నన్నే ప్రస్నిస్తున్నావా ? మీకేం వస్తుంది ? నా నివాసానికి వచ్చి నన్నే అక్కడ లేకుండా చేద్దామని భావిస్తున్నారే ..
ఏళ్ళకి ఏళ్ళు అక్కడ నేను స్థిరంగా ఉన్నాను . నన్ను కదిలించాలనే మీ ప్రయత్నం మానుకోండి .. లేదంటే
ఒక్కొక్కరుగా మీరే మరణిస్తారు .. అంది వైజయంతి .
కుదరదు వైజయంతీ .. నీ దురాశ .. నీ దుశ్చర్య లకి కాలం చెల్లిపోతుంది . రాణి మహల్ కి నీ పీడ వదిలి పోయే రోజు
అతి చేరువలో ఉంది .. అంది రచన ధృఢ చిత్తం తో ..
రచన మాటలకి వెనుదిరిగింది వైజయంతి .. ఆవేశం గా రచన వైపు రాసాగింది .
రచన నేమీ చేయకు వైజయంతి .. అరుస్తున్నాడు మురారి .
రచన భయపడలేదు . పైపెచ్చు తీక్షణ మైన చూపులతో .. రా .. ఎంత ఆవేశ పడి ఏం ప్రయోజనం ? నేనీ కార్యం
చేయడానికే నిర్దేసింప బడిన దానిని . ప్రాణాలకి తెగించే వచ్చాను . రానున్న పౌర్ణమికి గుడి తలుపులు తెరచి
తీరతాను. మా వంశస్తుల ఆత్మలకి .. నీకు కూడా ముక్తి లభించేలా చేస్తాను వైజయంతీ .. అంది రచన ధైర్యం గా .
ఓహో బాలికా .. ఎంత కండ కావరమే నీకు ? నీకు నీ ప్రాణాల మీద తీపి లేకుండ వచ్చు . కానీ నీ కొరకు కష్టి స్తున్న
నీ స్నేహితుల పరిస్థితి ఏమిటి ? వారిని నేను ప్రాణాలతో నిలవ నీయను .. భయంకరంగా అంది వైజయంతి .
ఒక్క మాట వైజయంతి .. ఆత్మ వైన నీకు శారీరక బలం లేదు .. కానీ మాకు శారీరక బలము ఉంది , బుద్ధి బలం
కూడా ఉంది . అంతే కాక సంకల్ప సిద్ధి ఉందీ .. ఆ దైవానుగ్రహము ఉంది . నీవు మమ్మల్ని ఏమీ చేయలేవు
వైజయంతీ .. ధైర్యం నిండిన మనసుతో అంది రచన .
రచన ధైర్యానికి అబ్బురపోయి మాట రాక నిలబడిపోయాడు మురారి .
సత్య వికృతంగా నవ్వి .. ఇది నీ అధిక ప్రసంగం .. నన్ను రెచ్చగొడితే .. వీరి చావు నీ కళ్ళ వెంట రక్తం తెప్పిస్తుంది .
అది తథ్యం .. అంది వైజయంతి .
వైజయంతీ .. నువ్వు మమ్మల్ని చంపగలిగి ఉండుంటే ఈపాటికే మేమంతా ప్రాణాలు కోల్పోయే వాళ్ళం . ఇప్పుడు
నీ ఎదుట ఇలా ధైర్యం గా నిలబడి మాట్లాడ గలిగి ఉండేవారమే కాదని నాకు తెలుసు వైజయంతి . నీ బలహీనత ని
నువ్వు తప్పకుండా తెలుసుకునే ఉండి ఉంటావు వైజయంతి . నీ నుండి మమ్మల్ని ఏదైనా శక్తి కాపాడుతూ ఉండి
ఉండొచ్చు . లేదంటే మమ్మల్ని ఏమీ చేయలేని అసక్తత ఐనా నీది అయి ఉండాలి . ఈ నమ్మకం చాలు మమ్మల్ని
మేము కాపాడుకోవటానికి ... అంది రచన .
అశక్తత నాది కాదు .. మహల్ ని వీడి నేను వెళ్ళేది లేదు .. మిమ్మల్ని మనస్సాంతి గా మసలనీయను ...
అవమానం నిండిన గొంతు తో అంది వైజయంతి .
రాణి మహల్ తిరిగి పునరుద్ధరిమ్పబడుతుంది వైజయంతీ .. గుడి మాకు కనిపించింది .. అమ్మవారి గుడి తెరవ
బడుతుంది .. గుడిలో దీపాలు వెలుగుతాయి . ఈ వూరు బాగుపడి తీరుతుంది . అంది స్థిరంగా రచన .
రచన మాటలకి సంతోషం తో వెలిగిపోయింది మురారి మొహం .
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
2 comments:
Ee episode Chalaa Baagundi. Continue...
Radhika chaalaa baagaa rastunnaaru. Ekkadaa tempo taggaledu:):)
Post a comment