ధగ ధగ మెరిసే బంగారం , రెపరెపలాడే పచ్చ నోట్ల గారం
అధికారం పై మమకారం , లాభాలతో గుణకారం ..
ఇదేనా సమాజం కోరిన తీరం ...
మాయని బంగారం మనసైతే , కాసులకి లొంగని ప్రవర్తన ఉంటె
అధికారాన్ని తృణ ప్రాయం గా భావించే నాయకుడు ఉంటె
ప్రజల క్షేమమే లాభమని తలచే వాడైతే ..
చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా .. జై కొట్టి గెలిపించు తెలుగోడా
కులాన్ని ప్రాతిపదిక గా ఎంచుకోకురా ...
మతాన్ని వేదిక గా మార్చమాకురా ..
పచ్చనోటు కి అయిదేళ్ళ భవిత తాకట్టు పెట్టకురా ..
నీ హక్కుని నువ్వు సరిగ్గా ఉపయోగించరా ..
అర్హత ఉన్నోడికే నీ వోటు రా ...
ఎన్నికలు వచ్చేటపుడు నిను ఆకాసాని కేత్తెవోడు నాయకుడు కాబోడురా ..
కష్టమొచ్చి నువ్వు కూల బడితే నీ భుజం తట్టి చేయూత నిచ్చే వోడే మేటి నాయకుడురా ..
అటువంటి నాయకుడికి , ప్రజా సేవకుడికి , నీ అయిదేళ్ళని కానుకివ్వరా
చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా ,జై కొట్టి గెలిపించు తెలుగోడా
No comments:
Post a comment