ఓ చిరుగాలీ .. నా ప్రియురాలి
జాడే తెలుపవే ఊరేగే వేళా ...
ఓ సిరిమల్లి .. నా జవరాలి
సిగలో జాబిలి నీవయ్యే వేళా ..
కమ్మని కబురే చెప్పాలి .. నా మది మాటున చెలి నవ్వాలి .. 2 ఓ చిరుగాలి
తీయని పాటలో పల్లవి తానే .. రాగం నేనై ఒదగాలి ..
పున్నమి రేయి న వెన్నెల నేనే .. చంద్రిమ తానై ఉండాలి
ఎదలోతులలో తన మువ్వల సవ్వడి .. నా తలపులలో చెలి రేపే అలజడి
కన్నుల ఎదురుగ కనబడదేమో మరి .. ఓ చిరుగాలీ
కోయిల కూసిన పలికావనుకున్నా .. ఊయల ఊగినా వచ్చావనుకున్నా
మల్లెలు పూసిన నీ నవ్వులు కన్నా .. మువ్వలు మోగితే పిలిచావనుకున్నా
నిను చూసే రోజే పండుగని .. నిను చూడని రోజున నే లేనని ..
తెలపాలే చెలియా కనరావే .. ఓ చిరుగాలి
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a Comment