నిజమే .. ఇదీ ఆలోచించాల్సిన విషయమే .. భూపతి ఏమన్నా చేసి ఉంటాడా సరస్వతిని ... అన్నాడు మురారి .
భూపతి ఏమన్నా చేసాడే అనుకుందాం .. కానీ సరస్వతి వీరితో అబద్ధం ఎందుకు చెబుతుంది ? ఈ విషయం కోసం
ఇంతగా ఆలోచించే కన్నా అక్కడికి ఓసారి వెళ్లి ఎంక్వయిరీ చేయడం మంచిది . అన్నాడు యశ్వంత్ .
ఇంతలో భోజనం రెడీ .. అంటూ శివ అక్కడికి వచ్చాడు .. అరె యశ్వంత్ మీ ఇద్దరూ కూడా వచ్చేసారా ? రచన
మూడ్ మారిందా లేదా ? అంటూ ప్రశ్నల వర్షం కురిపించే సాడు .
అందరూ మౌనం గా ఉన్నారు .
అరె ఏమయింది మీ అందరికి ? ఇంత ముభావం గా ఉన్నారేం ? ఆశ్చర్యంగా అడిగాడు శివ .
శివా .. ఏం జరిగిందంటే ... అంటూ అంతా వివరంగా చెప్పాడు మురారి .
అంతా విని చిన్నగా నిట్టూర్చాడు శివ . ఇప్పుడెం అయిపోలేదు మనకిలాంటివెం కొత్తకాదు గా .. ముందు
భోజనాలు చేయండి .. భోజనం పూర్తయ్యాక యశ్వంత్ .. నువ్వూ ,మురారి , నేను ముగ్గురం అక్కడికి వెళ్లి వద్దాం ..
అప్పటికి గాని విషయం తేలదుగా .. అన్నాడు శివ .
బావుంది శివా .. ముందు ఆకలిగా ఉంది భోజనం పెట్టు .. అన్నాడు యశ్వంత్ .
అందరూ భోజనానికి ఉపక్రమించారు .
వీళ్ళ దృష్టి అయితే పక్కకి మళ్ళింది . ఆలయం కోసం ఆలోచన ఈ విషయం తేలకుండా ఆలోచించక పోవొచ్చు ..
అని మనసులో నవ్వుకొంది సత్య .
****************************************
గోపాలా ... అంటూ స్వామీజీ పిలవగానే పరుగున వచ్చాడు గోపాల స్వామి .
స్వామీజీ పిలిచారా .. అంటూ వినయం గా నిలబడ్డాడు గోపాల స్వామి .
అవును గోపాలా .. నీతో ఒక మాట చెప్పవలసిన అవసరమున్నది . సమయం ఆసన్నమయింది నా స్వస్థలానికి
చేరుకోవటానికి . ఆ తల్లి నన్ను కూడా ఓ కార్యక్రమానికి ఎన్నుకొన్నది . ఆ కార్యం నేరవేర్చుటకి ప్రయాణం
కావలసి ఉన్నది .. అన్నారు రమనానంద మహర్షి .
స్వామీ .. స్వస్థలమా ? నాకేమీ అవగతం కావటం లేదు స్వామీజీ .. ఇప్పుడు తమరు ఎక్కడికి ప్రయాణం చేయ
సంకల్పించారు ? ఆశ్చర్యంగా అడిగాడు గోపాలా స్వామి .
చిరు మందహాసం తో నాయనా గోపాలా .. ప్రతి వ్యక్తీ ఈ భూమి పై కార్యోన్ముఖుని గానే పుడతాడు . ఆ విధాత తను
చేసిన బొమ్మ నుదుటి పై విధి ని లిఖించి నట్లే ఓ బాధ్యత ని కూడా నిర్వర్తించేలా రాత రాసి భూమి పైకి వదిలి
వేస్తాడు.. మనకి ఉద్దేశించిన బాధ్యతని మనం నిర్వర్తించక తప్పదు నాయనా . ఎక్కడ కి వెళ్ళాలన్న ప్రశ్న వదిలి
నువ్వు నాతొ రాదలచుకున్నవొ లేదో తెలియ జేయి .. అన్నారు స్వామీజీ .
ఎంత మాట స్వామీజీ .. మీరెక్కడో నేనక్కడే .. మీ ప్రియ శిష్యునికి ఇలాంటి ప్రశ్న వేయుట ధర్మం కాదు .. అన్నాడు
గోపాల స్వామీ.
అయితే నాయనా మరో వారం లో మన ప్రయాణం ఉండవచ్చును . అన్ని ఏర్పాట్లు చేయనారంభించు . ఒక పరి
ప్రయాణానికి మునుపు గిరిజ దేవిని ఆశ్రమానికి రమ్మని కబురు పంపు . అన్నారు స్వామీజీ .
తప్పకుండా స్వామీజీ .. అని స్వామీజీ కి నమస్కరించి అక్కడ నుంచి కదిలాడు గోపాల స్వామీ .
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a Comment