Powered By Blogger

Friday, 18 April 2014

రుధిర సౌధం 124


రచన , మురారి ఇద్దరూ రాణి మహల్ చేరుకున్నారు . గేటు తీసి లోపలకి అడుగు పెట్టారు . మురారి మనసంతా

కలవరంగా ఉంటె రచన పంతంగా ముందుకి నడిచింది . మహల్ తలుపులు తీసే ఉన్నాయి . ఇద్దరూ మహల్

గుమ్మం లో నిలబడి లోపలికి చూశారు .. నేలంతా రక్తం తో తడిసి పోయి ఉంది . మధ్యలో సత్య నిలబడి ఉంది ..

ఆమె చేతిలో ఓ పక్షి గిలగిలా కొట్టుకుంటుంది . చుట్టూ బేల కళ్ళతో మరిన్ని పక్షులున్నాయి ..

లోపలికి రండి .. అక్కడే నిలబడి పోయారేం ? అని వెటకారం గా నవ్వి ఆమె చేతిలో పక్షి మెడని కొరికింది .. ఆ

దృశ్యం ఒళ్ళు గగుర్పొడిచేలా వుంది .

వైజయంతీ .. నా సత్య ని ఇలా చూడలేను . తనని విడిచి పెట్టు .. దయనీయం గా అడిగాడు మురారి .

ఆమె నోటి నుండి రక్తం కారుతోంది . భయంకరంగా నవ్వి పరిష్కారం మీ చేతిలో ఉంచుకొని సమస్యని పెద్దది చేసు

కుంటున్నారు .. నీ పక్కన నిలబడి ఉందే .. నీ స్నేహితురాలు .. తన స్వార్థం కోసం మీరు బలి అవుతున్నారు .. ఆ

విషయం గ్రహించి మసలు కొండి .. మహల్ ని , ఈ ప్రాంతాన్ని నాకు వదిలిపోవటమే మీకు శ్రేయస్కరం .. అంది

బొంగురు గొంతు తో వైజయంతి .

మురారి రచన వైపు అసహనం గా చూశాడు .

ఆమె కోపంగా వైజయంతి వైపు చూస్తోంది .

మా మథ్య మనస్పర్థ లు సృష్టించాలని చూస్తున్నావా వైజయంతీ .. క్షత్రియ కన్య వయుండీ పిరికితనం తో ఓ

అమాయకురాలిని అడ్డు పెట్టుకొని ఆటలాడుతున్నావు .. సిగ్గు గా లేదా ? అడిగింది రచన ఆవేశం గా .

రచనా ... అంటూ ఉరిమింది .

చూడు .. ఈ పోరాటం నీకూ నాకూ మధ్యే .. వేరొకరికి సంభంధం లేదు . నా స్నేహితులకి ఇబ్బంది కలగజేసావు

అంటే నీలో క్షత్రియ లక్షణాలు లేనట్లే .. అంది రచన .

ఓహో .. ఎంతటి కావరమే నీకు ? అలా అయినచో  నా మాట విను .. ఈ సత్య మీకు దక్కాలంటే .. నువ్వు ఓ పని

చేయాలి .. అంది వైజయంతి .

 చెప్పు వైజయంతీ .. నీకీ మహల్ ని వదిలి పెట్టడం తప్ప వేరే ఏదన్నా చేస్తాను సత్య ని విడిచి పెట్టు .. అంది రచన

ఆశ గా ..

సరే అయితే .. ఈ ఊరికి దక్షిణాన కొన్ని వందల గజాల దూరం లో ఓ పాడుబడిన కోట ఉంది . ఆ కోట కి అర్ధరాత్రి

నువ్వు ఒంటరిగా రావాలి . సత్య ని అక్కడ నీకు అప్పజెబుతాను . నీ ధైర్యానికి అక్కడ పరీక్ష జరుగుతుంది .. నీ

 స్నేహితుల సహాయం తీసుకొనరాదు . నువ్వే ఒంటరిగా రావాలి .. రా .. అని భయంకరంగా నవ్వుతూ అక్కడి

నుండి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది వైజయంతి .

ఒక్కక్షణం అక్కడ నిశ్శబ్దం ఆవరించింది .

అంతల్లోనే తేరుకొని .. మురారీ .. నేను ఆ పాడుబడ్డ కోట కి వెళ్తాను .. సత్య ని తీసుకొస్తాను .. నువ్వు  ఇక్కడి

నుంచి ఇంటికి వెళ్ళు అంది రచన .

నో రచనా .. నేనూ వస్తాను .. సత్య తో పాటూ నిన్ను ఇబ్బంది పెట్టాలనే వైజయంతి అలా అంది .. నువ్వు ఒంటరిగా

వెళ్ళడం అంత మంచిది కాదు అన్నాడు మురారి కంగారుగా .

ఇంకా ఉంది రుధిర సౌధం 125 భాగం సోమ వారం చదవండి

మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

2 comments:

స్వర్ణమల్లిక said...

Chaala bagundandi. Ika speed up avutondi story. Evarina producers teesukuni TV serial teeste super hit avutundi. try cheyandi.. Baaguntundi..

రాధిక said...

aite meeku telisina producers unte maatlaadandi...mari.
thanks for your comment