అక్షరాల పూలన్నీ అందమైన భావమనే దారానికి కూర్చి కవిత అనే పూదండ చేసి మా బ్లాగ్ వీక్షకుల మెడలో
వేద్దామనుకుంటే దారం రీలు దొరకలేదాయే ..
ఏం చేద్దాం మరి ?
ఈరోజు ప్రపంచ కవిత్వ దిన మట .. ఒక అందమైన భావాన్ని అక్షర మాలని చేయటానికి . అది భగవంతుని మెడలో
వేయటానికి ప్రత్యేకించి ఓ దినం అవసరమా ? ఏమో .. మనసు స్పందించినపుడు ఎద వీణ పై తీయని రాగాలని
మీటుతున్నప్పుడు రాత్రైతే నేం పగలైతేనేం తీయని కవిత మది పొరల్లోంచి ఊడి పడుతుంది ..
ఒప్పుకుంటారా ? ఏమైతేనేం ఎవరో ఒకరు కవితలకి ఒక రోజుని కేటాయించారు కదండీ .. శుభాకాంక్షలు
చెప్పుకుంటే మన సొమ్మేం పోదు కదండీ .. కాబట్టి ప్రపంచ కవిత్వ దినాన మీకివే నా శుభాకాంక్షలు ..
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
6 comments:
Wish you the same..Radhika gaaru:):)
బాగుంది రాధికగారు,మొత్తానికి రోజూ ఏదో ఒక దినం ఉంటూనే ఉంటుందన్నమాట.
అరె బిజీలో పడి బ్లాగు లోకంలోకి రాలేకపోతున్నాను.
ఈ మధ్య మీరు రాసినవన్ని చూశాక ఒక కాంప్లిమెంట్ నిజాయతీగా, మనస్పూర్తిగా ఇవ్వాలనిపించింది.
అదేంటంటే... మీరు చాలా స్వచ్ఛమైన ఆలోచనా ధోరణిని కలిగి ఉన్నారు. మీ పదాల నిర్మాణం బట్టి... మీరెంత నిక్కచ్చో కూడా అర్థమవుతోంది. మీ తొలి కవితకి, ఈ మధ్య రాసిన కవితకి తేడా చూస్తే.. మీ కలం పదును పెరిగింది. మీలో మంచి భావావేశం ఉంది. దయచేసి ఆపకుండా... మీలో ఓపిక ఉన్నంతవరకు... సాహిత్యసమరాంగణంలో కవన యుద్ధం కొనసాగించండి.....
సతీష్ గారూ .. నా కలం పదును సంగతేమో గానీ మీరు మాత్రం మీ కామెంట్ కోసం ఎదురుచూసేలా చేస్తున్నారు .
మీ ఆత్మీయ ప్రశంస కి సదా నేను కృతజ్ఞురాలిని . ఇక భావావేశం సంగతంటారా ? అది మా నాన్న గారి నుండి
వచ్చింది .. ప్రతి ఆలోచనని అక్షర రూపం ఇవ్వాలన్న తపన మాత్రమె నాది .
శ్రీదేవి గారూ .. సంవత్సరం లో 365 రోజులు దేనికో ఒకదానికి కేటాయించేసారండి . దీని అర్థం ప్రతిరోజూ ని ఒక ప్రత్యెకమైనదిగా మలచటం కావొచ్చు . లేదంటే ఒకరితో ఒకరు పోటీ పడి ఒక్కోరోజు ని ఒక్కో అంశానికి అప్పజేప్పేసారనీ అనుకొవొచ్చు . ఏమైనా సరే .. శుభాకాంక్షలు చెప్పుకోవటానికి , పెదవుల పై ఓ చిరునవ్వు విరిసేలా చేయటానికి మనకి కారణాలతోను ,ప్రత్యేకతల తోనూ పనేముందండి ?
egise alala karteek gaaru..
thanks for wishing andi
Post a Comment