ఇది కట్టలు తెగిన ప్రవాహం .. ఏనాటికి తీరని దాహం ..
ఇది వీడని వాడని మొాహం .. తావివ్వదు ఏ సందేహం ..
ఆవేదన కిది దాసోహం .. కన్నీళ్ళతో తడిసెను దేహం .. ఇది కట్టలు
సంద్రమంత వేదనా గుండె నే ముంచి వేసేనా ?
చినుకంత ఓదార్పుకె మది ఎదురుచూడ సాగెనా ?
అల్లంత దూరాన సంతోషమే దాగి దోబూచులాడుతున్నది
కళ్ళింత చేస్తున్నా కనరాని అంబరమే శూన్యమై పోతున్నది ..
నా మౌనమే శోకాన్ని అణచదా .. నా ప్రాణమే లోకాన్ని మరువదా ..
నిస్పృహల నడుమే జీవితం ..... ఇది కట్టలు
ఆ అష్ట దిక్కులలో హద్దుల్ని చెరిపెసేలా ...
ఆ అంతరిక్షం లో మెరుపులా మెరవాలా ...
చిరునవ్వు ఎరుగని పెదవులది ఏ పేరని .. సిరిమల్లె మనసులో వేదనకి చోటేలని ...
చిరుగాలి తాకని మబ్బు గతి ఏమౌనని .. సిరిమువ్వ సవ్వడిని నచ్చని వారెవరని ..
నీ ధైర్యమే నడిపించదా .. నీ గమ్యమే నిర్దేశించదా ...
సుఖ దుః ఖపు కలయికే జీవితం
అభిప్రాయం మాకు అతి విలువైనది
3 comments:
Chala baga rasaru kani ilanti kalamlo anta swachamina prema dorakadam ledu.
ఆవేదనతో కూడిన భావాంశంతో ఈ మధ్య మీరు రాసిన రెండో కవిత ఇది. ఎందుకో ఆవేదన, విషాదాన్ని కవితాంశాలుగా ఎంచుకుంటున్నారు. నిజమే వాటిని అక్షరాల్లో బంధించడం ఎంత కష్టమో... బంధించాక వాటి భావాన్ని ఆస్వాదించడం మరీ భారం. కానీ.. ఆ భారంలో ఏదో తెలియని భావవర్షం.. గుండెను బరువెక్కిస్తుంది. రాధిక గారు... ఈ మధ్య చాలా బాగా రాస్తున్నారు. ప్లీజ్ కీప్ గోయింగ్....
సతీష్ గారూ . .. ఆవేదన కి స్పందించే హృదయం మీలో ఉన్నందుకు చాలా సంతోషం . ఇక పొతే వేదన అనేది మనిషి జీవితం లో తప్పనిసరి . ఎందుకంటే ఉలి దెబ్బ తగలనిదే శిల శిల్పం కానట్లే కష్టాలు ,కన్నీళ్లు లేకుండా మనిషి రాటు దేలలేడు . కానీ కొన్ని జీవితాలలో ఆవేదన ఎలా ఉంటుందంటే ఆ జీవితాలలో కష్టం లేని రోజులను వేళ్ళ పై లెక్క పెట్టేలా ... అలాంటి వారిని నా ఈ చిన్ని జీవితం లో చూశాను . సంద్ర మంత వేదన వారిగుండెని
ముంచేస్తున్నపుడు చినుకంత ఓదార్పు దొరకక పోగా సమాజం తూట్లు పొడుస్తూ ఉంటుంది . మనకి దేవుడు మంచి జీవితాన్ని ఇచ్చి ఉండొచ్చు . కానీ కష్టాల సుడిగుండం లో కొట్టుకు పోతున్న వారికి చేయి అందిచ్చే మానవత్వాన్ని ,స్పందించే హృదయాన్ని ఇచ్చుంటే అసలు సిసలు మనిషిగా జీవించమన్నట్టే ....
Post a Comment