ఎవ్వరు నీవు నా కనురెప్పలపై వాలావు ..
ఎవ్వరు నీవు నా నిదురను దోచావు ..
నా అడుగు కి జత కలిపావు .. మనసు మడుగు లో తరంగమయ్యావు ..
కలగా కన్నుల చేరావు .. నా మదిలో వెన్నెల నింపావు ..
మాటలు ఎన్నో చెప్పావు .. నా పాటలు ఎన్నో విన్నావు ..
నీకై నేనని అన్నావు .. నీవే నా తోడని చెప్పావు ..

నా కలలన్నీ రాశులు పోస్తే దాల్చిన ఆకృతి నన్నావు ..
నా సర్వం నీవని పించావు .. ఈ లోకం వద్దని పించావు ..
నన్ను నాకు కొత్తగా పరిచయం చేసావు ..
దాగుడు మూతల జీవితమిది నా కన్నులు నువ్వే మూసావు ..
కన్నులు తెరిచి చూసేసరికి అరరె ఏమై పోయావు ?
పెదవులపై నా నవ్వే మాయం చేసి .. గుండెలో గుబులే రేపావు .
రెపరెప లాడిన ఆశ ని తుంచి నన్నే వదిలి వెళ్లావు ..
ఎదురుచూపుతో కొన్నిరోజులు .. వెతుకులాట లో మరిన్ని రోజులో ..
జాడేలేక సతమతమయ్యి వేదన ఒడి లో నను చేర్చావు .
నీ తలపులతో కాలం వేల్లదీసేలా నన్ను చేశావు ..
నీకేమయ్యిందో అని బెంగపడి చిక్కి సగమయ్యేలా నను చేసావు ..

అంతం లేని నిరీక్షణ నాదని ఒకపరి నువ్వు కనిపించావు ..
నన్నే మరచి వేరే మనసుని ఆరాధించానన్నావు ..
ఒట్టి మాటలతో బుజ్జగింపు లతో నా మదిని నిలువునా చీల్చావు ..
అవమానం తో నీ మోసం తో తనువు నిలువెల్లా వణికేలా చేసావు ..
ద్రోహానికి ప్రేమ అనే రంగు ని నువ్వే అద్దావు ...
నా నమ్మకానికి ఉరి తీసేసి పకపకా నువ్వు నవ్వావు ..
కన్నీటి సరస్సు లో స్నానం చేసి నా మనసు నే కడుగు తున్నాను ..
నా కనులలో నీ బొమ్మ ని చెరిపి ఆత్మ స్థైర్యాన్ని నింపాను ..
నీ జతని వదిలిన అడుగుని గమ్యానికి చేరువ చేసాను ..
సంకల్పాన్ని తోడుగా మార్చి విజయం తో జీవితం పంచుకున్నాను ..
ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను నా దారిలో తెగిన గాలిపట మయ్యావు ఎవ్వరు నీవు ?
5 comments:
చాలా హృద్యంగా రాశారు. ఇది కేవలం ఊహాత్మక భావనే కదా. అలా అయితే మాత్రం... చాలా వేదనాభరితంగా ఉంది.
ఎవ్వరు నీవు చూడ చక్కగా రాసావు నీ అంతరంగాన్ని
ఇంతకి ఆ ఎవ్వరు ఎవ్వరు ?
చాలా భాగా రాసారు అండి
ఎవ్వరు నీవు చూడ చక్కగా రాసావు నీ అంతరంగాన్ని
ఇంతకి ఆ ఎవ్వరు ఎవ్వరు ?
చాలా భాగా రాసారు అండి
నేనైతే ఈ కవిత రచయితనే వి కె గారు .. కానీ "'ఎవ్వరు నీవు " అని ప్రశ్నిస్తుంది మాత్రం మోసపోయిన ఓ హృదయం ......మోసానికి ప్రేమ అనే రంగుని పులిమే ప్రియురాలయినా ,ప్రియుడైనా ఆ మోసపోయిన ఆ హృదయం ముందు దోషిగా నిలబడాల్సిందే .. ఐతే ప్రేమలో ఓటమికి క్రుంగిపొవాల్సిన పని లేదని కూడా నా ఈ కవిత తెలియజేస్తుంది
ప్రశంస కి ధన్యవాదాలు
సతీష్ గారూ .. ఈ కవిత ఐతే ఊహాత్మకమే .. కానీ తెల్లారితే ఏ పేపర్లో చూసినా ,వార్తలు విన్నా .. భగ్న మైన ప్రేమ పరిణామాలను చూస్తూనే ఉన్నాం కదా .. ఆ వ్యథ లే నా ఈ కవిత కి ప్రేరణ . ప్రశంస కి ధన్యవాదాలు
Post a Comment