కన్నీళ్లు తుడుచు కొని అంది .. నేను నా కళ్ళారా చూశాను మురారి . నిర్థారించు కున్నాను . ఆమె సత్య కానే కాదు
వైజయంతి . తనలో మార్పు ప్రస్ఫుటం గా కనిపిస్తున్నా అర్థం చేసుకోలేక పోయాను . కాని ఈరోజు అద్దం లో ఆ
వైజయంతి అసలు రూపం బయట పడింది మురారి . ఈ విషయం తెలిసాక ఒక్క క్షణం కూడా మామూలు గా
ఉండలేక పోయాను . వెంటనే మిమ్మల్ని కలవాలని బయల్దేరాను . నాకే ఇలా ఉంది .. నీకు సత్య అంటే ప్రాణం .
నువ్వీ విషయాన్ని మనసులోనే ఎలా దాచుకున్నావు మురారీ .. కన్నీళ్ళతో ప్రశ్నించింది రచన .
బాధని గుండెల్లో అడుముకుని భరిస్తున్నా రచనా .. నోరు విప్పితే నా సత్య కి ప్రమాదం . తనని ప్రాణాలతో రక్షించు
కోవాలి . నా సత్య లో వున్న ఆ రక్కసి వల్ల మీకెవరికి ఏ ప్రమాదం రాకుండా చూడాలి . గడచిన కొన్ని గంటల
నుండీ నరకం అనుభవిస్తున్నా రచనా .. గొంతు పూడుకు పోతుంటే అన్నాడు మురారి .
మురారీ .. ఎంత మంచి వాడివి నువ్వు ? నీకు , సత్య కి రాకూడని కష్టం వచ్చింది .. బాధగా అంది రచన .
అందుకే రచనా .. నువ్వు తనతో ఒంటరిగా ఉన్నావన్న ఆలోచన నన్ను నిలవనీలేదు .. వెంటనే వాళ్లకి సత్యని
వదిలి రాలేనని చెప్పి వచ్చేసాను .. దారిలో నువ్వు కనిపించేసరికి ఏం జరిగిందో అని భయం వేసింది .. అన్నాడు
మురారి .
లేదు మురారీ .. నాకేం కాలేదు . కానీ ఈ విషయం మనం దాచకూడదు .. పద .. మనం వెళ్లి యశ్వంత్ ,శివలకి
చెప్పేద్దాం అంది రచన .
నో రచనా .. వద్దు . వాళ్లకి తెలిసినదని .. ఈవెన్ నీకు కూడా తెలిసిందని ఆ వైజయంతి కి తెలిస్తే సత్య మనకి
దక్కదు. ప్లీజ్ ఇది నీ మనసు లోనే దాచుకో రచనా .. అర్థింపు గా అన్నాడు మురారి .
మరైతే ఏం చేద్దాం మురారీ ? ఆ వైజయంతి బారి నుండి సత్య ని ఎలా కాపాడుకుందాం ? అంది రచన్ .
ఏదో ఒక మార్గం ఉండే ఉంటుంది రచన . కానీ ఆ మార్గం ఏదో మనకి తెలియాలి . ఇప్పుడు నాతొ పాటూ నీకూ
నిజం తెలిసింది . నాక్కొంచెం ధైర్యం వచ్చింది . ఇప్పుదెలాగైనా సత్య ని కాపాడుకుందాం .. అన్నాడు మురారి .
నేను నీకు ఏ సహాయం కావాలన్నా చేస్తాను మురారీ .. సత్య నా స్నేహితురాలు .. తన కోసం నా ప్రాణం ఇమ్మన్నా
ఇస్తాను . అంది రచన .
థాంక్ యు రచనా .. మనం ఇప్పుడు చేయవలసింది యశ్వంత్ వాళ్లకి ఈ విషయం చెప్పటం కాదు . సత్య ని
కాపాడు కోవటం . నువ్వీ విషయం వాళ్ళతో చెప్పనని మాటివ్వు రచనా .. అని తన చేయి ముందుకి చాచాడు
మురారి .
అతని చేతిలో చేయి వేసి .. అలాగే మురారీ .. నేను చెప్పను . అంది రచన గద్గద స్వరం తో ..
పద ఇంటికి వెళ్దాం .. అన్నాడు మురారి .
మెల్లగా తల ఊపి జీప్ ఎక్కి కూర్చుంది రచన .
మురారి డ్రైవింగ్ సీట్ లో కూర్చుని జీప్ స్టార్ట్ చేసాడు . జీప్ రావణ పురం వైపు దూసుకు పోయింది
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a Comment