ఆమె గొంతు పూడ్చుకు పోయినట్లైంది .. నేను చూస్తుంది నిజమా కలా .. నుదుటికి పట్టిన చెమటని
తుడుచుకుంటూ మెల్లిగా మెడ వెనక్కి తిప్పి సత్య వైపు చూసింది రచన . ఆమె మామూలుగా సత్య లానే కన -
బడటం తో మెల్లిగా ఊపిరి పీల్చుకొంది . నేనే పొరపాటు పడ్డట్లున్నాను .. అనుకొని సత్య వైపు మరో సారి చూసింది .
ఆమె పుస్తకం చదవటం లో నిమగ్న మయి ఉన్నట్లే కనిపించింది . నిశ్చింతగా నిట్టూర్చి మళ్ళి అద్దం వైపు తిరిగి
అద్దం లో ఆమె ని చూసిన రచన కాళ్ళ కింద భూమి కంపిస్తున్నట్లని పించింది . అదే భయంకర ఆకారం .. ఆ
ఆకారం వైజయంతి .. భయం తో ఆమె గొంతు మళ్ళి పూడుకు పోయింది .. ఓరకంట మెడని వెనక్కి తిప్పి చూసింది
రచన . సత్య మామూలుగా కనిపిస్తుంది .. మళ్లి అద్దం లో చూసింది అదే భయంకర ఆకారం . అనుమానం లేదు
ఈమె సత్య కాదు .. అన్న ఆలోచన రాగానే ఆమె మనసు కలవరానికి లోనయ్యింది . వణుకుతున్న పాదాలతో
మెల్లిగా గది బయటికి వచ్చింది రచన .
ఓహ్ గాడ్ ... ఇదెలా సాధ్యం సత్య రూపం లో ఉన్నది వైజయంతి . అంటే ఆ మహల్ ని వదిలి మాతో ఉంటోంది ..
కానీ ఎవరికీ హాని చేయలేదు .. ఎందుకని ? అసలు సత్య ఏమయ్యింది ? ఎంత పిచ్చిదాన్ని అనవసరంగా సత్య ని
ఎంతలా అపార్థం చేసుకున్నాను . ఒక ప్రేతం తో పాటూ ఉంటున్నా ఆ విషయం తెల్సుకోలేక పోయాం .
అసలీవిషయం మురారికి తెలుసా ? వైజయంతి సత్య శరీరం లోకి ఎలా ? అని ఆలోచిస్తున్న ఆమెకి సడన్ గా గుర్తు
వచ్చింది మురారి పుట్టిన రోజున జరిగిన సంఘటన . అంటే అక్షరాలా నిజం యశ్వంత్ వాళ్ళు చెప్పింది . ఆరోజు
నిజంగానే నా మూర్ఖత్వం వల్ల సత్య ఇబ్బందిలో పడింది . పైగా ఈ విషయాన్నీ నేను అర్థం చేసుకోవడానికి
ప్రయత్నించలేదు . అంటే మురారికి ఈ విషయం తెలుసు . తెలిసీ ఎవరికీ చెప్పకుండా ఎందుకు మౌనం గా
ఉన్నాడు ? లేదు .. ఏదో ఒక కారణం ఉంది మురారి నోరు విప్పకుండా చేసే కారణం . కాని సత్య .. తన పరిస్థితి ఏంటి
? అయ్యో .. నాకేం పాలుపోవటం లేదు . ఈ దెయ్యం పోయి పోయి ఇలా ఇంట్లోనే వచ్చి కూర్చుంది . ఏదో అదృష్ట
వశాత్తు ఈ నిజం నాకు తెలిసింది . ఇప్పుడీ విషయం వెంటనే యశ్వంత్ వాళ్లకి తెలియజేయాలి .. లేదంటే ఏం
జరుగుతుందో ... కానీ వాళ్ళు ఈ పాటికే ఊరు దాటిపోయుంటారు . ఎలా ? ఎలా వాళ్ళని వెంటనే కలవాలి ? ఆమె
మనసు పరిపరి విధాల పోతుంది . అప్పుడామే కి రత్నం గుర్తుకి వచ్చాడు . ఎస్ .. రత్నం రాజు దగ్గర వెహికేల్
ఉంది . తనని అడిగి ఎలా అయినా యశ్వంత్ వాళ్ళ దగ్గరకి వెళ్ళాలి .. వెంటనే ఈ విషయం వాళ్ళతో చెప్పాలి ..
ఆలోచన వచ్చిందే తడవుగా ఆమె వెంటనే బయటకి దారి తీసింది . బంగ్లా వైపు వడివడిగా నడిచింది .
బంగ్లా లోకి అడుగు పెట్టగానే ఎదురు పడ్డాడు రత్నం .
ధాత్రీ ఏమయిపోయావు ? ఉదయం నుండీ కనబడనే లేదు అన్నాడు రత్నం .
రాజు గారూ అన్నీ తరవాత చెబుతాను . నాకు వెంటనే మీ జీప్ కావాలి అంది రచన .
ధాత్రీ ఏమయింది ? ఎందుకంత ఆదుర్దాగా ఉన్నావు ? ఎక్కడికి వెళ్ళాలి ? నేను తీసుకెల్తా పద .. అన్నాడు రత్నం .
లేదు రాజుగారు .. నేనే వెళ్ళాలి . నా మీద మీకేమాత్రం అభిమానం ఉన్న నన్నేం ప్రస్నించకుండా వెళ్ళనివ్వండి
ప్లీజ్ అంది రచన .
సరే వెళ్ళు అని జీప్ కీస్ ఇచ్చాడు ఆమె వైపు అయోమయంగా చూస్తూనే రత్నం .
కాసేపట్లోనే అతడు చూస్తుండగానే జీప్ కనుమరుగయ్యింది
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
1 comment:
Ivaala inka update chesinattu ledu. Memu Chalaa eager ga wait chestunnam. Tondaraga cheyandi madam. Nenu tellari lestune meeru post update chesara leda ani chusukuntanu rojuu...
Post a Comment