తెల తెలవారుతుండగా తలుపు తట్టిన సౌండ్ విని తలుపు తీసాడు శివ .
ఎదురుగా మురారి ,సత్య ... పాలిపోయిన మొహానికి నవ్వు పులిమి గుడ్ మార్నింగ్ శివా అన్నాడు మురారి . సత్య
నవ్వుతూ నిలబడింది .
శివ కూడా చిరునవ్వు నవ్వి రండి లోపలికి అని అడ్డు తోలిగాడు గుమ్మానికి . స త్య మురారి వైపు చూసి ఒక
విషపు నవ్వు నవ్వి లోపలికి అడుగు పెట్టింది . ఆమె వంక అసహనం గా చూసి తానూ లోపలికి నడిచాడు మురారి
సవ్వడి విని లేచిందోమో రచన ఎదురుగా వచ్చి .. వచ్చేసారా ? అని సత్య చెవి లో ఆర్ యు హ్యాపీ ? అంది కన్ను
గీటుతూ రచన .
సత్య సిగ్గు పడింది .. కాని అదెందుకో రచన కి వింతగా కనిపించింది . కానీ ఆ భావన ని బయటకి కనబడ
నీయకుండా .. సరే .. నేను బంగ్లా కి వెళ్తున్నా .. ఫ్రెష్ అయి మల్లి కలుస్తా .. సరేనా ? అని మురారి దగ్గరికి వచ్చి
మురారీ .. యశ్ నిద్ర పోతున్నాడు . మీరు విశ్రాంతి తీసుకోండి . నేను నిన్నటి నుండీ బంగ్లా కి వెళ్ళలేదు ..
వేల్లోస్తాను .. అని ముందుకి నడచింది రచన .
వెళ్ళిపోతున్న రచన ని నిస్సహాయం గా చూస్తున్న మురారి దగ్గరకి వచ్చి .. నువ్వేం చేస్తావో తెలీదు . కానీ ఇక పై
ఆమె ఇక్కడే ఉండాలి .. నా కళ్ళ ఎదురుగా .. అర్థమైందా ? అంది సత్య మురారికి వినబడేలా ..
అతడు బాధగా తల ఊపాడు .
ఆమె వయ్యారం గా నడుస్తూ ముందుకి నడచింది .
మురారి బాధగా తల పట్టుకున్నాడు . ఏం చేయాలి ఇప్పుడు ? ఇటు సత్య నీ ,అటు నా స్నేహితులనీ ఈ పిశాచి
బారి నుండి కాపాడాలి .. ఎలా ? ఈ విషయం నేను వీళ్ళతో చెప్పలేను .. ఒంటరిగానే ఈ సమస్య నుండి బయట
పడాలి . నిన్నరాత్రి జరిగిన సంఘటన ని అంత తేలిగ్గా యశ్ వదిలేయడు అనే అనుకుంటున్నా .. ఈ విషయం
ఎలా అయినా యశ్వంత్ ,రచన లకి తెలియజేసి తీరాలి .. అనుకున్నాడు మురారి .
మురారీ .. అంటూ మురారి దగ్గరకి వచ్చి ఏంటి అలా ఉన్నావు ? ఎనీ థింగ్ రాంగ్ ? అని మురారి భుజం మీద చేయి
వేసి అడిగాడు శివ .
ఎదురుగా ఉన్న గది కిటికీ లోంచి వెటకారం గా చూస్తున్న సత్య ని ఓరకంట గమనించి .. అదేం లేదు శివా ..
నైట్ నిద్రలేదు .. టైర్డ్ గా ఉంది . నేను స్నానం చేసి వస్తాను .. అన్నాడు మురారి .
మురారీ ఈరోజు మడుగులో వెతకాలి కదా .. నువ్వు మాతో వస్తున్నవుగా .. అనుమానంగా అడిగాడు సివ.
సత్య వంక భయంగా చూసి .. శివా .. తరవాత వేల్లోచ్చుగా .. అదే .. నేను కాస్త విశ్రాంతి తీసుకోవాలిగా .. అన్నాడు
మురారి .
ఏంటో మురారి .. నువ్వు కొత్తగా ఉన్నట్లని పిస్తుంది . సర్లే .. ఇంకా యశ్వంత్ ఎలాగూ నిద్రలేవలేదు . రచన కుడా
బంగ్లా నుండి రావటానికి సమయం పట్టొచ్చు . ఈలోపు నువ్వూ ,సత్యా విశ్రాంతి తీసుకోండి .. నేను టిఫిన్స్ తీసు
కొస్తాను . అని గుమ్మం వైపు నడిచాడు శివ .
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
2 comments:
Chaalaa Baagaa rastunnaaru..radhika gaaru:):)
thank you karteek gaaru
Post a Comment