Powered By Blogger

Thursday, 3 April 2014

రుధిర సౌధం 110
యశ్వంత్ రచన వైపు ఆర్తిగా చూస్తూ .. మనం మన లక్ష్యానికి అతి చేరువలో ఉన్నాం రచనా .. తప్పకుండా మనం

ఈ ప్రయత్నం లో సఫల మవుతాం . మీ నాన్నగారి కల నెరవేరే అవకాశం అతి తొందర లో ఉంది . .. అన్నాడు

యశ్వంత్ .

నిజమే యశ్వంత్ .. అయినా నీలాంటి వాడు నాకు తోడుగా ఉంటె నేనెన్ని కలలైనా కనొచ్చు కదూ .. అంది చిలిపిగా .

అదిగో మళ్లి నీలాంటి వాడు అంటావు .. నేనే స్వయంగా ఉన్నప్పుడు .. అన్నాడు ఉడుక్కుంటూ యశ్వంత్ .

సరే యశ్వంత్ .. ఇప్పుడు నాకు బాగా ఆకలేస్తుంది . పద త్వరగా వెళదాం .. అంది చిరునవ్వుతో ..

పద అని ఆమె భుజం మీద చేయి వేసి ముందుకి నడిపించాడు యశ్వంత్ .

వారిద్దరూ అక్కడినుంచి వెళ్లిపోతుంటే .. అంతవరకూ వాళ్ళిద్దర్నీ ఆప్యాయంగా చూస్తున్న విధాత్రి ఆత్మ వారిని

మనసారా దీవించింది .

మహల్ ని విడిచి ఊరి వైపుగా నడుస్తూ .. నాకెందుకో కొంచెం సత్యలో ఏదో మార్పు కనిపిస్తుంది యశ్ .. అంది

రచన .

అంటే ... ఏవిధమైన మార్పు ..? అన్నాడు యశ్వంత్ .

తన నడక , బాడీ లాంగ్వేజ్ , మాట్లాడే తీరూ .. సత్యలా అనిపించడమే లేదు . సత్య రూపం లోనే ఎవరో కొత్తవారిని

చూస్తున్నట్లు ఉంది . అంది రచన .

చిన్నగా నవ్వి .. మనం చూసే కోణాన్ని బట్టి మనిషి ప్రవర్తన ఉంటుంది . మనం ఎవరి నైనా పాజిటివ్ ఏంగిల్ లో

చూసామనుకో వాళ్ళెం చేసినా బాగానే ఉంటుంది .. అదే నెగటివ్ ఏంగిల్ అయితే వారు ఎంత పనులు చేసినా ..

మనకి నచ్చదు .. అన్నాడు యశ్వంత్ .

అంటే నేను సత్యని నెగటివ్ ఏంగిల్ లో చుస్తున్నానంటావా ? అది తప్పు యశ్ .. అంది బాధగా రచన .

ఇంతలో వీరి వైపు ఓ ముసలాయన వస్తు కనిపించాడు .

రచనా .. అతను సరస్వతి వాళ్ళ తాత కదూ .. అన్నాడు యశ్వంత్ అతడిని చూస్తూ ..

అవును యశ్వంత్ .. మనల్ని కలవాలనే వస్తున్నట్లున్నారు .. అని కాస్త వడివడిగా నడిచి "తాతా బావున్నావా ?'

అని అడిగింది రచన .

ఏం బాగు తల్లీ ? సరస్వతి ఇంతవరకూ ఇల్లు చేరలేదు . నీకేమన్నా తెలుస్తుందేమోనని వచ్చినా .. అన్నాడు అతడు

అవునా ? నిన్న మాతోనే వచ్చింది గానీ తిరుగు ప్రయాణం లో తను మాతో రాలేదు . ఆ పోలిస్ స్టేషన్ దగ్గరలో మీ

బంధువులేవరో ఉన్నారని వాళ్ళని కలిసి వస్తానని అంది . నేనూ కాదనలేకపోయాను .. వచ్చేస్తున్దిలే తాతా .. అంది

రచన .

యశ్వంత్ వీరి మాటలు విని దిగ్భ్రాంతి కి లోనయ్యాడు .

అదేంటి ధాత్రీ .. మీతో పాటూ నిన్న సరస్వతి రాలేదా ? అన్నాడు ఆశ్చర్యంగా ..

లేదు యశ్వంత్ .. చెప్పానుగా తను వాళ్ళ బంధువులింటికి వెళ్ళింది ... అంది రచన .

ఏం మాట్లాడుతున్నావు తల్లే ... ఓ విధవరాలు మొగుడు చచ్చినాక సూతకం పాటించక , పదో రోజు భోజనాలెట్టక

ఎవరైనా చుట్టపోలింటికి ఎల్తదా ? ఎల్లదు తల్లే .. అది తప్పు .. సరస్వతి అలా సేయదు .. అన్నాడు ముసలోడు .

(ఇంకా ఉంది )
ఆదివారం "రుధిర సౌధం " ప్రచురించబడదు ;గమనించగలరు

మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

No comments: