వసుంధర మాత్రం ఆమె ని సోదరిగా గౌరవించేది . తన కోసం నిర్మిస్తున్న మహల్ లో తన ఆరాధ్య దైవమైన
వైష్ణవీ మాత గుడిని నిర్మించమని కోరింది . మహారాజు కులదైవానికి అట్టి గౌరవాన్ని కల్పించటమే కాక ప్రియ సతి
కోరికని కాదనక వైష్ణవీ మాత ఆలయాన్ని మహల్ ప్రాంగణం లోనే నిర్మించారు . అప్పటి రోజుల్లో ప్రతి కట్టడాన్ని
ఎప్పటికి నిలిచిపోయేలా ఒక రక్షణ వలయం లో నిర్మించేవారు .. వైష్ణవీ మాత ఆలయాన్ని కూడా అదేవిధం గా
నిర్మించారు . రాణి మహల్ నిర్మాణం గుడి నిర్మాణం పూర్తయ్యేసరికి వసుంధర మరో ఆడబిడ్డ కి జన్మ నిచ్చింది .
ఆ ఆడబిడ్డ ఎవరో కాదు .. ఈ విధాత్రి .. మహారాణి హేమావతి కి జన్మించినది వైజయంతి .. స్వయానా నాకు అక్క .
అని చిన్నగా నిట్టూర్చింది విధాత్రి ..
ఆ తరువాత .. అన్నాడు మురారి ఆసక్తి గా .. శివ ,యశ్వంత్ ఆమె వైపు శ్రద్ధగా చూశారు .
యువరాజు విక్రం వర్మ , యువరాణులు వైజయంతి ,విధాత్రులతో రాజ భవనం కళకళ లాడుతుండేది .. సంతోషం
తాండవిస్తు ఉండేది . కాని పెద్దమ్మ హేమావతి మనసు మాత్రం వసుంధర ని ఆమె సంతానాన్ని ద్వేషిస్తుండేది ..
అంతః పురం వసుంధర అదుపాజ్ఞ లలో ఉండటం ఆమె ని బాధించేది .. కానీ ఇదేమీ తెలియని చిన్నారి వైజయంతి
మాత్రం తన అన్నా చెల్లెళ్ళతో అత్త్యంత ప్రేమగా ఉండేది .. కాలం పరుగులు తీసింది .. అంతా పెద్దవాళ్ళం అయ్యాము
ఆ సమయం లోనే రాచరికాలు మెల్లిగా సమసి పోతున్నాయి .. బ్రిటిష్ వారి దాడిలో మా కోట పూర్తిగా వారి హస్త
గత0 అయింది . కోటని వదలి మాకు మిగిలిన రాణి మహల్ లోనే ఉండాల్సిన పరిస్థితి ఎదురయింది .. రాణి
మహాల్లోనే ఉంటూ తిరిగి మా కోటని అధికారాన్ని చేజిక్కించు కోవాల్సిన అవసరం ఏర్పడింది .. అది మా
జీవితాలలో అత్త్యంత దౌర్భాగ్య మయిన సమయం .
ఆ సమయం లోనే మనసుల్లోని విషాలు బయట పడేది ..
అంతా అధికారం కోసం పాట్లు పడుతుంటే ఆ కష్టాల మధ్యే యువరాణుల మయిన మేము యవ్వనాన అడుగు
పెట్టాం. సోదరీమనుల్లా కాక స్నేహితురాల్లా ఉండేవాళ్ళం .. ఏ కష్టం మమ్మల్ని దూరం చేయదనుకుంటున్న
సమయం లోనే మా పెద్దమ్మ లో రాజుకుంటున్న నిప్పు ఎగసిఎగసి పడుతోందని గ్రహించలేకపోయాం ..
అమ్మ ఆ విషయాన్నీ గ్రహించినా మిన్నకుండి పోయింది . అదే సమయం లో అనుకోకుండా గుడి కి వెళ్తూ సోదరి
వైజయంతి తనకి తారసపడిన ఒక సామాన్య యువకుడిని ప్రేమించింది .. అతడు ఆమె ని దుండగుల బారి నుండి
కాపాడాడు . అతడు ఆమె ని ప్రేమించాడు .. కానీ ఒక సామాన్యుడు యువరాణి ని ప్రేమించటం అతడి ప్రాణాలను
తీసింది .. ఆ పని వెనుక మహారాణి హేమావతి చర్య ఉంది .. ఆమె తన కుమార్తె భవిష్యత్తు కోసం కలవర పడుతోంది
యువరాణి విధాత్రి నయిన నేను చిన్ననాటి నుండీ అమ్మలాగే వైష్ణవీ మాత ని ఆరాధించే దానిని . అప్పుడే మా
పొరుగు రాజు గారు మాకు సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు .. బ్రిటిష్ దొరల మీద పోరాటానికి
సిద్ధమయారు నాన్నగారు , మా సోదరులు . పొరుగు రాజుగారైనా నృసింహ వర్మ రాజుల వారి పుత్రుడు యువరాజు
అర్జున వర్మ .. యువరాణి విధాత్రి ని పెళ్లాడ దలిచారు .. ఆ సంభంధం ఆ రెండు రాజ్యాల నడుమ సత్సంభందాలని
నిలబెడుతుందని అంతా భావించారు .. కానీ .. అని ఆగిపోయింది విధాత్రి ..
కానీ .. ఏం జరిగింది ? యువరాణీ .. అని అడిగాడు శివ ఉత్సుకతతో ..
ఆమె చిరునవ్వు నవ్వి దేవీ పూజ కి వేళ అయింది .. నేను అమ్మ పూజ కి పోవలె .. నాకోసం మీరు వేచి ఉండండి ..
మరల వచ్చెద .. అంది విధాత్రి .
అంతా మంత్రముగ్ధుల్లా తలలు ఊపారు .. వారి ముందు ఉన్న వెలుగు హటాత్తుగా మాయమయింది .
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a Comment