యశ్వంత్ ,రచన ఇద్దరూ మహల్ దగ్గరే ఉండిపోయారు . వచ్చి ఇంతసేపు కావొస్తుంది .. వారిరువురూ మాత్రం
అక్కడే ఉండి పోయారు .. వారికి గుడి మార్గమైతే తెలియ రాలేదు కదా .. ఆందోళన గా మనసులో అనుకుంది
వైజయంతి .
సత్యా .. ఏమిటి ఏదో ఆలోచిస్తూ కూర్చున్నావు ? ఏమైనా వండి పెట్టొచ్చు కదా .. ఆకలిగా ఉంది . అన్నాడు శివ .
ఏమిటీ వంటా ? నేనా ? అందామె కాళ్ళ కింద భూకంపం వచ్చినట్లు ..
అదేంటీ అల్లా అంటావు ? నువ్వు మా అందరిలో కెల్లా ఎక్స్పర్ట్ కదా వంటలో .. వంట రానట్టు మొహం పెట్ట వేంటి ?
అన్నాడు శివ .
ఆమె వైపు నిరాసక్తం గా చూసి .. శివ వైపు తిరిగి .. శివా ఈరోజు వంట నేను చేస్తాను . తనకి కొంచెం హెల్త్
బాగాలేదు .. అని వంట గది వైపు వెళ్తున్న మురారి ని చూసి ..
మురారీ .. నువ్వసలే అలసి పోయావు .. నువ్వు కాదు .. నేను చేస్తాను .. సరేనా ? అని సత్య వైపు చూసి ..
సత్యా నువ్వు విశ్రాంతి తీసుకో .. నేను వంట చేస్తాను .. అని వంటగదిలోకి నడిచాడు శివ .
శివ వంట గది లోకి నడిచాక .. మురారి వైపు చూసి .. నేను రాకుమారి ని .. వంట చేయడం నాకు రాదు . నిత్యం
సేవకులు సేవ చేస్తూ ఉంటారు మాకు . ఇటువంటి పనులని నాకు పురమాయించ వద్దని అతడికి చెప్పు ..
లేదంటే అతడి మెదడు మాంసం వండి పెట్టగలను .. అంది సత్య మురారి వంక క్రూరంగా చూస్తూ .
కానీ నా సత్య చాలా బాగా వంట చేస్తుంది . ఇలాంటి కర్కసమైన మాటలు తన నోటి వెంట రానేరావు . ఇకపోతే
నువ్వు .. కోటని వదిలి ఇక్కడ వరకూ వచ్చావు . శాశ్వతం గా ఆ కోట ని వదిలి ఉండాల్సి వస్తుందేమో ఆలోచించు
రాకుమారి వైజయంతీ .. అని కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు మురారి .
ఇంతలో గుమ్మం వైపు సవ్వడి వినబడటం తో అటువైపు దృష్టి సారించింది సత్య .
పాలిపోయిన మొహాలతో వస్తున్న రచన , యశ్వంత్ లని చూసి తనలో తానె నవ్వుకుంది సత్య .. వీరి మొహాలు
చూస్తుంటే నేను అనుకున్నట్లు ఏం జరిగినట్లు లేదు అనవసరం గా వీరి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను .. అని
అనుకొన్నది సత్య .
లోపలికి అడుగుపెట్టగానే కనిపించిన సత్యని చూసి చూడనట్టు ముందుకి నడిచి టేబుల్ పక్కనే ఉన్న చైర్ లో కూల
బడింది రచన .
ఆమె తో బాటే వచ్చి తానూ ఓ చైర్ లో కూల బడ్డాడు యశ్వంత్ .
ఇద్దర్నీ అలా చూసి తనలో తానె నవ్వుకొని .. ఏం జరిగింది యశ్వంత్ ? మీ ఇద్దరూ అలా ఉన్నారే ? అని అడిగింది
సత్య .
ఆమె వంక అసహనం గా చూసి .. నెమ్మదిగా అడుగుతున్నావా సత్యా ? ఏపని మీ ఇద్దరూ సరిగ్గా చేయరు .. ఇలా
సమస్యలు తీసుకొస్తారు . సరస్వతి ని మీతోనే తీసుకొస్తే ఏం పోయుండేది ? ఇప్పుడు సరస్వతి కనిపించడం లేదు .
కోపంగా అన్నాడు యశ్వంత్ .
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
1 comment:
Ayyo Ivala kada munduku sagaledu. Ippudu two days wait cheyali.
Post a comment