చిరునవ్వు పొదరిల్లు పెదవమ్మ లోగిళ్ళు ఎర్రాని రంగులోనా మెరిసేటి అధరాలు
స్వప్నాల వాకిళ్ళు నీలాల కనులు , నల్లాని కాటుక పెడితే రెప్పల చాటు భావాలు ..
నునుసిగ్గు చెక్కిళ్ళు గులాబీల రేకల్లె , రాణీ వర్ణం తానంటూ బుగ్గల్లోనా పూసే
పండిన వరి పైరల్లే తళుకు లీనే మేను , పచ్చాని పాదాల్లో మురిసే మువ్వ దే రంగు ?
ప్రియుని తలపే ఊదా రంగై తనువల్లా సోదా చేసే .. అంబరమే తాకే సంబరానిది ఏ రంగు ?
జాలువారే కురులు నిశి వర్ణ మయినా సిగలోనా నవ్వింది జాబిల్లి సిరిమల్లి ..
మెడలోన ఒదిగిందో పసుపు పుత్తడి హారం .. తెల్లాని రంగులోనా ముత్యాల భారం
కాషాయపు రంగేమో గోరింటై పూసింది .. మనసిచ్చేవాడి ప్రేమ స్వచ్చమైన రంగంది .
మదిలోని భావాలన్నీ ఏడు రంగుల హరివిల్లు .. అది కురిసే వెన్నెల జల్లు
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
2 comments:
వర్ణాలకు వన్నె తెచ్చారు రాధికగారు.
మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు శ్రీదేవి గారూ
Post a comment