Powered By Blogger

Thursday, 1 May 2014

రుధిర సౌధం134


చాలా చాలా ఆనందం గా చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది .. అంతా ఓ కలలా ఉంది . మంచి కి ఓ వైపు మీరుంటే

చెడు వైపు ఆ బ్లడీ వైజయంతి ఉంది .. మీలా ఆమె ఎందుకు ఆలోచిన్చలేకపోతోంది ? ఆవేశం గా అన్నాడు మురారి

ఆమె చిన్నగా నవ్వి .. నా ముందరే నా సోదరిని అవమానించవద్దు మురారి . మీకు తెలియదు పరిస్థితులే మంచి

చెడులను నిర్ణయిస్తాయి . మనసు చెడు సాహవాసాన్ని మరిగినప్పుడు మన దారి చెడు వైపే మళ్ళుతుంది .. అదే

మంచి సహవాసం  దొరికి నప్పుడు మన అడుగు మంచి వైపే సాగుతుంది . అంది విధాత్రి

కానీ వైజయంతి ఎందుకిలా మారింది ? ఆమె ఓ దుష్ట శక్తి గా మారటానికి కారణ మేంటి ? రాకుమారి అన్నాడు

యశ్వంత్ .

శివ తన కళ్ళని తానె నమ్మక కళ్ళు నులుముకుంటూ చూస్తున్నాడు . మురారి ఆమె సమాధానం కొరకు వేచి

ఉన్నాడు .

ఆమె స్వరం ఓ క్షణం వణికి నట్లైంది ..


చెప్తాను .. మా ఆశల సౌధ మైన ఈ సౌధం రుధిర సౌధం గా ఎలా మారిందో ... 2వందల ఏళ్ళక్రితం ఈ ప్రాంతం

మా నాన్నగారైన మహారాజు   విక్రాంత వర్మ గారి పాలనలో ఉండేది . నాన్న గారి హాయం లోనే బ్రిటిష్ పాలన లో

ప్రజలు మగ్గుతుండే వారు . మా రాజ్యం లో చాలా ప్రాంతాలు బ్రిటిష్ వారి దౌర్జన్యం కారణం గా మాకు కాకుండా

పోయాయి .. నాన్న గారికి ఆ సమయం లోనే మహారాణి హేమావతి  సంతానానికి నోచుకోక పోవటం బాధించింది .

రాజ్యానికి వారసుడు లేకపోవట మనేది రాచరిక కుటుంబాలలో అతి పెద్ద సమస్య . వారసుడు లేని రాజ్యాలను

బ్రిటిష్ వారు సునాయాసం గా తమ కైవసం చేసుకునేవారు . అందువల్ల రాజ్యాన్ని పరదేశీయుల పరం కానివ్వ

కూడదని తలచిన మా నాన్నగారు వారసుడు కోసం అతి సామాన్య కుటుంబానికి చెందిన మా అమ్మ వసుంధర ని

మనువాడారు . ఈ విషయం పెద్దమ్మ హేమావతికి నచ్చలేదు . అత్యంత సౌందర్య వతి అయిన వసుంధరా దేవి తో

మహారాజు గారు ఎంతో ప్రేమగా ఉండేవారు . ఆమె ని పెళ్ళిచేసుకొన్న తరువాత రాజ్యం లో కొంత సుఖశాంతులు

నెలకొన్నాయని ప్రజలు భావించేవారు . వసుంధరా దేవి మగ బిడ్డని కన్నది . రాజ్యానికి వారసుడు లభించాడు .

పట్టమహిషి పదవి వసుంధర కి దక్కింది . అది హేమావతి కి కంట నలక అయింది . రాజ్యానికి వారసుడిని కానుక

గా ఇచ్చినందులకు వసుంధరా దేవి కి కానుకగా ఒక భవనాన్ని నిర్మించి ఇవ్వాలని మహారాజు తలంచారు . ఆ

భవనమే ఈనాటి ఈ రాణి మహల్ . మహారాణి వసుంధర కొరకు నిర్మించిన మహల్ కావటం తో ఈ మహల్ ని

రాణి మహల్ గా పిలిచేవారు . మహల్ పూర్తి కాక ముందే చిత్రం గా హేమావతి గర్భం దాల్చింది .. ఓ ఆడబిడ్డకి

జన్మ నిచ్చింది . వసుంధర ఆగమనం వలెనే హేమావతికి తల్లైన భాగ్యం దక్కిందని అందరూ తలంచారు . ఆ

మాటలు హేమావతిని బాధ కి గురిచేశాయి . వసుంధర రాక తో తన జీవితం లో సుఖశాంతులు పోయాయని

భావించింది ఆమె . పైగా ఆమె కొరకు మహారాజు మహల్ ని నిర్మించటం ఆమె లో ఆసూయ ని తట్టి లేపింది .

ఇంకా ఉంది 
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

No comments: