కొంగ్రొత్త ఏడాది .. తెచ్చింది ఉగాది ...
కోయిలమ్మ కచేరి .. మావిచిగురు చెంత చేరి ..
స్థితి గతుల చింత మరచి భవిత కొరకు ఆరాలు తీసి
వేదపండితుల చుట్టూ చేరి .. జాతకాల ఫలిత మెరిగి
పంచాంగ శ్రవణాల సంప్రదాయాలని గౌరవించి ..
అమావాస్య వెళ్ళిపోయి పున్నమే వచ్చినట్టు ..
అందరూ ఒక చోట చేరి ఆటపాటలతో మైమరచి ..
విందులు ,వినోదాలు ఆనందపు సంబరాలు ..
షడ్రుచుల జీవితాన్ని మేళవించు పచ్చడి ..
ఆరగించి జీవితాన సుఖ దుః ఖపు లోతులు ..
చూడగలడు తెలుగు వాడు కష్టాలకి వెరవడు ..
మావి పూత సొగసులద్ది వేసవి రుచి చూపుతుంది ..
కోయిలమ్మ కూత లోన హాయి రుచి మరుగుతుంది ..
చైత్రవీణ మనసు నిలిపి కమ్మని రాగాలను మీటుతుంది
సరికొత్త ఆశలని ఉగాది మోసుకొస్తుంది ..
ఆ దైవం దీవెనలు ఊరూరా పంచుతుంది ..
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a Comment