Powered By Blogger

Friday, 4 April 2014

రుధిర సౌధం 111


యశ్వంత్ మనసులో కలవర పడ్డాడు . రచన ఈమధ్య ఎందుకు ఆలోచించలేక పోతోంది .. అతడు తల

పట్టుకున్నాడు .

కానీ తాతా .. నాకు స్వయంగా సరస్వతే చెప్పింది తను మీ బంధువుల ఇళ్ళకి ఆ పదో రోజు కార్యక్రమానికి పిలవ

డానికే వెల్తాఅని  .. ఇదంతా మీ ప్రాంతం కదా .. నిజమే అయుంటుందని నేనూ ఒప్పుకున్నాను .. అంది రచన

కాసింత కంగారుగా .

లేదమ్మా .. సరస్వతి తెలిసి తెలిసి ఏ తప్పూ సేయదమ్మ . నా బిడ్డ ఏ పెమాదం లోనో పడలేదు కదా .. అతడు కళ్ళ

నీళ్ళు పెట్టుకున్నాడు .

తాతా .. సరస్వతికి ఏం కాదు .. నువ్వేం భయపడకు .. ఆమె ఎక్కడున్నా ఆమెని నీకు అప్పగించే బాధ్యత మాదే ..

సరేనా ? అన్నాడు యశ్వంత్ కల్పించుకొని .

అలాగే నయ్యా .. నా మనవరాలిని నాకు అప్పగించండయ్యా .. అన్నాడు సరస్వతి తాత .

అలాగే నువ్వు వెళ్ళు తాతా ... అన్నాడు యశ్వంత్ . అతడు కళ్ళు తుడుచుకొని వెళ్ళిపోయాడు .

మాన్పడి పోయి నిలబడిన రచన ని చూసి .. రచనా .. అని పిలిచాడు యశ్వంత్ .

అతడి పిలుపు కి ఉలిక్కిపడి .. ఇప్పుడు ఈ సమస్య ఏంటి యశ్ .. నాకేం అర్థం కావడం లేదు .. అంది రచన .

అన్నీ తెలిసి కూడా నువ్వెందుకు ఇలాంటి తప్పు చేసావు రచనా .. నువ్వు ,సత్యా ఆమెని తీసుకువెళ్ళారు .. తిరిగి

మీరే తీసుకురావాలి కదా .. అది మీ బాధ్యత . ఇప్పుడు సరస్వతి కనిపించడం లేదంటే మొట్ట మొదటి ప్రశ్న మీ

మీదకే బాణం లా దూసుకు వస్తుంది నీకది తెలియదా ? అసహనం గా అన్నాడు యశ్వంత్ .

నిజమే యశ్వంత్ .. కానీ నేను సరస్వతి ని నమ్మ్మాను .. కానీ నాతో అబద్ధం చెప్పి వెళ్ళాల్సిన అవసరం ఏముంది

సరస్వతికి ? ఎందుకని నాతో అబద్ధం చెప్పుంటుంది ? ఆందోళన గా అంది రచన .

నువ్వేం వర్రీ కాకు .. ఆలోచించి అడుగేద్దాం .. ఇంతకీ వాళ్ళ బంధువుల ఇళ్ళు ఎక్కడున్నాయని చెప్పింది ?

అన్నాడు యశ్వంత్ .

స్టేషన్ కి దగ్గరలో అని చెప్పింది . ఆరోజు సత్య వేల్లనీలే అనేసరికి నేనూ ఒప్పుకోవాల్సి వచ్చింది .. అంది రచన .

ఆపైన బర్త్ డే ఏర్పాట్లు .. వెరసి ఈ సమస్య మన ముందుకి వచ్చింది .. ఒక్క విషయం మాత్రం అర్థమవుతుంది ..

నీతో సరస్వతి అబద్ధం చెప్పింది .. కావాలని .. చెప్పింది .. ముందు అక్కడికి వెళ్ళాలి . ఈ తాత ని కూడా పట్టుకేల్దాం

ఎవరు అక్కడ బంధువులో తెలుసుకుందాం .. సరేనా ? అన్నాడు యశ్వంత్ .

ఏంటో యశ్వంత్ .. గుడి కనిపించిందన్న సంతోషం అంతా ఎగిరిపోయినట్లు అనిపిస్తుంది . అంది రచన నిరాశ గా .

అవును .. కానీ ముందు మనం సరస్వతి విషయం తేల్చుకోక పొతే మరో పెద్ద సమస్యలో పడిపోతాం రచనా ..

అది మన లక్ష్యానికి అడ్డుకావోచ్చు .. అన్నాడు యశ్వంత్

ఇంకా ఉంది 

మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

5 comments:

స్వర్ణమల్లిక said...

Ippudu inko twist vachindi story lo. Mallee repati daka wait cheyali. Chalaa Baga rastunnaru meeru.

రాధిక said...

తప్పదు కదా స్వర్ణ మల్లిక గారూ .. కథ అలా మామూలు గా వెళ్తే .. మీరు ఒకేసారి 100 ఎపిసోడ్స్ ఎలా చదువుతారు . మీ శ్రద్ధ ని , అభిమానాన్ని ఇలాగే కొనసాగించండి . అన్నట్టు చెప్పటం మరిచాను . మీ పేరు బావుంది . రుధిర సౌధం తర్వాత నేను వ్రాయబోయే నవల లో మీ పేరు ని ఉపయోగించుకుంటాను . కాదనరుగా

స్వర్ణమల్లిక said...

Peru nachindi annanduku thank you. Nirabhyantaramga vaadesukondi. Kakapote adi naa peru Kadu maa atta mamala perlu kalipi pettukunna. Na

స్వర్ణమల్లిక said...

Na peru Kalyani

రాధిక said...

baavundi kalyani garu.. atta maamala meeda anta prema? keep it up

meeranta premistunnarante vaallu mimmalni kuturulaa abhimaanistundaali