Powered By Blogger

Tuesday, 29 April 2014

రుధిర సౌధం 133


ముగ్గురూ మహల్ ప్రాంగణం లోకి చేరుకున్నారు .

విధాత్రీ .. రాకుమారి విధాత్రీ .. దయచేసి మమ్మల్ని కరునించండి .. ఆపదలో ఉన్నాం .. గట్టిగా అరిచాడు యశ్వంత్ .

మురారి యశ్వంత్ వైపు ఆశ్చర్యం గా చూస్తుంటే శివ యశ్వంత్ కేమైంది అన్నట్టు చూసాడు .

ఇవేమీ పట్టించుకోకుండా .. క్షమించండి రాకుమారీ .. మీగురించి నా స్నేహితులకి చెప్పక తప్పలేదు .. కానీ

వారివల్ల మీకెలాంటి ఇబ్బంది కలగదు రాకుమారీ .. దయచేసి రండి .. రచన ఆపదలో ఉంది .. గట్టిగా అరిచాడు

యశ్వంత్ .

యశ్వంత్ అలా అరుస్తుంటే భయం భయం గా చుట్టూ చూస్తున్నాడు మురారి .. శివ కేమీ అర్థం కాక తల

గోక్కున్నాడు .

ఇంతలో అస్పష్టమైన కాంతి ఓ ఆకృతి లా వారి ముందు ఆవిర్భవించింది .

ముగ్గురూ విప్పారిన నేత్రాలతో ఆ వెలుగు ని చూశారు ..

మీముందర కి రావటానికి నాకేమీ అభ్యంతరం లేదు యస్వంతా .. కానీ నా ఆత్మ ని చూడగలిగే శక్తి మాత్రం

మీకింకా రాలేదు . అంది ఓ మధుర స్వరం ..

నోరు తెరచి అలానే చూస్తూ ఉండిపోయాడు శివ . అబ్బురంగా చూశాడు మురారి .

యశ్వంత్ మాత్రం .. తెలుసు .. రచన మాదగ్గర లేదు .. మీకు ఓ శరీరం .. అదీ రచన శరీరం కావాలని నాకు

తెలుసు .. కానీ అన్ని వైపులా ఉచ్చు మా చుట్టూ బిగుసుకుంటుంది రాకుమారీ .. మీ సహాయం మాకు

అవసరమైంది .. అన్నాడు యశ్వంత్ .

ఆమె మధురం గా నవ్వి న సవ్వడి ... ఆపై వీణ తీగ మోగినట్లు ఆమె పలికింది ..

యస్వంతా .. ముళ్ళు బిగుసుకుంటున్న సరే ఏదో చోట జారుముడి దొరకక మానదు .. అది దొరికాక మిగతా

ముళ్ళు అన్నీ వాటంతట అవే వీడిపోతాయి .. సమస్యలు అంతే .. ఒకదానితో ఒకటి ముడిపడతాయి .. కానీ

ఒకసారి పరిష్కారమంటూ దొరికితే అన్ని సమస్యలు గాలి బుడగల మాదిరి తేలిపోతాయి . నీకు నేను పరిష్కారాన్ని

తెలియజేశాను .. అన్ని సమస్యలనుండి బయట పడడానికి అదే దారి చూపుతుంది . అంది విధాత్రి స్వరం .

కానీ రాకుమారీ .. ఎలా రచన అన్నింటికీ ముఖ్యం .. ఆమే ఆపదలో ఉంటె మా బుర్రలు ఎలా పనిచేస్తాయి ?

బాధగా అడిగాడు యశ్వంత్ .

ఆమె మళ్ళి తెరలుతెరలుగా నవ్వింది .. యస్వంతా .. రచన సంగతి ఆమె చూసుకొన గలదు .. ఆమె తన లక్ష్యం

వైపు పయనించటం లో సఫలురాలు .. అంతే కాక కార్యసిద్ధి ,సంకల్ప సిద్ధి ఉన్న అతివ .. ఆపై మూలా నక్షత్రం లో

మహత్తర ఘడియలలో వైష్ణవీ మాత ఆశీర్వచనం తో జన్మను పొందిన అదృష్టవంతురాలు . ఆమెను అటు పంపటం

లో విధి నిర్ణయమే ఉంది .. పౌర్ణమి ఘడియల్లో అమ్మవారి గుడి తెరచుకుంటుంది .. అది జరగాలంటే మీ కృషి

తప్పని సరి . అనుమానాలతో వృధా ప్రయాసలేల ? నా మాట మీద నమ్మకమిడి నిశ్చింత గా మీ ప్రయత్నం కొన

సాగించండి . అంది విధాత్రి .

మరి సత్య .. అన్నాడు అప్రయత్నం గా మురారి .

ఆమె చిరునవ్వుతో .. చింతించకు మురారీ .. అంతా మంచే జరుగుతుంది .. నిశ్చల మనస్కులై కార్యసాధనకి

సంసిద్దులవండి .. ఎలాంటి భయాలకి మనసులో తావివ్వక ముందుకి సాగండి . మీ ప్రతి అడుగు లోనూ మీకు

తోడు ఉంటానని మాట ఇస్తున్నాను .. అన్నది ఆమె మధుర స్వరం తో ..

ఇంకా ఉంది 

మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Monday, 28 April 2014

రుధిర సౌధం 132

ఆగు యశ్వంత్ .. కొన్ని ఏళ్ళ కిందట చనిపోయిన విధాత్రి ని కలవట మేంటి ? కొంపదీసి ఆమె కూడా వైజయంతి

లానే దెయ్యం లా తిరుగుతోందా ? ఆందోళన గా అన్నాడు మురారి .

అలాంటిదే .. కానీ ఆమె దెయ్యం కాదు దేవత .. చెడు ఆత్మ దెయ్యం అవుతుందేమో .. మంచి ఆత్మ దైవం తో

సమానం అవుతుంది అన్నాడు యశ్ సైకిల్ ఎక్కి ..

యశ్వంత్ సైకిల్ వెనుక కూర్చుని .. అంటే ఈ దెయ్యాలలో కూడా మంచి ,చెడు ఉంటాయంటావ్ యశ్ .. విధాత్రి ని

నువ్వేపుడు కలిసావు ? అన్నాడు మురారి .

అనుకోకుండా కలిసాను . ఆమె అనుక్షణం మనల్ని కాపాడుతూ వచ్చింది .. అన్నాడు యశ్ .

అంటే యశ్ .. ప్రతిసారీ వైజయంతి బారినుండి మనల్ని కాపాడింది విధత్రేనా ? అన్నాడు మురారి.

అవును మురారీ .. ఆ కాలం లో ఏం జరిగిందో నాకు స్పష్టం గా తెలీదు గాని ఈ విధాత్రి ,వైజయంతి ఇద్దరూ ఒకే

తండ్రి బిడ్డలు . కానీ వారి తల్లులు వేరు .. రాజ్యదిపత్యం పోరు కావొచ్చు .. వీరి వంశం అంతా చెల్లచెదురై పోయింది .

ఆ వంశస్తులే రచన వాళ్ళు .. మన రచన .. రచనా వర్మ కదా .. కానీ ఏ కారణం వల్ల ఈ ఇద్దరు అక్కచెల్లెళ్ళు ఇలా

ఉండిపోయారో ప్రేతాత్మలు గా మారారో అర్థం కావడం లేదు మురారి .. అని చెబుతూనే ఇద్దరూ మహల్ దగ్గరకి

చేరుకున్నారు . ఈలోపు వాళ్ళ మీద ఏదో లైట్ పడినట్లు అవటం తో అటువైపు చూశారు  ఇద్దరూ ..

శివ .. వస్తున్నాడు .. అన్నాడు యశ్వంత్ .

వెహికల్ ఏందుకు పట్టుకోస్తున్నాడు మనమే ఇంటికి వెళ్ళేవాళ్ళం కదా అన్నాడు మురారి .

లేదు మురారి .. ఇక పై మనం మహల్ లోనే ఉండాలి . శివ మన లగేజ్ కూడా పట్టుకోచ్చేస్తున్నాడు .. అన్నాడు

యశ్వంత్  .

అవునా ? ఏమైంది యశ్ ? ఇంత హటాత్తుగా ఇలా అన్నాడు మురారి ఆశ్చర్యంగా .

ఏం చేస్తాం చెప్పానుగా కాలం మనకి ప్రతికూలం గా ఉన్నదని .. అని అంటుండగా వీరి ముందు వెహికల్ ఆపాడు

శివ .

వెహికల్ దిగి మురారీ .. ఇక్కడెందుకు ఉన్నావు ? వీళ్ళిద్దరూ ఎక్కడ ? అని అడిగాడు .

శివా .. ముందు మనం మహల్ లోపలకి వెళ్ళాలి .. పద .. అన్నాడు యశ్వంత్ .

ఎనీ థింగ్ సీరియుస్ ? అన్నాడు నొసలు చిట్లించి శివ .

అవును శివా .. పదా .. అని గేటు తోసుకు ముందుకి నడిచారు యశ్ ,మురారి

వారిని అనుసరించాడు శివ .

మహల్ తాళం చెవి రచన మెడలో ఉంది యశ్ .. లోపలికి ఎలా వెళ్తాం ? అని అడిగాడు మురారి ముందుకి

నడుస్తూనే ..

చూద్దాం మురారీ .. మన ప్రయత్నం ఫలిస్తుందో లేదో అన్నాడు యశ్వంత్ .

ఇంకా ఉంది . 


మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

క్షమించవా నా హృదయమా ..


నీ కల నేను...........   జ్ఞాపకాల వల నేను 

నీ మనసు తీరాన్ని మరల మరల తాకే అల నేను .. 

కమ్మని కబుర్లు విన్నాను .. రమ్మను నీ పిలుపులు విన్నాను .. 

తీయని మాటలు చెప్పాను .. మాయని తలపులు విప్పాను .. 

నీ గుస గుసల అలజడి నేనేను .. నీ కస్సుబుస్సుల సందడి నాదేను .. 

నీ ఎదురు చూపు లో ప్రాణం పోసుకుంటాను .. 

నీ దారి ప్రతి మలుపునా ఎదురై నిలిచాను .. 

నీ భావి ని కావాలని ఆశించాను .. రవి నై చీకటిని తరమాలని భావించాను .. 

ఎదగూటిలో దేవత గా కొలవాలనుకున్నాను .. 

ఎప్పటికీ నీ పై నా ఆరాధనని చాటి చెప్పాలనుకున్నాను .. 

కానీ నా మాట మౌనమై .. నీనుండి దూరమై నిశీధి లో నియంత నయాను .. 

నీ వాలు కళ్ళల్లో కన్నీటిని నింపి ఆ వెల్లువలో కొట్టుకుపోయాను .. 

నీలో నను నేను కోల్పోయాను .. నాకు నేను మిగలక జీవచ్చవమై మిగిలాను .. 

ఈ మనసు లేనివాడిని క్షమించగలవా అని అడగలేని అసహాయత లో కొట్టుమిట్టాడు తున్నాను .. 


మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Sunday, 27 April 2014

రుధిరసౌధం131


విషయం అక్కడితో ఆగిపోలేదు యశ్వంత్ .. ఉదయం నేను తిరిగి వచ్చేస్తున్నప్పుడు రచన నాకు దారిలో

కనబడింది .. అప్పుడే తెలిసింది రచన ఈ విషయాన్ని కనిపెట్టిందని .. ఆ తరువాత ఏం జరిగిందంటే అని అంటూ

జరిగిందంతా వివరంగా చెప్పాడు మురారి .

అంతా విని నిశ్చేష్టుడై చేష్ట లుడిగి నిలబడి పోయాడు యశ్వంత్ .

ఏం చేయను యశ్వంత్ ? నేనూ నిస్స హాయం గా ఉండి పోయాను . రచన ని ఆపటానికి ఎంతగానో

ప్రయత్నించాను .. కానీ రచన నా మాట వినలేదు .. ఇదుగో ఇక్కడే .. అసహాయుడినై ఉండిపోయాను యశ్ ..

బాధగా గద్గద స్వరం తో అన్నాడు ..


పరిస్థితులన్నీ ప్రతికూలం గా మారుతున్నాయి మురారి .. ఇలాంటప్పుడే సరిగ్గా ఆలోచించగలగాలి .. నేను ఆ

పాడుబడ్డ కోట గురించి మనం లైబ్రరీ నుండి తెచ్చిన పుస్తకం లో చదివాను . వర్మ రాజుల పాలనలోని కోట అది ..

ఇప్పుడు పూర్తిగా శిథిల మైపోయిందని రాసుంది అందులో .. నువ్వు చెప్పింది వింటుంటే ఆ కోట అదే అయుండాలి .

వైజయంతి అంత నమ్మకం గా రచన ని అక్కడకి రమ్మనటం లో ఖచ్చితంగా రచన కి  హాని చేయటానికి

అయుండాలి  . అన్నాడు యశ్వంత్ బొంగురుపోతున్న గొంతుతో ..

అవును యష్ .. నాకూ అదే అనిపించింది .. ఇప్పుడు సత్య తో పాటూ .. రచన ప్రమాదం లో ఉంది ఏంచేయాలి ?

యశ్ ... నా మెదడు మొద్దుబారిపోయింది .. రచన అక్కడికి  రావొద్దని చెప్పేసింది .. తనని చూస్తె అన్నింటికీ

సిద్దమయే  వేల్లిపోయినట్లు అనిపించింది యశ్వంత్ .. మనం ఆ  ఇద్దర్నీ పోగొట్టుకోవటం లేదు కదా అన్నాడు

మురారి  బాధగా .

లేదు మురారి సమస్య ఎప్పుడు పెద్దగానే కనబడుతుంది కానీ పరిష్కారం మన చేతికి అందుబాటులోనే ఉన్నా

అంతుబట్టదు .. ఇది మనకి సవాల్ .. అటు వ్రుత్తి పరం గా .. మరోవైపు .. ప్రేమ పరంగా .. రచన కి ,సత్యకి మన

ఇద్దరం ప్రాణాలతో ఉండగా ఏమైనా కానిస్తామా ? లేదు మురారి .. పోరాటం మధ్యలో ఆపేవాడు యోధుడు ఎలా

అవుతాడు ? మనం వాళ్ళని కాపాడి తీరాలి .. అన్నాడు యశ్వంత్ ,

అవును యష్ .. నీ మాటలు నాలో ఉత్తేజం నింపాయి .. చెప్పు ఏం చేద్దాం ? ఆ కోట దగ్గరకి వెళదామా ?

అన్నాడు   మురారి .

లేదు మురారి .. వైజయంతి ఉద్దేశ్యం ఏమిటో తెలియకుండా అడుగుముందుకు వేయటం సరైంది కాదు . అసలు

ఆ  కోట దగ్గర కి రచన ని ఎందుకు రమ్మందో .. మనకి తెలియాలి అన్నాడు యశ్వంత్ .

కానీ యష్ .. మనకి ఈ విషయం ఎవరు చెబుతారు ? అన్నాడు మురారి .

విధాత్రి .. అన్నాడు యశ్వంత్ .

విధాత్రా ? నేనీ పేరుని వైజయంతి చెబుతుంటే విన్నాను .. ఆమె చిత్రపటం కూడా మహల్లో చూసాను .. ఆమె అచ్చు

రచన లానే ఉంది యశ్వంత్ .. అన్నాడు మురారి .

అవును మురారి అదంతా నేను నీకు తర్వాత చెబుతాను . ముందు మనం విధాత్రి ని కలవాలి పద మహల్ కి

పోదాం  అన్నాడు యశ్వంత్ .

ఇంకా ఉంది 

మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Saturday, 26 April 2014

రుధిరసౌధం130


అవును .. అసలే మన తింగరి రచన ఉందిగా .. ఏం చేసిందో ఏమో .. పద శివా .. అని లేచాడు యశ్వంత్ .

యశ్ .. ఆ భూపతి మనల్ని ఇల్లు ఖాళీ చేయించ టానికి తొందర పడిపోతున్నాడు .. నువ్వు వెళ్ళు .. అందరి లగేజ్

ప్యాక్ చేసి అక్కడకి వస్తాను .. అన్నాడు శివ .

సరే .. అనబోతు .. శివా .. నా నిర్ణయం ఏమీ నిన్ను ,మన వాళ్ళని ఇబ్బంది పెట్టదుగా .. అన్నాడు యశ్వంత్ .

యష్ .. మనం ముందు నుంచీ మహల్ దగ్గర ఉందామనే వచ్చాం .. అయినా మనం మన లక్ష్యానికి దగ్గరగా

ఉండటమే మంచిది . నీ నిర్ణయాన్ని ఎవ్వరూ కాదనరు .. నువ్వు సైకిల్ తీసుకెళ్ళు నేను లగేజ్ ప్యాక్ చేస్తాను

అన్నాడు శివ .

సరే శివా .. నేనే మహల్ వరకూ వెళ్లి చూస్తాను .. అన్నాడు యశ్వంత్ .

అలాగే అని తల ఊపాడు శివ .

యశ్వంత్ .. ఇంట్లోంచి సైకిల్ తీసుకొని  మహల్ వైపు సాగి పోయాడు .. కాసేపట్లో మహల్ చేరుకొని చుట్టూ

గమనించాడు .. యశ్వంత్ కి అక్కడ ఎవ్వరూ ఉన్నట్టు అనిపించలేదు . లోపల ఏమన్నా ఉన్నారా ? అనుకొని

అప్రయత్నం గా మహల్ కి పశ్చిమ దిశ గా ఉన్న మట్టి బాట వైపు దృష్టి సారించాడు .

ఆ మసక చీకట్లో అక్కడ ఎవరో దారికి ఓ పక్క గా కూర్చున్నట్టు కనిపించింది ..

నొసలు చిట్లించి చూసిన యశ్వంత్ కి అది మురారి అని అర్థమైంది .  మురారి అక్కడ కూర్చున్నాడెం ..

అనుకుంటూ సైకిల్ ని అటు పోనిచ్చాడు ..

చాలా సేపట్నుంచి అలానే బాధగా కూర్చుండి పోయిన మురారి హటాత్తుగా తన ముందు ప్రత్యక్షమైన యశ్ ని

చూసి ప్రాణం లేచోచ్చిన వాడిలా యశ్ .. అంటూ వచ్చి ఒక్కసారిగా హత్తుకున్నాడు ..

మురారీ .. ఏం జరిగింది ? ఇక్కడెందుకు ఉన్నావ్ ?అని అడిగాడు కంగారుగా యశ్వంత్ .

యశ్ .. సత్య .. సత్య ని .. వైజయంతి .. పాపం రచన .. నేను రచన కోసం చూస్తున్నాను అన్నాడు తడబడుతూ

మురారి ఎగదన్నుకొస్తున్న దుః ఖాన్ని అదిమిపెడుతూ ..

నాకేం అర్థం కావటం లేదు మురారీ అసలేం జరిగింది ? నిదానం గా చెప్పు అన్నాడు యశ్వంత్ .

యష్ .. ఏం చెప్పన్రా ? ఇది భయమో .. బాధో తెలీదు .. మనసుని అదుపులో పెట్టుకోలేక పోతున్న .. మీతో చెప్పని

నిజమేంటంటే నా పుట్టిన రోజున సత్య ని వైజయంతి ఆవహించింది . అప్పటినుండీ తనలో వైజయంతి ఉంది ..

మీతో చెబితే సత్య ప్రాణాలకి ముప్పు .. మౌనం గా ఉండలేక .. ఆ విషయం నాలో దాచలేక నరక యాతన పడ్డాను .

అన్నాడు మురారి .

మురారీ నువ్వు చెప్పేది నిజమా ? అంటే వైజయంతి మనతోనే ఉన్నదన్నమాట . సత్య ప్రవర్తన లో ఏదో మార్పు

కనబడుతుంది అని రచన చెప్పినప్పుడు నేను పట్టించుకోలేదు .. ఇప్పుడెం చేయాలి .. తల పట్టుకుంటూ అన్నాడు

యశ్వంత్ .

ఇంకా ఉంది 

Friday, 25 April 2014

సొంతిల్లు


ఇటుక ఇటుక పేర్చినపుడు కార్చి నట్టి చెమట బొట్టు ..

కష్టమంతా పోగు చేసి కనుల కారే నీటి బొట్టు ..

అలుసు గ చూసేటి వాళ్ళ ప్రవర్తన కి చెంప పెట్టు ..

సొంత ఇంటి కల నెరవేరే రోజు న బంధువులకి నుదుట బొట్టు

పెట్టి, ఇంట పండగ కి రారండని మొదలు పెట్టు ..

ఆశల సౌధం లోనా మొదట లక్ష్మి కాలు పెట్టు ..

తీరని కోరిక తీరిన సంతోషం మొహాన వెలుగు నింపి నట్టు  ..

కోరిన గూటికి చేరిన చిలకల జంట గా మారినట్టు ..

చిన్నదైనా పెద్దదైనా సొంతిల్లు స్వర్గామౌను అంటు ..

చిన్న పెద్దలందరితో ఆనందపు లోగిలిలో  సంతసం గా జీవించమంటూ ..

ఆశీస్సులు అందుకోరా చిరకాలం సుఖమయమవునట్టు ;
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Thursday, 24 April 2014

రుధిరసౌధం 129


ఇంతలో ఏదో శబ్దం ఏదో విరుచుకు పడుతున్నట్లుగా .. ఉలిక్కి పడి పైకి చూసింది రచన . పక్కనే ఉన్న ఓ చెట్టు

కొమ్మ విరిగి పడుతోంది . వెంటనే రియాక్ట్ అయి లేచి పక్కకి ఒరిగింది రచన . చెట్టు కొమ్మ ఆమె ముందు

పడుకున్న చోటులో పెద్ద శబ్దం చేస్తూ పడింది .

దడ దడ కొట్టుకుంటున్న గుండె ని దోసిట్లో పట్టుకొన్నట్లు చూస్తున్న రచన కి కొన్ని మాటలు వినబడ్డాయి ..

విశ్రాంతి కావాలా నీకు .. లేదు .. రా రా .. ఆలస్యం చేస్తే సత్య .. సత్య .. జీవితం లో ఇదే ఆఖరి రోజు కానుంది .. అని .

రచన మనసు లో కలవరాన్ని అణచుకొని ముందుకి నడిచింది .


                                                       ****************************

ఇంటికి చేరే సరికి ఎవరూ ఇంట్లో కనబడక పోవటం తో .. శివా .. ఎవరు లేరేంటి ? ఎక్కడకి వేల్లుంటారు ? అన్నాడు

చుట్టూ కలియచుస్తూ యశ్వంత్ .

అవును యష్ .. ఎవ్వరూ కనబడటం లేదు .. అని హాల్ లో ఉన్న రక్తం మరకల్ని చూసాడు శివ .

యశ్ .. అటు చూడు .. హాల్ అంతా రక్తం .. ఏదో జరిగింది .. వణుకు తున్న స్వరం తో అన్నాడు .. శివ .

నొసలు చిట్లించి అటు చూసిన యశ్వంత్ మనసు కీడు శంకించింది ..

శివా .. ఊర్లో వాళ్ళు మన వాళ్ళని ఏం   ఇబ్బంది పెత్టలేదు కదా .. అన్నాడు యష్ .

ఇంతలో గుమ్మం లోంచి బాలయ్య అరుపు వినిపించింది .

అయ్యగారు ఇల్లు ఖాళీ చేయమన్నారు మిమ్మల్ని .. అని ..

శివా .. ముందు వాడిని తీసుకురా ఇక్కడికి .. మనవాళ్ళని ఏమ్చేసారో వీళ్ళు ?

అన్నాడు ఆవేశం గా యశ్వంత్ .

శివ కూడా ఆవేశం గా వెళ్లి బాలయ్య చెయ్యి పట్టుకొని ఈడ్చుకొచ్చాడు ..

ఏయ్ .. వదలండి నన్ను .. నన్నేం చేస్తారు మీరు .. అరుస్తున్నాడు వాడు .

రేయ్ .. చెప్పండ్రా .. ఏం చేశారు మా వాళ్ళని మీరు .. అడిగాడు యశ్వంత్ వాడి పీక పట్టుకొని ..

మేమా ? లేదే .. మేమేం చేయలేదు ..  బాధగా అరిచాడు వాడు .

నిజం చెప్పరా .. మీరేం చేయక పొతే .. ఏమయ్యారు మా వాళ్ళు .. ?  ఇక్కడ ఈ రక్తం మరకలేంటి ? అన్నాడు

యశ్వంత్ కోపంగా ..

ముందు నన్ను వదలండి .. అన్నాడు బాలయ్య .

యశ్వంత్ వాడిని విడిచి పెట్టి చెప్పు .. లేదంటే నీ రక్తం కళ్ళ జూస్తాను .. అన్నాడు .

 నిజమయ్యా .. మీతో పాటే మిగతా వాళ్ళు ఉన్నారని అనుకున్నామయ్యా .. మాకేం తెలవదయ్య .. నా తోడు ..

వాడు తల మీద చెయ్యి పెట్టి  చెప్పాడు .

యశ్వంత్ నిరాశ గా పోరా ఇక్కడి నుంచి అన్నాడు .. అదే అదను అన్నట్టు పరుగున పారిపొయాడు బాలయ్య .

యశ్ మనం ఓసారి మహల్ దగ్గరకి వెళ్ళటం మంచిది .. మనకేమన్నా తెలుస్తుంది కదా అన్నాడు శివ యశ్ భుజం

మీద చేయి వేసి .

ఇంకా ఉంది మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

ప్రేమ వానా ...

కన్నుల్లో కలగా కనిపించావని  

గుండెల్లో గుబులే సృష్టించావని ..

మరవనంది మనసే .. నిను మరవనంది మనసే ..

వెన్నెల్లో అలగా నను తాకావని ..

ఎండల్లో మంచే కురిపించావని ..

మరవనంది మనసే .. నిను మరవనంది మనసే ..

అలవోక గా చూసే వాలు కళ్ళల్లోనా ..

నా రూపం కనిపించిందే ఓ నెరజాణా ..

నీ హంస నడకల్లోనా ఓ చినదానా ..

తోడై నే నడవాలని నిన్ను అడిగేసేయనా ..

సంపంగె ముక్కు మీద కోపం ఉన్నా ..

నునుపైనా చెక్కిలి పైనా సిగ్గే దాగున్నా ..

ముద్దొచ్చే నీ మోము చూడాలే నా మైనా ..

మురిపెంగా నీ పైన కురిపించన ప్రేమ వానా ...

మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Wednesday, 23 April 2014

రుధిర సౌధం 128
యశ్వంత్ మాటలకి విస్తుపోయి చూసారంతా ..

ఓ క్షణం భూపతి కి కూడా పరిస్థితి అర్థం కాలేదు . శివ కూడా అయోమయంగా చూసాడు యశ్వంత్ కేసి ..

ఏంటి ఆశ్చర్యంగా ఉందా మీ అందరికి ? ఆ మహల్లో ఉండ వద్దనే హక్కు మీకెవరి కైనా ఉందా ? లేదు కదా .. ఇక

నుంచి నిజాలు బయట పడేవరకు మేము అక్కడే ఉండబోతున్నాం . మీకందరిక్ పూజ్యనీయులైన భూపతి నీడ

మాకు అవసరం లేదు . కానీ ఈ విషయం  లో  దోషి ఎవరన్నది మీకు తెలిస్తే ఈ శిక్షే వారికీ విధిస్తారా ? చెప్పండి

అన్నాడు యశ్వంత్ .

జనాల్లోంచి ఒకరు ఆ .. అలాగే .. అదే న్యాయం అన్నాడు .

అందరూ అతడితో ఏకీభవించారు .

వేరి గుడ్ .. కౌంట్ డౌన్ మొదలయింది భూపతి గారూ .. సిద్ధం గా ఉండండి .. అని శివ వైపు తిరిగి పద శివా ..

అన్నాడు యశ్వంత్ .

మౌనం గా యశ్వంత్ ని అనుసరించాడు శివ .

భూపతి ఆలోచన లో పడ్డాడు .

                                      *****************************************

రచన  అడుగులు మెల్లిగా నేమ్మదించాయి . చుట్టూ చీకట్లు లేతగా పరచుకుంటున్నాయి .. ఆమె అలసట తో ఓ

చెట్టు కానుకొని నిలబడింది . ఆమె కళ్ళ ముందు స్వచ్చంగా నవ్వే సత్య మొహం కదలాడింది .. మురారి కళ్ళ లోని

బాధ కనబడింది . ఆరోజు రాత్రి యశ్వంత్ తనని మందలించడం మెదిలింది .

యశ్వంత్ .. నువ్వు ఆరోజు చెప్పింది నిజం .. మహల్ నాది అన్న గర్వం ప్రవేసించిందేమో .. సత్య కలాంటి సలహా

ఇచ్చాను .. ఇప్పుడు నేను ఆ తప్పు కి శిక్ష అనుభవించటం లో తప్పు లేదు .. కానీ సత్య ఏం చేసింది . ఆమె ఆత్మ

లోలోపల ఎంత క్షోభిస్తుందో .. ఈ పరిస్తితులన్నింటికి నేను కారణం అని తెలసీ కూడా మురారి ఇలాంటి పరిస్థితి

లోను ఎంత ఉన్నతం గా ప్రవర్తించాడు .. ? లేదు .. ఏమైనా సరే .. నేను ధైర్యం కోల్పోయే సమస్యే లేదు ..

వైజయంతి ని ఎదిరించి తీరతాను .. సత్యని కాపాడి తీరతాను .. ఎంత కష్ట మైనా సరే .. ఆమె మనసు లోనే

ధైర్యాన్ని కూడదీసుకుంది .. లేని ఓపిక ని తెచ్చుకుని ముందుకి నడవటం ప్రారంభించింది రచన .

ఎంత నడుస్తున్నా దూరం తరగని ఆ బాట ఆమె లో ధైర్యాన్ని మాత్రం సన్నగిల్లేలా చేయలేకపోతుంది .. కానీ

ఎందుకో అలసట తో ఆమె శరీరం ముందుకి సాగటానికి సహకరించక పోవటం తో దారికి ఓ పక్క గా నేల పై కూలి

పడి ఉన్న ఓ వృక్షం మీద మేను వాల్చింది రచన .

(ఇంకా ఉంది )

మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Tuesday, 22 April 2014

ఎడబాటుక్షణమొక  యుగమవుతుందంటే నమ్మలేదు ..

నీకోసం ఎదురుచూస్తుంటే అర్థమవుతుంది ..

యుగమొక క్షణం కాగలదంటే ఎలా అనుకున్నా ..

నీతో గడిపిన జ్ఞాపకాలు తెలిపాయి కాలమెలా గడచిపోయిందో ..

మనసు లోతుల్లో  బరువు ఎడబాటు భారం అని తెలిసి ..

ఆ భారాన్ని మోయలేని మనసుకి సర్ది చెబుతున్నా ..

ఈ దూరం తరిగిపోయేదే అయినా .. తేలికగా తీసుకోలేకున్నా ..

ఆకాశం ఆవలి అంచున మెరిసే మేఘాన్ని అడుగుతున్నా ..

కాస్త నీ క్షేమాన్ని తెలపమని ..

నా ఎదురుచూపులన్ని తనపై చిరు చినుకుల్లా కురిపించమని ..

రాత్రైతే నింగిన చుక్కలతో మాట్లాడుతున్నా ..

నీ నవ్వుల తళుకు ని  వాటిలో  చూప మని ..

నిను చూపలేని కనులని తిడితే కలలో నువ్వొస్తావని చెప్పాయి ..

నీ  మాట వినలేని వీనుల నడిగితే చిరుగాలి తో కబుర్లు వస్తాయన్నాయి ..

ఏమో నీ సామీప్యం కన్నా గొప్ప ధైర్యం ఈ లోకం లో నాకేది ఇస్తుంది ?


మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

రుధిర సౌధం 127


మీ అసందర్భ ప్రేలాపనలు ఆపండి .నిన్నటి రోజు సరస్వతి  మీతో పాటు ఉందా లేదా ? అన్నాడు భూపతి ..

భూపతీ రంగస్థలం వెనుక ఏం జరిగిందో ఊహించలేనంత పిచ్చివాళ్ళం కాదు మేము .. ఇదుగో ఈ జనం ..

అమాయకులు నీ మాటలు నమ్మి ఇక్కడ పోగయ్యారు . కానీ నిజం అన్నది కళ్ళ ముందు నిలబడితే నీ పరిస్థితి

ఏంటి ? వీళ్ళందరి మధ్య మమ్మల్ని దోషులుగా నిలబెట్టాలన్న పంతం లో నువ్వూ తప్పులు చేస్తావు భూపతీ ..

కానీ మా గురించి తప్పుడు అంచనాకి వస్తే ఫలితం చేదుగా ఉంటుంది భూపతీ అన్నాడు యశ్వంత్ .

మాటలు చెప్పటానికి ఏముంది ? మీరా విషయం లో ముదుర్లు .. ముందు మా పిల్ల ని ఏం చేసారో చెప్పండి ?

అన్నాడు భూపతి

ఆ విషయం చెప్పాల్సింది నువ్వు భూపతీ .. రాముడి చావు వెనుక నీ హస్త ముంది .. ఆ విషయం మాకు తెలుసు ..

ఇప్పుడు సరస్వతి కనబడకపోవటం వెనుక నీ హస్తమే ఉండి ఉంటుంది అన్నాడు శివ .

ఆపండి నోటికి ఏమొస్తే అది మాట్లాడకండి .. సరస్వతి ని పోలిస్ స్టేషన్ కి మీరే తీసుకు వెళ్ళింది .. అన్నాడు

బాలయ్య .

నిజమే .. కానీ సరస్వతి ని మేమే ఏమన్నా చేసామని సాక్ష్యముందా ? సరస్వతి ని తీసుకువెళ్ళింది ధాత్రి ,సత్య ..

వాళ్ళిద్దరూ ఆడపిల్లలు .. ఆ సమయం లో మేము ఊరిలోనే ఉన్నాము .. సరస్వతి వారితో బంధువుల ఇంటికి

వెళ్తానని చెప్పింది .. వారు నమ్మి వెల్లనిచ్చారు .. కానీ సరస్వతి మాయమైంది . కాదు మాయం చేసారు .. అది

ఎవరో తేల్చకుండా ఇక్కడ నుంచి కదిలేదే లేదు అన్నాడు యశ్వంత్ .

సామీ ఈళ్ళని అడుగుతూ కూకుంటే ఇల్లానే మాటాడతారు .. ఈళ్ల తప్పుకి శిక్ష ఏయండి అన్నాడు బాలయ్య .

భూపతి ఓ నవ్వు నవ్వి జనాన్ని చూసి .. చెప్పండి .. వీళ్ళు తప్పు చేశారని మీరు నమ్ముతున్నారా ? అని

అడిగాడు .


నమ్ముతున్నామయ్యా .. అన్నారు జనం .

అయితే వీరిని గ్రామం నుండి బహిష్కరిద్దాం .. మన ఆడపిల్లని మనకి సవ్యం గా అప్పగిస్తేనే శిక్ష రద్దు చేస్తాం ..

అంతవరకూ వీరికి మన గ్రామం లో తిరగటానికి గానీ ... తిండి అవసరాల కొనుగోల్లకి గానీ అనుమతించం ..

అన్నాడు భూపతి పెద్దగా ..

అమాయక జనం .. అంతే .. అంతే .. అని అరిచారు .

యశ్వంత్ , శివ కోపం గా చూశారు భూపతి వైపు ...

ఈ నియమం మీ ఇద్దరి స్నేహితులకి కూడా వర్తిస్తుంది .. అన్నాడు భూపతి .

"సరస్వతిని రచన తీసుకెళ్లిందని భూపతి కి తెలియదా .. ? శిక్ష నుంచి రచన కి ఎక్సెప్షన్ ఇచ్చాడు " అనుకున్నాడు

మనసులో యశ్వంత్ .

యశ్వంత్ ఏం చేద్దాం ? అన్నాడు శివ పళ్ళు కొరుకుతూ ..

మీ ఇష్టం .. మీరు మీ భూపతి నే నమ్మారు .. కానీ .. బట్ .. మేము మీ నిర్ణయాన్ని దిక్కరించం . ఈ క్షణం నుంచీ

మేము మీ ఊరి చివర ఉన్న రాణి మహాల్లోనే ఉంటాం .. నిజాల్ని మీ కళ్ళ ముందు నిలబెడతాం .. అన్నాడు

యశ్వంత్

ఇంకా ఉంది 
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Monday, 21 April 2014

రుధిర సౌధం 126


ఏమయ్యుంటుంది యశ్వంత్ ? వీళ్ళంతా మనకి అడ్డం పడ్డారేంటి ? వాళ్ళ వంక ఆశ్చర్యం గా చూస్తూ అన్నాడు శివ .

జనాలలో ఉన్న సరస్వతి తాత ని చూసి .. వెహికల్ దిగి అతని దగ్గరకి నడిచి ఏమైంది తాతా అని అడిగాడు యశ్ .

ఏమైందని అడుగుతున్నావా ? మీరే కదూ మా సరస్వతి ని మాయం చేసింది .. కోపం గా అన్నాడు తాత .

తాత వైపు అయోమయం గా చూసాడు యశ్వంత్ . శివ కూడా బండి దిగి వచ్చి ఏమన్నావ్ తాతా? మీ సరస్వతి

కనబడడం లేదు అన్నావని ఈరోజంతా మేము తన కోసం వెదికి వస్తుంటే నువ్వు మేమే మాయం చేసావు

అంటున్నావా ? అన్నాడు శివ అసహనం గా .

యశ్వంత్ పరిస్థితి ని అంచనా వేయసాగాడు .

చూడు బాబు .. మా సరస్వతి మీ కాడికే వచ్చినాది .. ఆ తరవాత కనబడలే .. ఎవర్ని అడగాలే ... మిమ్మల్నే గదా..

అన్నాడు తాత .

కానీ తాతా .. సరస్వతి తనే బంధువుల ఇంటికి వెళ్తానని వెళ్ళిపోయింది . అంతే .. మేమేమీ చేయలేదు ... పైగా

మీకు సహాయం చేయాలనుకున్నాం .. అన్నాడు యశ్వంత్ .

లేదు మీరు పట్నమోల్లు .. ఏమైనా చేయగలరు .. మా పిల్ల నేం చేసినారో ఏమో .. దాని మొగుడు ఆ దెయ్యాల కోట

కాడ చనిపోతే ఎవరో చంపేసిన్రని దాని మనసున విషం నింపేసినారు .. అది మిమ్మల్ని నమ్మినాది .. ఇప్పుడు

కనబడదాయే .. ఏడ నుందో నా బిడ్డ .. అన్నాడు గద్గద స్వరం తో తాత .

ఇంకా వీళ్ళతో మాటలేంటి తాతా .. పద భూపతి సామి దగ్గరకి తీసుకుపోదాం .. అన్నాడు జనాల్లోంచి ఎవరో ..

జనం లోంచి నలుగురు వచ్చి యశ్వంత్ శివ ల చేతులు గట్టిగా పట్టుకున్నారు .

వదలండి మమ్మల్ని .. మేము రాగలం .. అన్నాడు యశ్వంత్ .

చూసావా యశ్ .. మనం వీళ్ళకి సహాయం చేయాలనుకుంటే వీళ్ళెం చేస్తున్నారో .. అన్నాడు శివ కోపంగా .

వాళ్ళెవరు వీళ్ళని వదలలేదు .. అంతా కలసి భూపతి దగ్గరకి తీసుకెళ్ళారు యశ్వంత్ ,శివ లని ;

భూపతి తన బంగ్లా ముందు కుర్చీ వేసుకొని వీరి కోసమే వేచి చూస్తున్నట్టు కూర్చున్నాడు ..

భూపతి ఎదురుగా నిలబెట్టాక వారి చేతుల్ని విడిచి పెట్టారు ఆ నలుగురు .

భూపతి వీళ్ళని చూసి ఓ విషపు నవ్వు నవ్వాడు .. ఆ నవ్వు లో విజయ గర్వం ఉంది .

యశ్వంత్ ,శివ భూపతి వైపు సూటిగా చూసారు .

ఏమయ్యా పట్నం బాబులు .. మీకు మా ఊరి పిల్ల అదీ మొగుడు చచ్చిన ఆడదే కావాల్సి వచ్చిందా ? ఏం చేసారు

ఆ పిల్ల ని ? వెటకారంగా అడిగాడు భూపతి .

కొంచెం మర్యాదగా మాట్లాడు భూపతీ .. గర్జించాడు శివ .

భూపతిగారు అవకాశం కోసం కాచుక్కూచున్న ఓ గుంట నక్క విన్యాసం ఇదని మాకు తెలుసు . మమ్మల్ని

ప్రశ్నించే ముందు ఒక్కసారి ఆలోచించుకున్నారా ? సింహం ముందు నక్క విన్యాసాలు చెల్లవని .. అన్నాడు

యశ్వంత్  .

భూపతి కి కోపం తారా స్థాయి కి పెరిగింది .

ఇంకా ఉంది 
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

రుధిర సౌధం 125

నేను ఒంటరిగానే వెళ్ళాలి మురారీ ,,మంచో చెడో ఆ ఫలితం నేను అనుభవించాలి.. తప్పదు . నా మీద నమ్మక

ముంచు .. నేను సత్యతోనే తిరిగివస్తాను . అంది రచన

సత్య కోసం నిన్ను .. నీకోసం సత్యని బలిపెట్టలేను నేను . నువ్వు వెళ్ళటమే నిశ్చయమై యుంటే నేను నీతో పాటే .

రచన ..   అన్నాడు మొండిగా మురారి .

వైజయంతి ఏం చెప్పింది ? నన్ను ఒంటరిగా రమ్మంది కదా .. లేకపోతె సత్య కి ప్రమాదం . అంది రచన .

కానీ నువ్వే చెప్పావుగా రచన .. వైజయంతి మనలో ఎవర్ని ఏమీ చేయలేదని .. ఆ నమ్మకం తోనే ముందుకి వెళ్దాం

అన్నాడు మురారి .

మన నమ్మకం నిజమో కాదో  తెలియ కుండా కూడా రిస్క్ చేయలేం కదా మురారి   .. అందుకే నన్ను వెళ్ళనీ ..

అంది స్థిరం గా రచన .

నువ్వేన్నైనా చెప్పు రచనా నేను నిన్ను ఒంటరిగా  వదలే ప్రసక్తే లేదు . నా మాట విను .. అన్నాడు మురారి .

 మురారీ  సత్య నావల్లే కష్టాల్లో ఉంది . మీ కళ్ళల్లో బాధ ని ,అసహనాన్ని భరించలేను .. నన్ను వెళ్లనివ్వు మురారీ .

భయాన్ని నీలో పోగొట్టుకొని నా గుండెల్లో నమ్మకాన్ని  అర్థం చేసుకో .. ఈ పని నేను చేయగలను .. ఆ విషయం నా

కళ్ళలోకి చూసి అవగాహన చేసుకో    అంది అతడ్ని సూటిగా చూస్తూ .

అతడు అసక్తత తో సరేనన్నాడు ..

మహల్ విడిచి కొంత దూరం  వెలితె మట్టి బాట వస్తుంది .. అది వైజయంతి  చేప్పిన కోట వైపు తీసుకు వెళుతుంది .

అక్కడికి చేరుకున్నాక....

నువ్వు వెళ్ళు మురారీ .. యశ్వంత్ వాళ్ళతో కూడా చెప్పు ఇక్కడకి రావటానికి ప్రయత్నించవద్దని .. అంది రచన .

రచనా .. నీకేం చెప్పాలో తెలియటం లేదు కానీ ఒక్క మాట .. నీ ధైర్యమే నీ ఆయుధం .. దాన్ని చేజార నివ్వకు ..

మీ  రాక కోసం ఎదురు చూస్తూంటాం .. అన్నాడు నీరసం గా మురారి .

ఆమె చిన్నగా తలూపి వెనక్కి తిరిగి ఆ బాట లో సాగి పోయింది .

నిల్చున్న చోటే కూల బడి బాధ గా రచన వెళ్తున్న వైపు చూశాడు మురారి .

ఆమె తెగువ  కి   మనసు లోనే జోహార్లు  అర్పించాడు మురారి ..

అదే సమయం లో యశ్వంత్ ,శివ వస్తున్న కార్ ఊళ్లోకి ప్రవేశించింది .

గ్రామస్తులు  కొందరు వారిని అడ్డగించటం తో సడెన్ బ్రేక్ వేసాడు యశ్వంత్ .

ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Saturday, 19 April 2014

సహకారం


కంటి నీరు ఉబికి ఉబికి రెప్పగట్టు దాటగా ..

చెక్కిలమ్మ చేరదీసి తనలోన దాచగా ..

ఒదిగి పోయి మచ్చతెచ్చె ఆ కన్నీటి చారికా ..

గుండె లోన దుః ఖ మంతా అలల సుడులు తిరగగా ..

ఉప్పెనైన సంద్రమల్లె అశ్రుధార కురియగా ..

చెక్కిలమ్మ బెదిరిపోయి మోము చిన్నబోవగా ..

హస్తమొచ్చి నీరు తుడిచి చేదోడై నిలిచెగా ..

కష్టమొస్తే కంట నీరు సంతోషమైతే పెదవి తీరు

ఒకరి కొకరు తోడు కాగా సందేశ మేదో చెప్పకనే చెబుతోంది గా

అవయవాల నడుమ కూడా సహకారముండగా

మనిషి కొరకు మనిషి రాడు యిదేమీ చోద్యమో కదామీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Friday, 18 April 2014

రుధిర సౌధం 124


రచన , మురారి ఇద్దరూ రాణి మహల్ చేరుకున్నారు . గేటు తీసి లోపలకి అడుగు పెట్టారు . మురారి మనసంతా

కలవరంగా ఉంటె రచన పంతంగా ముందుకి నడిచింది . మహల్ తలుపులు తీసే ఉన్నాయి . ఇద్దరూ మహల్

గుమ్మం లో నిలబడి లోపలికి చూశారు .. నేలంతా రక్తం తో తడిసి పోయి ఉంది . మధ్యలో సత్య నిలబడి ఉంది ..

ఆమె చేతిలో ఓ పక్షి గిలగిలా కొట్టుకుంటుంది . చుట్టూ బేల కళ్ళతో మరిన్ని పక్షులున్నాయి ..

లోపలికి రండి .. అక్కడే నిలబడి పోయారేం ? అని వెటకారం గా నవ్వి ఆమె చేతిలో పక్షి మెడని కొరికింది .. ఆ

దృశ్యం ఒళ్ళు గగుర్పొడిచేలా వుంది .

వైజయంతీ .. నా సత్య ని ఇలా చూడలేను . తనని విడిచి పెట్టు .. దయనీయం గా అడిగాడు మురారి .

ఆమె నోటి నుండి రక్తం కారుతోంది . భయంకరంగా నవ్వి పరిష్కారం మీ చేతిలో ఉంచుకొని సమస్యని పెద్దది చేసు

కుంటున్నారు .. నీ పక్కన నిలబడి ఉందే .. నీ స్నేహితురాలు .. తన స్వార్థం కోసం మీరు బలి అవుతున్నారు .. ఆ

విషయం గ్రహించి మసలు కొండి .. మహల్ ని , ఈ ప్రాంతాన్ని నాకు వదిలిపోవటమే మీకు శ్రేయస్కరం .. అంది

బొంగురు గొంతు తో వైజయంతి .

మురారి రచన వైపు అసహనం గా చూశాడు .

ఆమె కోపంగా వైజయంతి వైపు చూస్తోంది .

మా మథ్య మనస్పర్థ లు సృష్టించాలని చూస్తున్నావా వైజయంతీ .. క్షత్రియ కన్య వయుండీ పిరికితనం తో ఓ

అమాయకురాలిని అడ్డు పెట్టుకొని ఆటలాడుతున్నావు .. సిగ్గు గా లేదా ? అడిగింది రచన ఆవేశం గా .

రచనా ... అంటూ ఉరిమింది .

చూడు .. ఈ పోరాటం నీకూ నాకూ మధ్యే .. వేరొకరికి సంభంధం లేదు . నా స్నేహితులకి ఇబ్బంది కలగజేసావు

అంటే నీలో క్షత్రియ లక్షణాలు లేనట్లే .. అంది రచన .

ఓహో .. ఎంతటి కావరమే నీకు ? అలా అయినచో  నా మాట విను .. ఈ సత్య మీకు దక్కాలంటే .. నువ్వు ఓ పని

చేయాలి .. అంది వైజయంతి .

 చెప్పు వైజయంతీ .. నీకీ మహల్ ని వదిలి పెట్టడం తప్ప వేరే ఏదన్నా చేస్తాను సత్య ని విడిచి పెట్టు .. అంది రచన

ఆశ గా ..

సరే అయితే .. ఈ ఊరికి దక్షిణాన కొన్ని వందల గజాల దూరం లో ఓ పాడుబడిన కోట ఉంది . ఆ కోట కి అర్ధరాత్రి

నువ్వు ఒంటరిగా రావాలి . సత్య ని అక్కడ నీకు అప్పజెబుతాను . నీ ధైర్యానికి అక్కడ పరీక్ష జరుగుతుంది .. నీ

 స్నేహితుల సహాయం తీసుకొనరాదు . నువ్వే ఒంటరిగా రావాలి .. రా .. అని భయంకరంగా నవ్వుతూ అక్కడి

నుండి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది వైజయంతి .

ఒక్కక్షణం అక్కడ నిశ్శబ్దం ఆవరించింది .

అంతల్లోనే తేరుకొని .. మురారీ .. నేను ఆ పాడుబడ్డ కోట కి వెళ్తాను .. సత్య ని తీసుకొస్తాను .. నువ్వు  ఇక్కడి

నుంచి ఇంటికి వెళ్ళు అంది రచన .

నో రచనా .. నేనూ వస్తాను .. సత్య తో పాటూ నిన్ను ఇబ్బంది పెట్టాలనే వైజయంతి అలా అంది .. నువ్వు ఒంటరిగా

వెళ్ళడం అంత మంచిది కాదు అన్నాడు మురారి కంగారుగా .

ఇంకా ఉంది రుధిర సౌధం 125 భాగం సోమ వారం చదవండి

మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Thursday, 17 April 2014

రుధిర సౌధం 123

యశ్వంత్ .. సరస్వతి బంధువు లందరూ ఆమె తమ ఇంటికి రాలేదని చెబుతున్నారు . మరైతే ఆమె ఎక్కడ కి

వెళ్లినట్టు ? అసహనం గా అన్నాడు శివ .

అదంతా ఒక ఎత్తైతే పోలీసాఫీసర్ చెప్పింది మరొక ఎత్తు శివా .. ఆమె తన స్టేట్మెంట్ లో భూపతి పట్ల తనకి ఎటువంటి

అనుమానం లేదని చెప్పిందట . ఏం అర్థం కావటం లేదు శివా .. అన్నాడు యశ్వంత్ .

నాకు మాత్రం ఇదంతా పెద్ద కుట్ర ఏమో అనిపిస్తుంది యశ్వంత్ .. అన్నాడు శివ .

అవును శివా ..  ఇదంతా కుట్రే .. అనుమానం లేదు .. ముందు మనం ఊరికి పోవాలి . నా మనసెందుకో కీడు

 సంకిస్తోంది .. అన్నాడు యశ్వంత్  వెహికేల్ స్టార్ట్ చేస్తూ ..

అవును యశ్ .. మురారి కూడా దిగులుగా ఉంటున్నాడు .. వాడి మనసులో ఏముందో తెలియటం లేదు ..

అన్నాడు శివ .

అన్ని సమస్యలు క్లియర్ అవుతాయి శివా .. మీకు నేను ఈ హడావుడిలో పది చెప్పలేదు .. అసలు మధ్యాహ్నం

ఏం జరిగిందో తెలుసా ? అంటూ రచన గౌన్ చిక్కుకు పోవటం నుంచీ గుడి కనిపించటం వరకు అన్ని వివరంగా

చెప్పాడు యశ్వంత్ .

వహ్ .. యశ్వంత్ .. ఇది నిజంగా మంచి విషయం .. ఇకన్ని పరిష్కారమై పోతాయని పిస్తుంది .. కానీ యశ్వంత్

గుడి తలుపులు తెరవట మెలా ? అంత నీటిలో దీపాలు ఎలా పెట్టడం అన్నాడు శివ .

తెలీదు శివా .. కానీ ఇంత వరకూ వచ్చాం .. ఆ పని మాత్రం చేయలేమా ? ఈ పౌర్ణమికి గుడి తలుపులు తెరవాలి ..

అదెలా అన్నది తెలీదు కానీ జరుగుతుంది నాకా నమ్మకం ఉంది .. అన్నాడు యశ్వంత్ .

ఇంత సంతోషమైన విషయాన్ని మనం సెలెబ్రేట్ చేసుకోవాలి కాని అలా జరగటం లేదు .. ఈ సరస్వతి

 ఏమై పోయి ఉంటుందో .. కోపంగా అన్నాడు శివ .

శివా .. ఎందుకో సరస్వతి ఇలా చేయటానికి కూడా ఏదో కారణం ఉండుంటుందని అనిపిస్తుoది నాకు . ఎందుకో

బలంగా ఈ విషయం వెనుక భూపతి హస్తం ఉందని అనిపిస్తుంది నాకు ... అన్నాడు యశ్వంత్ .

నిజానిజాలు దేవునికెరుక యశ్వంత్ ... అన్నాడు శివ

అలా అంటే కుదరదు శివా .. అది మన వృత్తి కె అవమానం ..నివృత్తి చేసుకోవటమే మన ప్రవ్రుత్తి అన్నాడు తమాషా

గా యశ్వంత్

 ఏంటి యశ్ ? తెలుగేనా మాట్లాడేది అన్నాడు నవ్వుతూ శివ .

అనుమానమా ? అయినా ఈ మథ్య ఆ రాణి మహల్ చుట్టూ తిరిగి గ్రాంథిక భాష అలవాటై పోయిందిలే శివా ..

అన్నాడు యశ్వంత్ .

గుండెల్లో ఉన్న ఒత్తిడి ని తగ్గించుకోవటానికి సరదాగా మాట్లాడుకుంటున్న ఆ ఇద్దరు స్నేహితులకి తెలీదు ..

అక్కడ రావణ పురం లో తీవ్ర మైన మానసిక ఒత్తిడి తో నలిగిపోతున్న తమ స్నేహితుల గురించి ...

యశ్వంత్ డ్రైవ్ చేస్తున్న వేహికాల్ రావణ పురం వైపు దూసుకు పోతోంది ...

ఇంకా ఉంది 
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

రుధిర సౌధం 122

మరి మాతో ఇంతవరకూ ఈ విషయం ఎందుకని చెప్పలేదు ? దాని కోసమే కదా ఇంత శ్రమ , బాధ .. మరి మాతో

చెప్పాలని మీకు అనిపించనే లేదా ? ఆవేశం గా నిలదీశాడు మురారి .

నిజమే మురారి .. మాది తప్పే .. కానీ మీ దగ్గర దాచాలన్నది మా ఉద్దేశ్యం అయితే కాదు .. మీతో ఆ సంతోషం

పంచుకొనే లోపే సరస్వతి సమస్య మన తలుపు తట్టింది .. సమస్యలన్నీ మన చుట్టూ కమ్ముకుంటున్నాయి

మురారీ .. ఇప్పుడు మనం మరింత అప్రమత్తం గా ఉండాలి .. అంతే తప్ప ధైర్యాన్ని కోల్పోకూడదు .. అంది రచన .

నాకే ఆలోచన తట్టడం లేదు రచనా .. మెదడు అంతా మోద్దుబారిపోయినట్లు ఉంది . గుండె ఆగీ ఆగీ కొట్టు

కుంటుంది . అన్నాడు బాధగా మురారి .

మురారీ .. నువ్వు బాధపడటం లో అర్థముంది .. నేను నీ స్థితి ని అర్థం చేసుకోగలను .. కానీ ఇది బాధ పడే

సమయం కాదు మురారీ ... ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి మనం .. పోరాడటానికి సిద్ధ పడాలి .. అంది రచన .

అతడు లేచి నించున్నాడు .

అవును .. నువ్వు చెప్పింది నిజం .. ఒక్కోసారి ప్రేమ మన బలహీనత అవుతుంది .. అందుకే డీలా పడిపోయాను .

కానీ ఇప్పుడు అదే ప్రేమ నా బలం .. నా సత్య ని కాపాడుకునేందుకు పోరాడతాను .. అన్నాడు మురారి .

థాంక్ యు మురారీ .. అంది రచన .

అన్నట్టు రచనా నువ్వు చెప్పింది కూడా నిజం . ఆ వైజయంతి మన ప్రాణాలను తీయలేదు .   దానికేదో కారణం

ఉంది .. ఆ కారణం తో మనకి పనిలేదు . ఆ నమ్మకం చాలు .. ఆ మానవాతీత శక్తిని ఎదురించడానికి .. అన్నాడు

మురారి .

అవును మురారి .. కానీ మాటలతో కాలయాపన వద్దు .. ముందు మహల్ కి వెళ్దాం .. అంది రచన .

పద రచనా .. అని ముందుకి కదిలాడు మురారి .

                                                  ************************

భూపతి గదిలో దివాన్ మీద ఒంటరిగా పడుకున్నాడు .

ఇంతలో నాన్నగారూ అంటూ వచ్చాడు రత్నం రాజు .

రా రత్నం .. ఏమైనా మాట్లాడాలా ? అన్నాడు భూపతి .

నాన్నా .. అంటూ దివాన్ చివరన కూర్చుని అతడి కాళ్ళని తన ఒడిలో పెట్టుకొని కాళ్ళు నొక్కటం మొదలు పెట్టాడు

రత్నం రాజు .

ఏ అవసరం వచ్చింది ? తండ్రి కి సేవ చేయాలనే ఆలోచన వచ్చింది ? అన్నాడు భూపతి .

నాన్నా .. ఈ మథ్య ధాత్రి ఇంటికి సరిగ్గా రావటమే లేదు . వచ్చినా ఎక్కువసేపు ఉండటం లేదు ... నా మనసులో

మాట నేను తనతో చెప్పలేక పోతున్నాను . మీరైనా ధాత్రి తో ఈ విషయం కోసం మాట్లాడండి నాన్నా.. అన్నాడు

రత్నం .

చిన్నగా తల పంకించి .. ఆ పిల్ల ఇంటికి రానీ మాట్లాడతా .. అన్నాడు భూపతి .

సంతోషంగా చిరునవ్వు నవ్వాడు రత్నం .


ఇంకా ఉంది

మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Tuesday, 15 April 2014

రుధిర సౌధం 121


గుడి కనబడింది అన్న రచన మాటలు వైజయంతి గుండెల్లో గుబులు పుట్టించాయి . ఉడికిపోయిన ఆ దెయ్యం

కళ్ళెర్రజేసి మంచి కి నియమం ఉంటుంది కానీ చెడుకి ఎటువంటి నియమం ఉండదు , ఏ ఆత్మ విశ్వాసం తో నీవిలా

మాట్లాడుతున్నావో ఆ ఆత్మ విశ్వాసం పైనే దెబ్బ కొడతా .. సిద్ధం గా ఉండండి . ఈ క్షణం నుండీ మీకీ సత్య

కనబడదు ... కనబడదు .. అని విచిత్రంగా గోడ మీద నడుస్తూ పైన తిరుగుతున్న ఫ్యాన్ రెక్కల పైన కూర్చుంటూ

 చెప్పింది వైజయంతి .

నో .. నా సత్య ని ఏం చేయకు అరిచాడు పైకి చూస్తూ మురారి .

తన చేతిని తిరుగుతున్న ఫ్యాన్ రెక్కల మథ్య పెట్టింది వైజయంతి .

వేలు కట్ అయిన శబ్దం .. ఆ వెంటనే అమ్మా .. అన్న ఆర్తనాదం ..

సత్యా .. కలవరంగా అంది రచన పైకి చూస్తూ ..

ఇది దాని కేక .. ఇక నుంచీ మీకు నరకం కనబడుతుంది .. అంటూ అక్కడినుంచి బయటికి ఎగురుకుంటూ వెళ్లి

పోయింది వైజయంతి .

జరిగిన సంఘటన ని చూసి మాన్ప్రదిపోయారు మురారి , రచన .

రచనా .. ఏం జరుగుతుంది ? ఇక నా సత్య నాకు కనిపించదా ... ? బేలగా అడిగాడు రచన కళ్ళలోకి సూటిగా

చూస్తూ మురారి .

మురారీ .. ఇలా జరుగుతుందనుకోలేదు .. తనని బెదిరిస్తే తను సత్యని వదలి వెళ్ళిపోతుందని అనుకున్నాను ..

అంది రచన తప్పు చేసి నట్లుగా ..

భగవంతుడా .. అంటూ మోకాళ్ళ పై కూలబడిపోయాడు మురారి .

మురారీ  ప్లీజ్ ధైర్యంగా ఉండు . ఇప్పుడు వైజయంతి సత్య ని మహల్ కె తీసుకేల్లుంటుంది ... మహల్ కి వెళ్లి

చూద్దాం పద మురారీ .. అంది రచన .

అతడు తన రెండు చేతుల్లో మొహం పెట్టుకొని ఏడ్చేశాడు .. నేల పై పడిన రక్తపు చుక్కలని చూసి చూడు రచనా ..

ఇదంతా నా సత్య చిందించిన రక్తం .. ఇంకా  నేను ఏ ధైర్యం తో   ఉండను ? అన్నాడు మురారి .

మురారీ ఆ వైజయంతి వ్యూహమే ఇది మన మానసిక ధైర్యాన్ని సన్నగిల్లేలా చేయటం .. నువ్వు డీలా పడకు ..

నా మాట నమ్ము అంది రచన .

ఒక్కసారిగా తేరుకొని నిజంగా గుడి కనిపించిందా ? అన్నాడు మురారి .

అవును మురారి ..    అంది రచన .

 ఇంకా ఉంది మీ అభిప్రాయం మాకు అతి విలువైనది