మువ్వల సవ్వడి మెల్లిగా నా వీనుల విందుచేసే ..
గాజుల గలగల అల్లరిగా వింతగ వంత పాడే ..
కొంటె చూపుల కోణంగి నా తుంటరి మరదలు సివంగి ..
జడ ని వయ్యారం గా తిప్పి .. పైట ని అలవోక బొడ్లో దోపి ..
ధనువు లాంటి కనుబొమలని పైకెగరేసి నవ్వింది .
ఆ నవ్వే కన్నులకి పాకి చిలిపి చూపు అర మెరసింది ..
రంగు నీళ్ళని కుండలో నింపి సగం వంచిన నడుం మీద
ఆశ్రయమిచ్చి రాజహంసలా నా వైపు కి నడచి వచ్చింది ..
అందానికి హతాశుడినయి నేను ఏమరుపాటు గా చూస్తున్నాను .
విసురుగా రంగు నీళ్ళని చల్లి జలపాతం ఉరికినట్టు నవ్వింది .
అల్లరి మరదలు చేసిన పని కి జవాబు చెప్పాలనుకొని ..
గుప్పెడు గుండె ని అదుపులో పెట్టి గుప్పెట నిండా రంగుని పట్టి
ఇందు ముఖి నా మరదలు ముఖముని వర్ణ శోభితం చేశాను .
వసంతం మది కి ఉత్సవ మవగా వసంతోత్సవం ముద్దుగా మురవ ..
రంగులలోనా తనువే తడవ .. నా మరదలి తో ఇక తీయని గొడవ .

2 comments:
నాకు మరదలు లేకపోడం ఎంత బ్యాడ్ లక్. మీ కవిత చదివితే గానీ.. అది అర్థం కాలేదు. ప్చ్... బాగుందండి...
సతీష్ గారూ ... బావా మరదళ్ల బంధం అనాదిగా చాలా గమ్మత్తైనది . మరదలు లేకపోతేనేం మీ వైఫ్ నే మీ మరదలు అనుకోండి . రంగుల లో మమేకమయి పోండి
Post a comment