Powered By Blogger

Wednesday, 2 April 2014

రుధిర సౌధం 109

నీటిలో పడటం తో పెద్దగా దెబ్బలేమీ తగల్లేదు యశ్వంత్ కి .

యష్ .. ఏం కాలేదు కదా నీకు ? ఆందోళన గా అడిగింది రచన .

అరె లేదు రచనా .. అని కాస్త తేరుకున్నాక ఆలయ ద్వారం వైపు చూసాడు .

ఆలయద్వారాన్ని ముట్టుకోగానే ఇలా వచ్చి పడ్డావంటే .. కారణం ఏమయ్యుంటుంది ? భయం గా అంది రచన .

లేదు రచనా .. నువ్వేం బాధపడకు . ఆలయద్వారం అంత తేలిగ్గా ఎలా తెరచుకుంటుంది .. అదీ ఎప్పుడు పడితే

అప్పుడు .. అన్నాడు యశ్వంత్

మరి ? అంది రచన సందేహంగా ..

రచనా .. ఎన్నాళ్ళు నుండో మూసి ఉన్న ఈ గుడి ని ఏటువంటి ముహూర్తం నిర్ణయిన్చాకుండానే ఆలయద్వారాలని

తెరవాలని ఎలా అనుకుంటావు ? నువ్వే చెప్పు అనునయంగా అన్నాడు యశ్వంత్

అవును .. నువ్వు చెప్పేది నిజమే .. అన్నట్టు .. ఆలయం అంతా నీటిలోనే ఉంది యశ్వంత్ .. ఈ నీరు అంతా ఎలా

పోతుంది ఇక్కడి నుంచి . ఈ నీరిలా ఉంటె ఈ ఆలయం లో దీపాలు ఎలా పెట్టగలం ? అంది రచన సందేహంగా .

అవును రచనా .. నువ్వు దీపాలు పెట్టాల్సింది పౌర్ణమి రోజున . పౌర్ణమికి ఇంకా వారం సమయం ఉంది .. ఈలోపు

ఆలయం చుట్టుపక్కలా గమనించాలి . ఒక గొలుసు ఏర్పాటులా ఈ నీటి చక్రం పనిచేస్తుంది . ఇక్కడ్నుంచి ఈ నీటి

ని తొలగించే అమరిక ఉండే ఉంటుంది . అన్నాడు యశ్వంత్ .

అవును .. ఉండే ఉంటుంది యశ్వంత్ . లేదంటే నీటిలో దీపాలు వెలగవు కదా .. నా అంచనా ప్రకారం విగ్రహం కూడా

నీటిలోనే ఉండి ఉంటుంది . అంది రచన ఆలయం వైపు ఆరాధనా భావం తో చూస్తూ .

అవును .. రచనా .. నీటిలో ఇంతసేపు ఉండటం మంచిది కాదు పద .. మన వాళ్ళు మన కోసం ఎదురుచూస్తూ

ఉంటారు . ఇక బయటకి వెళ్లి తదుపరి కార్యక్రమం ఏమిటన్నది ఆలోచించుకోవోచ్చు .. అన్నాడు యశ్వంత్ .

సరే .. యశ్వంత్ .. అని ఆలయాన్ని కళ్ళనిండా నింపుకొని వెనుదిరిగింది రచన .

ఇద్దరూ కాసేపట్లోనే రాతి పలక దగ్గరకి చేరుకున్నారు . రాతి పలక ని తొలగించే సరికి మడుగు నీటితో నిండి ఉంది .

అరె అప్పుడే ఈ మడుగు నీటితో నిండి పోయింది యశ్వంత్ .. అంది కంగారుగా రచన .

మారుమాట్లాడకుండా రాతి పలకని యథా స్థానం లో ఉంచి మడుగు వెలుపలకి వచ్చారు ఇద్దరూ ..

నిజంగా ఎంత విచిత్రంగా ఉందొ ఈ ఏర్పాటు అంతా .. భూ గర్భం లో ఆలయం .. అని రచన ఇంకేదో అనబోతుంటే ..

జలదేవత సంరక్షణ .. అన్నాడు యశ్వంత్ .

వ్వాట్ ? అంది రచన .

అవును రచనా .. ఇదంతా అంత సామాన్య మైన విషయం కాదు . జలదేవత ఆలయాన్ని సంరక్షిస్తుంది . ఇలాంటి

విషయాలు కథల్లో వినడం వరకే తెలుసు మనకి . కళ్ళారా చూడగలగటం మన అదృష్టం .. అన్నాడు యశ్వంత్ .

నిజమే యశ్వంత్ .. వైష్ణవీ మాత లీలల గురించి చిన్నప్పుడు నాన్న కథలు కథలుగా చెప్పేవారు .. ఇదంతా

ఆయన కల . నెరవేర్చగాలిగితే ఆయన సంతోషానికి అవధులుండవు . నీళ్ళు నిండిన కళ్ళతో యశ్వంత్ వైపు

చూస్తూ అంది రచన

ఇంకా ఉంది     
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

2 comments:

స్వర్ణమల్లిక said...

Chalaa Baagundi. Malli repati kosam waiting.

రాధిక said...

thanks for your every comment swarna mallika garu..

rudhirasoudham serial ni ilaage follow avutu undandi.. mee anchanaalani takkuva kaanivvanani
maata istunnanu