సత్య భయంగా అతడి వెనుక నక్కింది . ఆ కాళ్ళు వీరివైపే వస్తున్నాయి . ఆ దృశ్యం ఒళ్ళు గగుర్పోడిచేలా ఉంది .
మురారి కత్తి తో ప్రతిఘటిస్తూనే ... యశ్వంత్ ... సేవ్ అస్ అని గట్టిగా అరిచాడు .
కానీ ఆ అరుపు అతని గొంతు దాటి బయటకి రాలేదు .
మురారీ భయంగా ఉంది .. అంది వణుకుతున్న గొంతుతో సత్య .
సత్య .. భయపడకు .. నేనున్నాగా .. ఈ వైజయంతి ఆటలు మన దగ్గరా ? ధైర్యాన్ని మనసులో నింపుకుంటూ
అన్నాడు మురారి .
వెంటనే సత్య అతని వెనక నుంచి ముందుకి వచ్చి అతని చేతిలో కత్తిని రెప్పపాటు లో తన చేతిలోకి లాక్కుంది
. మరో చేతితో అతని జుట్టు ని గట్టిగా పట్టుకొని .. అంత ధైర్యమా నీకు ? వైజయంతి అంటే అంత చులకనా ? మహల్
నాది .. వేరొకరికి దక్కనివ్వను . మీ ప్రాణాలు పోవటానికి మరింక ఎంతకాలమో లేదు . ఆ గుడి దొరకదు . ఈ
మహల్ నీ స్నేహితురాలికి దక్కదు . ఈ క్షణం నుండీ మీ కష్టాలు మొదలుకానున్నాయి .. ప్రాణం పోదు .. ఎందుకు
ఉందా ? అనిపించేలా చేస్తాను ... అని విసురుగా అతణ్ణి ముందుకి తోసి .. ఇది నీ ప్రాణం కదూ .. దీని శరీరమే నాకు
అనువు . ఈ విషయం చెప్పాలని నువ్వెప్పుడు అనుకుంటావో ఆ క్షణం నీకళ్ళ ముందే దీని ప్రాణం గాలిలో కలసి
పోతుంది . మహల్ నాకు వదిలేయండి . లేదంటే ............. అని వికృతంగా అరచింది సత్య శరీరం లో ఉన్న ఆత్మ.
ఎవరు నువ్వు ? వైజయంతి వేనా ? మెల్లిగా అడిగాడు మురారి .
అవును .. రాకుమారి వైజయంతి ని . ఆ విధాత్రి అండ చూసుకొని నీ స్నేహితుడు మిడిసి పడుతున్నాడు . ఆ
మిడిసిపాటు ఇంకెంత కాలం ? నేను ప్రేతాన్ని మాత్రమె కాదు భయంకర జ్వాలా రూపాన్ని . గర్జించింది సత్య .
సత్యని వదిలేయ్ వైజయంతి .. అన్నాడు మురారి .
వదిలే ప్రసక్తే లేదు . ఇక నుంచీ నేను మీతోనే ఉండబోతున్నాను . ఈ విషయం నీ నోటి నుండి వచ్చిన క్షణం సత్య
మరణిస్తుంది . అని ప్రేతాత్మ చెప్పి సత్యని వీడి వెళ్ళిపోయింది .
తోటకూర కాడ లా కింద పడిపోయింది సత్య .
పరుగున సత్య దగ్గరకి వెళ్లి .. సత్యా .. అని ఆమెని గుండె కి హత్తుకున్నాడు మురారి .
*******************************
నిద్రపట్టక అటూ ఇటూ దొర్లుతూ అనుకోంది రచన .
ఈపాటికి మురారి ,సత్య ఒకరిఒకరు సంతోషం గా ఉండి ఉంటారు .
అనవసరం గా యశ్ మీద కోప్పడ్డాను . కాసేపు నేనూ అక్కడే ఉండాల్సింది . తనతో గడిపే అవకాశం నాకూ దక్కేది
ఆమె ఆలోచనలను చెదరగొడుతూ తలుపులు బాదుతున్న చప్పుడు వినిపించేసరికి మంచం మీదనుండి కిందకి
దిగి గుమ్మం వైపు పరుగుతీసింది రచన .
(ఇంకా ఉంది )

No comments:
Post a comment