విడదీయగలవేమో నా మదిని ,తనువుని
అతికించలేవమ్మ విరిగిన నా మనసుని ..
చెదరగొట్టగలవేమో నేను కన్న కలలని ..
చెరపనేలేవమ్మ గుండెల్లో జ్ఞాపకాలని ..
చేదుగా ఉన్నా నీ తలపు రుచి ని వద్దని చెప్పలేని నిస్సహాయుణ్ణి ..
కుదురుగా లేని నా మనసు గతిని హేళనే చేయవద్దని నీకు నా మనవి ..
విఫల మైన .. సఫల మైన.. ప్రేమకి ఫలితం కన్నీరే ..
గుర్తు లేదా చేసుకున్న బాస కి ద్రోహం నీ తీరే ..
ఎదురు చూసిన కన్నుల తడిని కనలేని ప్రేయసి ..
మోసమే నీ స్నేహమైతే తీర్చేసుకో కసి ..
మనసు పొరల్లో రూపు దిద్దుకున్న అపురూప సౌందర్యాన్ని
సొగసు తెరల్లో దాగి ఉన్న వంచన అని అనలేను గానీ ..
నీ ప్రేమ మైకం లో మునిగి లోకాన్ని మరవటమే తప్పు ..
శాపమో వరమో .. నిన్నిపుడు మరవటమే ఒప్పు
వీక్షకులతో ఓ మాట : ప్రేమ లో విఫలమవట మంటే అదేమంత పాపం కాదు . ఆ ఓటమిని అంగీకరించి గెలుపు
కోసం అడుగు ముందు కేయటమే సరైనది . ప్రేమంటే .. ప్రియురాలినుండో ,ప్రియుని నుండో మాత్రమే పొందేది కాదు
అమ్మ నుండి ,నాన్న నుండి , చెల్లి , తమ్ముడు ,అక్క ,అన్న .. ఎన్నో బంధాలు ఉన్నాయి ప్రేమని పంచటానికి .
ఇన్ని బంధాలు పంచె ప్రేమని కించపరచి వేరెవరి ప్రేమో దక్కలేదని క్రుంగిపోవటమో ,పగతీర్చు కోవటమో లేక
ప్రాణాలు తీసుకోవటమో సరి అయినదేనా .... ? కాదు .. జీవితం లో ఇంకెన్నో బంధాలున్నాయి .. ఇంకెన్నో
పరిచయాలుంటాయి .. అవి బంధాలై పెనవేసుకుంటాయి . వేచిచూడండి .. ఏదీ ఎవరికోసం ఆగదు .. మీ జీవితం
కూడా ఆగిపోదు .. మీరు ఆపకండి .. ముందుకి సాగిపోనివ్వండి .. ఈ నా మాటలు ప్రేమ మత్తులో పడి జీవితాల్ని
నాశనం చేసుకుంటున్న చెల్లెళ్లకి , తమ్ముళ్ళకి ,స్నేహితులకి .. అర్థం అయింది కదూ ..
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
1 comment:
Chaalaa chaalaa bagundi Radhika gaaru:):)
Post a comment