Powered By Blogger

Tuesday, 29 April 2014

రుధిర సౌధం 133


ముగ్గురూ మహల్ ప్రాంగణం లోకి చేరుకున్నారు .

విధాత్రీ .. రాకుమారి విధాత్రీ .. దయచేసి మమ్మల్ని కరునించండి .. ఆపదలో ఉన్నాం .. గట్టిగా అరిచాడు యశ్వంత్ .

మురారి యశ్వంత్ వైపు ఆశ్చర్యం గా చూస్తుంటే శివ యశ్వంత్ కేమైంది అన్నట్టు చూసాడు .

ఇవేమీ పట్టించుకోకుండా .. క్షమించండి రాకుమారీ .. మీగురించి నా స్నేహితులకి చెప్పక తప్పలేదు .. కానీ

వారివల్ల మీకెలాంటి ఇబ్బంది కలగదు రాకుమారీ .. దయచేసి రండి .. రచన ఆపదలో ఉంది .. గట్టిగా అరిచాడు

యశ్వంత్ .

యశ్వంత్ అలా అరుస్తుంటే భయం భయం గా చుట్టూ చూస్తున్నాడు మురారి .. శివ కేమీ అర్థం కాక తల

గోక్కున్నాడు .

ఇంతలో అస్పష్టమైన కాంతి ఓ ఆకృతి లా వారి ముందు ఆవిర్భవించింది .

ముగ్గురూ విప్పారిన నేత్రాలతో ఆ వెలుగు ని చూశారు ..

మీముందర కి రావటానికి నాకేమీ అభ్యంతరం లేదు యస్వంతా .. కానీ నా ఆత్మ ని చూడగలిగే శక్తి మాత్రం

మీకింకా రాలేదు . అంది ఓ మధుర స్వరం ..

నోరు తెరచి అలానే చూస్తూ ఉండిపోయాడు శివ . అబ్బురంగా చూశాడు మురారి .

యశ్వంత్ మాత్రం .. తెలుసు .. రచన మాదగ్గర లేదు .. మీకు ఓ శరీరం .. అదీ రచన శరీరం కావాలని నాకు

తెలుసు .. కానీ అన్ని వైపులా ఉచ్చు మా చుట్టూ బిగుసుకుంటుంది రాకుమారీ .. మీ సహాయం మాకు

అవసరమైంది .. అన్నాడు యశ్వంత్ .

ఆమె మధురం గా నవ్వి న సవ్వడి ... ఆపై వీణ తీగ మోగినట్లు ఆమె పలికింది ..

యస్వంతా .. ముళ్ళు బిగుసుకుంటున్న సరే ఏదో చోట జారుముడి దొరకక మానదు .. అది దొరికాక మిగతా

ముళ్ళు అన్నీ వాటంతట అవే వీడిపోతాయి .. సమస్యలు అంతే .. ఒకదానితో ఒకటి ముడిపడతాయి .. కానీ

ఒకసారి పరిష్కారమంటూ దొరికితే అన్ని సమస్యలు గాలి బుడగల మాదిరి తేలిపోతాయి . నీకు నేను పరిష్కారాన్ని

తెలియజేశాను .. అన్ని సమస్యలనుండి బయట పడడానికి అదే దారి చూపుతుంది . అంది విధాత్రి స్వరం .

కానీ రాకుమారీ .. ఎలా రచన అన్నింటికీ ముఖ్యం .. ఆమే ఆపదలో ఉంటె మా బుర్రలు ఎలా పనిచేస్తాయి ?

బాధగా అడిగాడు యశ్వంత్ .

ఆమె మళ్ళి తెరలుతెరలుగా నవ్వింది .. యస్వంతా .. రచన సంగతి ఆమె చూసుకొన గలదు .. ఆమె తన లక్ష్యం

వైపు పయనించటం లో సఫలురాలు .. అంతే కాక కార్యసిద్ధి ,సంకల్ప సిద్ధి ఉన్న అతివ .. ఆపై మూలా నక్షత్రం లో

మహత్తర ఘడియలలో వైష్ణవీ మాత ఆశీర్వచనం తో జన్మను పొందిన అదృష్టవంతురాలు . ఆమెను అటు పంపటం

లో విధి నిర్ణయమే ఉంది .. పౌర్ణమి ఘడియల్లో అమ్మవారి గుడి తెరచుకుంటుంది .. అది జరగాలంటే మీ కృషి

తప్పని సరి . అనుమానాలతో వృధా ప్రయాసలేల ? నా మాట మీద నమ్మకమిడి నిశ్చింత గా మీ ప్రయత్నం కొన

సాగించండి . అంది విధాత్రి .

మరి సత్య .. అన్నాడు అప్రయత్నం గా మురారి .

ఆమె చిరునవ్వుతో .. చింతించకు మురారీ .. అంతా మంచే జరుగుతుంది .. నిశ్చల మనస్కులై కార్యసాధనకి

సంసిద్దులవండి .. ఎలాంటి భయాలకి మనసులో తావివ్వక ముందుకి సాగండి . మీ ప్రతి అడుగు లోనూ మీకు

తోడు ఉంటానని మాట ఇస్తున్నాను .. అన్నది ఆమె మధుర స్వరం తో ..

ఇంకా ఉంది 

మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

1 comment:

స్వర్ణమల్లిక said...

Chaala bagundandi.. Ee episode naku nachindi.