తలుపులు తీసేసరికి గుమ్మం లో వగరుస్తూ కనిపించాడు శివ .
అతణ్ణి చూడగానే ఆశ్చర్యం తో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి ..
శివా .. ఏంటిలా ఉన్నావు ? ఏమయింది ? ముందు లోపలికి రా .. అంది రచన కంగారుగా .
మురారి ,సత్య ఆపదలో ఉన్నారు .. త్వరగా రా రచనా .. వగరుస్తూనే అన్నాడు శివ .
వ్వాట్ ? అదిరిపడింది రచన .
ఆమె చేయి పట్టుకొని సమయం లేదు .. పద అని మళ్ళి పరుగు మొదలుపెట్టాడు శివ . ఆమె అతని వెంటే పరుగు
తీసింది .
పరిగెడుతూనే శివా ఏం జరిగిందో చెప్పు శివా ? అంది రచన ఆయాసపడుతూనే .
శివ ఏం మాట్లాడలేదు . కాసేపట్లోనే వాళ్ళు మహల్ చేరే సరికి తలుపు బద్దలుకొట్టే ప్రయత్నం లో ఉన్నాడు
యశ్వంత్ .
యశ్ .. ఏమయింది ? ఏం చేస్తున్నావు నువ్వు ? అంది అతని వెనకాలే నిలబడి రచన .
ఆమె గొంతు విని వెనక్కి తిరిగిన యశ్వంత్ విసురుగా చాచి పెట్టి ఆమె బుగ్గమీద ఒక్కటిచ్చాడు .
విసురుగా వెళ్లి నేల పై పడింది రచన . కళ్ళలో నీళ్ళు తిరుగుతుంటే ... యశ్ .. అంది బుగ్గమీద చేయి వేసి రచన .
ఆమె బుగ్గ ఎర్రగా కందిపోయింది .
ఇదంతా నీవల్లే రచనా .. ముందు మహల్ కీస్ ఇవ్వు .. అన్నాడు కోపంగా యశ్వంత్ .
ఆమె చినబోయిన వదనం తో అతడికి కీస్ అందించింది . ఆమె దగ్గర కీస్ అందుకొని యశ్వంత్ తాళం తీస్తుంటే శివ
రచన కి చేయి అందించి ఆమెని పైకి లేపాడు .
ఇంతలో.. యశ్వంత్ .. అన్న మురారి పిలుపు విని తాళం తీయటం ఆపి ఒక్కసారిగా వెనక్కి చూసాడు యశ్ .
అక్కడ మురారి ,సత్య నిలబడి ఉన్నారు .
శివ ,యశ్వంత్ ఆశ్చర్యం గా అతడి వంక చూస్తుంటే రచన అయోమయం గా చూసింది .
యశ్వంత్ .. మీరంతా ఏం చేస్తున్నారిక్కడ ? అని అడిగాడు మురారి .
మురారీ .. అదీ .. ఇప్పుడే కదా మీరిద్దరూ .. లోపలికి .. అని అయోమయం గా అన్నాడు యశ్వంత్ .
లోపలికి ఏంటి ? ఏమయింది ? మీరంతా మా వైపు అంత విచిత్రం గా చూస్తున్నారు ఏంటి ? అన్నాడు లేనిపోని
ఆశ్చర్యం నటిస్తూ .. మురారి
శివ .. యశ్వంత్ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు నోట మాట రాక .
సత్యా .. మీ ఇద్దరూ బాగానే ఉన్నారుగా .. మీరేదో ప్రమాదం లో ఉన్నారని శివ చెబుతున్నాడు .. అంది గబ గబా
సత్య దగ్గరకి నడిచి .. రచన .
ప్రమాదమా ? అదేంటీ రచనా ? ఇక్కడ మేమిద్దరం ఎంజాయ్ చేస్తుంటే మీరే ఇక్కడ ఏదో హడావిడి చేస్తుంటే ఇలా
వచ్చి చూసాం . ఏమైంది మీ అందరికి ? అంది సత్య లో ఉన్న వైజయంతి .
రచన వెంటనే యశ్వంత్ వైపు కోపం గా చూసింది .
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a Comment