అలసిన శరీరం ముందుకి సాగేందుకు సహకరించక పోయినా అతి కష్టం గా ముందుకి నడచింది రచన.
నిస్సహాయం గా చుట్టూ చూసింది రచన . దట్టమైన అడవి కి తోడు కీచురాళ్ళ శబ్దం భయంకరం గా వినిపిస్తుంది .
చంద్రుని వెన్నెల మాత్రం ఆమె కి ధైర్యం చెబుతున్నట్లు ఉంది . పచ్చి పుండు లా పాదాలు ముందుకి కదలనంటు
మొరాయిస్తున్నాయి . దాహం తో నాలుక పిడచ గట్టుకు పోయింది .. ఇంకా ఎంత దూరం నడవాలో ...........
అన్నట్టు ముందుకి చూసింది ..
ఇంతలో ఆమె చెవుల్లో ఎవరో గుసగుస లాడుతున్నట్టు .. రా .. ఆగావో ... హహ్హా హహ్హా అన్న వికటాట్టహాసం
భయంకరం గా .. ఆమె రెండు చేతుల్ని కట్టేసి నట్లు .. ఆమె చెవులకి దగ్గర గా ఇరువైపులా ఎవరో ఇద్దరు ..
గుసగుసగా మాట్లాడుతున్నట్టు .. చిరాగ్గా ఆమె తన రెండు చెవుల్ని మూసేసుకుంది ... చెవులు బద్దలు చేసేలా
ఆ భయంకర మైన నవ్వు ఆమె వెంట పడింది .
ఆమె అసహనం గా ముందుకి పరుగుతీసింది . పాదాలకి గుచ్చుకుంటున్న ముళ్ళు విపరీతమైన నొప్పి ని
కలగాజేస్తున్నా పట్టించుకోకుండా ముందుకి పరుగుతీసింది ..
ఆ పరుగు పరుగు ... సరాసరి ఆమె ని ఆ పాడు బడ్డ కోట కి కిలోమీటర్ దూరం లో వగరుస్తూ ఆగిపోయింది ఆమె .
దూరం గా అపసకునాల సంకేతంలా కనబడింది ఒకప్పటి విక్రమ వర్మ పాలించిన కోట ..
ఆ కోట కనబడ గానే ఎందుకో ఓ పక్క బాధ మరో వైపు సంతోషం ఆమె హృదయాన్ని ఆవరించాయి ..
కోట కి సమీపం లో ఉన్నాను . ఇది మా పూర్వీకులు పాలించిన కోట .. ఆనాటి దురదృష్టానికి సంకేతంగా మొండి
గోడలతో మిగిలిపోయింది .. చరిత్ర పేజీ లలో తనకంటూ కొన్ని పేజీలను కూడా మిగుల్చుకోకుండా ఓ పాతుకు
పోయిన నిజం లా మిగిలిపోయింది .. ఇన్నాళ్ళకి ఇలా నా కళ్ళలో పడింది .. కానీ ఇది నా దురదృష్టం కావొచ్చు ..
అదృష్ట మైనా అయుండొచ్చు .. వైజయంతి ఇక్కడ కి రమ్మనటం వెనుక నన్ను అంతం చేసే ఉద్దేశ్యం తప్పకుండా
ఉండే ఉంటుంది .. ఈరోజు అర్థం కానుందేమో నా నుదుటి రాత బలం ఎంత అనేది ? అనుకొంది రచన తనలో తానె .
సత్య ఏక్కడ ఉందొ ఏమో ... అని మనసులో అనుకుంటుండగా అమ్మా ............. అని గట్టిగా సత్య అరుపు
హృదయ విదారకం గా వినిపించింది .
అది .. అది .. సత్య అరుపే .. ఏం చేస్తుందో వైజయంతి తనని .. నేను వెళ్ళాలి తనను కాపాడాలి .. అంటూ పిచ్చి
దానిలా కోట వైపు పరుగుతీసింది రచన .
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a comment