ప్లీజ్ నా సత్య నొదిలి వెళ్ళిపో వైజయంతీ .. సత్య నీకేం హాని చేసింది .. నా సత్య లో నిన్ను చూడలేను .. దీనంగా
అర్థించాడు మురారి .
నేను ఇలా వచ్చేలా చేసింది మీరే . ఎందుకు ? ఎందుకు నా మహల్ జోలికి వచ్చారు ? ఇది నా సౌధం . నా రుధిరం
తో తడిసిన మహల్ ఇది . నా ప్రాణం పోయింది ఇక్కడే ... ఏ హక్కుల కోసం నా ప్రాణం తీసారో ఆ హక్కు కోసం
ప్రేతాత్మ లా ఈ సౌధాన్ని పట్టుకు వేలాడుతున్నాను . ఎప్పటికీ ప్రేతాత్మగా మసల డానికి సిద్ధం గానీ ఆ రచన కి
మాత్రం ఈ సౌధాన్ని దక్కనిచ్చేది లేదు . ఘర్జించింది కోపంగా వైజయంతి .
రచన కూడా మీ వారసురాలేగా ఎందుకని తన మీద ఈ ద్వేషం ? ఆవేశం గా అడిగాడు మురారి .
హహహా హ్హా .. గట్టిగా వికటాట్టహాసం చేసింది వైజయంతి .
రచన లో విధాత్రి పోలికలు ఉన్నాయి . నాకు రచన ని విధాత్రికి మధ్య తేడా కనిపించడమే లేదు .. విధాత్రి చావుకి
నేనెలా కారణం అయ్యానో .. ఈ రచనని కూడా అలాగే .. అని గట్టిగా నవ్వింది వైజయంతి .
విధాత్రి ఎవరు ? ఆశ్చర్యంగా అడిగాడు మురారి .
.jpg)
"'నా శత్రువు " కళ్ళు భయంకరంగా తిప్పుతూ అంది వైజయంతి .
శత్రువా ??? వింతగా ఆమె ని చూస్తూ అడిగాడు మురారి .
ఆమె తన చేతిలోకి అతడి చేతిని తీసుకొని మహల్ తలుపుల్ని విసురుగా ముందుకి తోసింది ..
అతడ్ని బలవంతం గా ఓ గదిలోకి ఈడ్చుకేల్లింది ..
చూడు .. ఆమె గురించే అడుగుతున్నావు కదూ .. ఆమె నా శత్రువు విధాత్రి అని గోడ మీదున్న చిత్రపటం కేసి
కోపం గా చూపించింది వైజయంతి .
ఆమె వంక భయంగా చూస్తూ గోడ వైపు దృష్టి సారించిన మురారి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి .
ఈమె ... అచ్చు రచన లా... ఉంది .. మాటలు కూర్చుకుంటూ అన్నాడు మురారి .
మీరంటున్న ఆ రచన ఈ విధాత్రి కుటుంబానికి వారసురాలు . నాకు కాదు . ఈ మహల్ నాది ... నాది .. నాది ..
గట్టిగా అరచింది వైజయంతి .
మురారి అడుగులో అడుగు వేసుకుంటూ ఆ చిత్రపటం దగ్గరికి నడిచాడు .
చిరున్నవ్వుతో దేవకన్య లా ఉందామె .
"విధాత్రి " ... అతని పెదవులు అప్రయత్నం గా ఉచ్చారించాయి .
ఆ రాక్షసి మూలంగానే నా తండ్రే నన్ను నరికి చంపాడు . నా రక్తం తో మహల్ తడిసి పోయింది . నా రక్తం చిందిన
ఈ సౌధం లో రక్తం చిందించటానికి సిద్ధం కండి .. అని గర్జించింది
(ఇంకా ఉంది )
No comments:
Post a comment