచుకుంది .
కనురెప్ప తెరచేలోగా ఆమె మహల్ లోనికి పరుగుతీసింది . ఆమె లోపలి కి వెళ్ళగానే తలుపులు
మూసుకోబోతుండగా చూసిన మురారి ఒక్క ఉదుటున లోపలికి దూకాడు .
అతను లోపలికి దూకగానే విసురుగా తలుపులు మూసుకున్నాయి .
యశ్వంత్ ,శివ అక్కడికి చేరుకునే లోపే అంతా కనురెప్పపాటు లో జరిగిపోయింది ...
గాడ్ ... అని తల పట్టుకున్నాడు యశ్వంత్ .
శివ పరుగున వెళ్లి తలుపులు బాదటం మొదలుపెట్టాడు .. మురారీ .. డోర్ ఓపెన్ చెయ్ .. గట్టిగా అరుస్తున్నాడు శివ
యశ్వంత్ మనసు ఎందుకో కీడు శంకించింది . ఎందుకో పరిస్థితి అనుకూలం గా లేదనిపించింది .. ఏం చేయాలి
ఇప్పుడు ? తల పట్టుకుని ఆలోచించాడు . రచన మీద పట్టలేనంత కోపం వచ్చింది . ఎందుకు ఇలా జరిగింది ?
రచన చెప్పినప్పుడైనా తను వారించి ఉండి ఉండాల్సింది . అనుకొంటూనే శివ వైపు చూసాడు . పిచ్చిగా తలుపుల్ని
బాదుతున్నాడు శివ .
శివా .. మురారి ,సత్య తలుపులు తీసే పరిస్థితి లో ఉండి ఉండరు . ముందు త్వరగా ఇంటికి వెళ్లి రచన ని తీసుకురా
ఈలోపు నేనెలాగైనా లోపలికి వెళ్లటానికి ప్రయత్నిస్తాను అన్నాడు యశ్వంత్ .
ఇప్పుడెందుకు రచన ? అన్నాడు శివ బాధతో పూడుకుపోయిన గొంతుతో .
ప్లీజ్ డు వాట్ ఐ సే శివా ... అన్నాడు యశ్వంత్ .
సరే .. అని గిరుక్కున వెనక్కి తిరిగి ఇంటివైపు దౌడు తీసాడు శివ .
శివ అలా వెళ్ళగానే చుట్టూ చూసి మండపం దగ్గర పడున్న ఒక పెద్ద కర్ర ని తీసుకొచ్చి తలుపుల్ని బద్దలు కొట్టే
పనిలో పడ్డాడు యశ్ .
******************************************
మురారీ .. మురారీ ఏమైంది లే మురారీ ... అంటూ కిందపడున్న మురారి ని లేపసాగింది సత్య .
మెల్లిగా కళ్ళు తెరచి చూసాడు మురారి . అస్పష్టం గా సత్య రూపం కనబడింది . కళ్ళు నులిమి లేచి సత్యా నువ్వు
బాగానే ఉన్నావు గా .. అన్నాడు మెల్లిగా .
నేను బాగానే ఉన్నాను కాని మనం లోపలికి ఎలా వచ్చాం ? నువ్విక్కడ ఎలా పడున్నావు మురారీ ? అని అడిగింది
సత్య .
అదేంటీ సత్యా .. నువ్వేకదా లోపలికి పరిగెత్తావు ... నీవెంటే నేనూ వచ్చాను .. అయినా ఒక్కసారిగా నువ్వెందుకలా
ప్రవర్తించావు అని అడిగాడు మురారి .
నేనా ? విచిత్రం గానా ? అని తెరలుతెరలు గా నవ్వసాగింది ఆమె . ఆమె శరీర తత్వం చూస్తే ఆమె సత్యలా
అనిపించలేదు ముర్రారికి .
సత్యా .. అని ఆమె వంక విస్తుపోతూ చూసాడు మురారి .
మురారీ సేవ్ మీ .. అంటూ అంతలోనే దీనం గా అంది సత్య . ఆమె ఒంటి మీద గౌను అంతా చినిగి పోయి ఉంది ..
సత్యా .. ఏంటి ఇలా చేస్తున్నావు ? అనేలోపే మొండెం లేని కాళ్ళు వారి వైపు వస్తూ కనిపించాయి . ...
మురారి దగ్గరలోనే ఉన్న ఒక పాత కత్తి ని చేతిలోకి తీసుకొని ఆ విచిత్రాకారాన్ని కొట్టేందుకు ప్రయత్నించాడు .
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a comment