Saturday, 22 March 2014

వీక్షకులతో కాసేపు

బ్లాగ్ వీక్షకులకి .. 

               నేను " నా రచన " లో వ్రాస్తున్న రుధిర సౌధం సీరియల్ ఈరోజు తో 100 వ భాగానికి చేరుకుంది . 

సీరియల్స్ రాయటం నా హాబీ . అలా అని ఇంతవరకు ఏ మ్యాగ్ జిన్ లోనో  పబ్లిష్ చేయటం కోసం సంప్రదించే 

ప్రయత్నం చేయలేదు . కానీ సీరియల్ చదువుతున్న వారు పబ్లిష్ చేయమని సలహాలు ఇస్తున్నారు . ఎంతగానో 

ప్రోత్సహిస్తున్నారు . ఏ కళ ఐనా మరింత వన్నె పెరిగేది ప్రోత్సాహం వలెనే కదా . కాబట్టి వీక్షకులందరికి ఎంతగానో 

కృతజ్ఞతలు చెప్పుకోవటం లో నా ఆనందం ఉంది . మీ ఆశీర్వాదం తో ముందుకు సాగాలని ఆశ పడుతున్నాను . 

ఇకపోతే రుదిరసౌధం కథ నా మనసులో 5ఏళ్ళ నుంచీ నానుతుంది . దానికి ఇన్నాళ్ళకి అక్షర రూపం 

ఇవ్వగలిగాను . సీరియల్ మీ అందరికి నచ్చినందుకు చాల సంతోషం . మరెన్నో సంతోషాలని మీతో 

పంచుకునేందుకు ఎప్పుడు సిద్ధం అని మీకు తెలియజేస్తూ ... 

                                                                                                                           
                                                                                                                       రాధిక


2 comments:

సతీష్ కొత్తూరి said...

మీరు వంద భాగాల నవల రాసేశారు. వావ్. అంత ఈజీ ఏం కాదు తెల్సా.. అది చాలా కష్టం. నా దగ్గర ఒక మంచి కాన్సెప్ట్ ఉంది. ఇప్పటి వరకు ఒక్క పేజీ కూడా రాయలేకపోయాను. అలాంటిది వంద భాగాల నవల... మనసులో అనుకున్నది అనుకున్నట్టు రాశారంటే... మీ పట్టుదల సూపర్. నిజం చెప్పాలంటే మీ రుధిర సౌధం నేను పూర్తిగా చదవలేదు. అప్పుడప్పుడే చూశాను. బ్లాగ్ లో నోవెల్ రాసిన తొలి రచయిత్రి మీరే అనుకుంటాను. బట్... కథాంశంలో మలుపులు అర్థమవుతున్నాయి. కచ్చితంగా మీ నవలను చదివి... నా కామెంట్ రాస్తాను.. తప్పనిసరిగా... కీప్ ఇట్ అప్ రాధిక గారు.

రాధిక said...

చాలా చాలా కృతజ్ఞతలు మీకు సతీష్ గారూ . సమయం దొరికి నప్పుడల్లా నవల చదవండి . మొత్తం నవల చదివాక మీరు పెట్టె కామెంట్ కోసం ఎదురుచూస్తూ ఉంటాను . మీ ప్రశంస లన్నింటికి నేను అర్హురాలినో కాదో తెలియదు ..
కానీ చాల సంతోషం కలిగించాయండి . ఎదుటివాళ్ళని ప్రోత్సహించడం లో మీరెప్పుడు ముందుంటారనుకుంటా ,,,,