
ఎందుకో కొత్త గా కనిపిస్తున్నది ఈ లోకం ..
రోజుకో వింతలా కవ్విస్తున్నది భూలోకం
రెక్కలు విప్పిన యవ్వనం చేసింది గగన విహారం
రేకులు విచ్చిన పూవనం వేసింది ఓ సుమహారం
గల గల పారే సెలయేరే మంది ? నా కిల కిల నవ్వే తనదంది ..
మిల మిల మెరిసే తారక ఏమంది ? తన మిసమిస సొగసే నాదంది ..
కొమ్మల్లో కోయిలా .. కూసిందిలే ఇలా .. కుహు కుహు పాటలా .. సరిగమల తోటల ..
మెరిసేటి వెన్నెలా .. కురిసింది జోలలా .. నిదురించు వేళలా .. కలలు నా కన్నులా ..
సరికొత్తగా .. గమ్మత్తుగా ఊయలూపింది లోకమే ఇలా ..
పూవు ల భాష ఏదో .. తుమ్మెదా.. నీకు తెలుసేమో ..
చిరుగాలి ఊసుల్ని వింటూ పైరు తల ఊపుతుందేమో ..
నింగి చెక్కిలి పైన .. సిగ్గు ఒలికించు స్సూరీడు .. మబ్బుల చీర తెచ్చి .. కానుకే ఇచ్చి ఉంటాడు .
వేకువ వాకిలి లోనా .. ముగ్గు పెట్టేవాడు .. హరివిల్లు రంగులు కూర్చి .. చిరుజల్లు కురిపించుంటాడు ..
ఆనందమా .. ఆహ్లాదమా ? ఈ జగతిలో ఇంతందమా ?
పచ్చాని రాచిలుక కమ్మని పలుకులా
మా వూరి రహదారి మెలికల కులుకుల ..
సిరి మువ్వ సవ్వళ్ళ.. దోబూచు లాట లో .. గోధూళి వేళలో .. కన్నె దూడ సంబరాలు
సందె పొద్దు నీడలోనా .. .. తెల్లవారు పల్లె లోనా .. మంచు జాణ ఇలకి చేర .. విచ్చు మందారాలు
చాలవేమో కళ్ళు రెండు .. సొగసులద్దిన ప్రకృతిని చూడ ..
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
5 comments:
ప్రకృతిని కృతి చేసి... అందాలను, సోయగాలను సరిగమలుగా మార్చి... మీ మనసు వీణపై ఇంత అందమైన ఊహని మీటారు. ప్రాకృతిక సౌందర్య దృష్టి లేని వారికి సృజనాత్మకత సున్నా ఉంటుందట. మీకు నేను 99 మార్కులు వేస్తున్నాను రాధిక గారు. ఆ ఒక్క మార్కు ఏమైందని అడుగాతారేమో కదా. సరే ఇప్పుడే చెప్తాను. దిష్టి తగలకుండా....
అన్నట్టు మరిచిపోయా... ఫేస్ బుక్ లో మీ ఐడీకి మెసేజ్ పెట్టానండి. బహుశా మీరు ఫేస్ బుక్ యూజ్ చేయడం లేదనుకుంటా... కదా.
చాలా బాగా ప్రశంసిస్తారు మీరు ... అందులో ఐతే మీకు మీరే సాటి సతీష్ గారు .. ధన్యవాదాలు . ప్రక్రుతి లో మమేకం కాని వారు ఎవరుంటారు ?
facebook వాడని వారెవరు ఉన్నారండి ? కానీ నేను నా timeline లో మీ సందేశం ఏదీ చూడలేదే
రాధికా మీ రచన రాగమాలికలల్లె , సుమరాగమాలికలల్లె.........
Post a Comment