Powered By Blogger

Thursday, 13 March 2014

రుధిరసౌధం 94

ఆమె వైపు అయోమయం గా చూశాడు యశ్వంత్ .

మళ్ళి సత్య , మురారిల వైపు తిరిగి సారీ .. మేమంతా వెళ్తాం .. యు బోథ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ .. అంది రచన .

ఫర్వాలేదు ఎలాగూ డిస్టర్బ్ అయ్యాం .. కలిసే వెళ్దాం ఇంటికి .. అన్నాడు మురారి .

నో మురారీ .. మీరు ఉండండి .. అని వెనక్కి తిరిగి యశ్వంత్ ,శివాల వైపు కోపం గా చూస్తూ మీరిక్కడే కాపలా

కాస్తారా లేక వస్తారా ? అంది రచన .

రచనా .. మేము మా కళ్ళతో చూశాం .. సత్య పిచ్చి పట్టిన దానిలా లోపలికి పరిగెత్తింది . సత్య వెనుకే మురారి ..

మా మాట నిజం .. అన్నాడు శివ .

మురారి శివ వైపు బాధ గా చూశాడు .. యశ్వంత్ నిర్ఘాంతపోయి చూస్తున్నాడు ..వాళ్లిద్దరూ సరదాగా అటూ ఇటూ పరుగులు పెడితే ఏదో జరిగిపోయిందని అనుకోవడమేనా ? అంతే కాదు ఆవేశానికి

లోనై పోవటం నా చెంప పగలకోట్టేయటం .. వెరీ గుడ్ .. కాసేపు వాళ్ళని వదిలేసుంటే వాళ్ళు సంతోషం గా

గడిపేవాళ్ళు .. ప్రతీ విషయాన్నీ పరిశోదిస్తూ పోతే మనశ్శాంతి కరువైపోతుంది .. కోపం గా అంది రచన .

సారీ సత్యా .. పొరపాటు పడ్డాం .. తప్పుగా అనుకోవొద్దు .. అని మొహం దించుకుని వారి ముందు నించి

వెళ్ళిపోయాడు యశ్వంత్ .

యశ్వంత్ ని చూసి శివ కూడా సారీ అని చెప్పి యశ్వంత్ వెనుకే నడిచాడు .

మురారి ని సత్య ని చూసి ..  ఇదంతా మనసులో పెట్టుకోవొద్దు .. వాళ్ళిద్దరికీ ఎప్పుడు కర్తవ్య నిర్వహణ తప్ప వేరే

ఏం పట్టదు . మీకే మన్నా ప్రమాదం జరుగుతుందేమో అని భయపడ్డారు . ఏవోవో ఊహించుకొని మిమ్మల్ని ఇలా ..

అని రచన ఇంకేదో అనబోతుండగా ..

ఫర్వాలేదు రచనా .. కానీ నువ్వు యశ్ ని యెప్పుడు తప్పుగా భావించకు . అతడెప్పుడు తప్పు చేయడు ..

అన్నాడు  మురారి కళ్ళతోనే రచన కేదో చెప్పాలని ప్రయత్నిస్తూ ..

సరే .. నేనింకా మీ టైం వేస్ట్ చేయను . బాయ్ అని చెప్పి వెళ్ళబోతూ .. ఏదో అనుమానం వచ్చిన దానిలా వెనక్కి

తిరిగి .. సత్యా వచ్చేటపుడు చూసాను మండపం లో పూలు అన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయేంటి ? వాటినలా

చూసి నిజం గానే మీకేమన్నా జరిగిందేమోనని నేనూ భావించాను .. అంది రచన .

అదీ .. రచనా .. పూలతో ఒకరినొకరు సరదాగా కొట్టుకున్నాం .. అందువల్లే .. అని సంకోచం గా అంది సత్య .

ఓహ్ .. సారీ ఇలా అడిగినందుకు .. సరే ఇక నే వెళ్తాను .. అని ముందుకి నడిచింది రచన .

గేటు దగ్గర నిలబడిన యశ్వంత్ భుజం మీద చేయి వేశాడు శివ .

ఒక్కసారి వెనక్కి తిరిగి .. శివా .. నాతో పాటూ నువ్వూ చూశావు .. ఒకేసారి ఇద్దరు పొరపాటు పడే అవకాశం

ఉంటుందా? అదెలా సాధ్యం .? వాళ్ళు లోపలికి వెళ్ళగానే తలుపులు మూసుకు పోయాయి కూడా .. అన్నాడు యశ్

అవును యశ్ .. నాకూ అదే అర్థం కావడం లేదు . బట్ మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయా ? ముందు జరిగిన

సంఘటన ని ఇవే కళ్ళు చూశాయి . ఆ తర్వాతా ఇవే కళ్ళు తరువాతి సంఘటన ని చూశాయి . ఏది నిజమని

నమ్మాలి ? అన్నాడు శివ .

మన కళ్ళు ,చెవులు నిజాలని నిర్థారించ లేకపోవోచ్చు .. కాని మనసు .. నా మనసు ఏదో జరిగిందని నాకు

చెబుతోంది శివా అన్నాడు యశ్వంత్

ఇంకా ఉంది మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

No comments: