ఎండలు ముదురుతున్నాయి ..
చెమటలతో విసుగూ మొదలయ్యిందీ ...
ఆపై కరెంటు కోతాయే ..
అరరె ఉగాది పరుగున వస్తుంది ..
మార్చ్ నెలలో చివరి రోజున తెలుగు నూతన సంవత్సర మొదటి రోజు ..
బావుంది కదూ ..
ఇంత ఎండలో ... వద్దులే .. అలా కాస్త సూర్యుడు శాంతించాక సాయంత్రం పూట షికారుకి వెళ్లి రండి ..
దారిలో కొన్ని మామిడి కాయలు , (ఎవరి చెట్లో అన్నా దొంగతనం గా కోసేయండి .. నేనిలా చెప్పానని ఎవరికీ
చెప్పకండెం .. దొరికి పొతే నన్ను తిట్టుకోకండి ),కాస్త వేప పువ్వు , పచారీ కొట్లో కొంచెం బెల్లం , చింత పండు ,అరటి
పళ్ళు తెచ్చి అమ్మ చేతిలో పెట్టేయండి .
ఉగాది రోజు తలారా స్నానం చేసి అమ్మ చేతితో చేసిన కమ్మని ఉగాది పచ్చడి , మిగతా పిండి వంటలతో
లాగించేయండి ..
ఉగాది చైత్ర మాసపు తొలి రోజే కాదు జయనామ సంవత్సర ఆరంభం . మీకంతా జయం కలగాలని మనసారా
దేవుణ్ణి నేను ప్రార్థిస్తా .. మీరూ నాకోసం ప్రార్థిస్తారుగా ..
ఉగాది రోజు పంచాంగ శ్రవణం మరచిపోకండెం .. అది మన సాంప్రదాయం కదా ..
ఇంతకీ మీకో అనుమానం వస్తుంది కదూ .. నాలుగురోజుల ముందే ఈ సోది ఎందుకని ..
మరేమంటే .. ఉగాది పండుగ కి నేను మా ఊరు వెళ్తున్నా .. అదీ రేపే ... అందుకే ఇంత ముందుగా మీ అందరికి
ఉగాది శుభాకాంక్షలు . అయిపోయిందండీ .. ఇంకా చదివితే ఎలా ? మరో పోస్ట్ ఏదన్నా చదవండి .. లేదంటే
మా మిత్రుల బ్లాగ్స్ కూడా ఓసారి ఓ లుక్కేయండి ..
మరోసారి అందరికి ఉగాది శుభాకాంక్షలు
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

3 comments:
ఊరు వెళ్తున్నారా... సరే.. వెళ్తూ వెళ్తూ మధ్యలో మా విజయనగరాన్ని కాస్త పలకరించండి. ఆ పలకరింపు నాకు పంపండి... ప్లీజ్. నూతన సంవత్సర శుభాకాంక్షలు రాధిక గారు. మీ కుటుంబానికి అన్ని శుభాలే జరగాలని ఆశిస్తూ... సతీష్ కొత్తూరి
అన్నట్టు ఫేస్ బుక్ కి మెసేజ్ మళ్లీ సెండ్ చేశానండి. మీకు రాకపోడమేంటో మరి. అందులో నా ఫోటో వేరే ఉంటుంది.
సతీష్ కొత్తూరి అని ఫుల్ నేమ్ ఉంటుంది. ఓ సారి చూడండి మరి.
సతీష్ గారూ ..
ఇప్పుడైతే రైల్ ప్రయాణం లో ఉన్నాను . విజయనగరం మీదుగానే వెళ్తాను కాబట్టి తప్పనిసరిగా మీ ఊరిని
పలకరిస్తాను లెండి . మీ వూరు ఏమన్నా కబుర్లు మీకు చెప్పమంటే తప్పనిసరిగా మీకు తెలియజేస్తాను .
and happy ugaadi
Post a comment