గాఢ మైన నిశ్శబ్దాన్ని చేధిస్తూ ... మనం ఇప్పటి వరకూ చూసింది నిజమేనా ? అన్నాడు శివ .
నిజమే .. కల లా అనిపిస్తున్న నిజం ఇది . అన్నాడు మురారి తనలో చెలరేగుతున్న భావప్రకంపనలని అదుపులో
పెట్టుకుంటూ ..
మొదటిసారి విధాత్రి ని చూసి నపుడు నా మనసు కూడా ఇలా నే కలవరపడింది . ఏది నిజమో ఏది అబద్ధమో
తేల్చుకోలేని సందిగ్ధావస్థ .. కానీ మనకి అంతుబట్టని నిజాలెన్నో ఈ సృష్టి లో ప్రాణం పోసుకొని ఉన్నాయి . సైన్స్
ఎంత అభివృద్ది చెందుతున్నా ఇంకా ఉదయిస్తున్న ప్రశ్నలు ఇంకా సాధించాల్సింది ఎంతో ఉందని తెలియజేస్తూనే
ఉంది . ఈ సృష్టి ని నడిపించేది దైవిక బలమే అని ఇలాంటి సంఘటనలు నిరూపిస్తున్నాయి .. అన్నాడు యశ్ .
అవును యశ్వంత్ .. జీవితం లో ఇలాంటి అనుభవాలు అరుదుగా చాలా కొద్దిమందికి మాత్రమె జరుగుతాయి ...
ఇదంతా అనుభవం లో ఉన్న తేడా .. వైజయంతి ని చూసినప్పుడు కలిగిన భావన కి విధాత్రి ని చూసినప్పుడు
కలిగిన భావానికి మథ్య చాలా వ్యత్యాసం ఉంది . అన్నాడు మురారి
ఇంకా జరిగింది నమ్మలేని స్థితి లో ఉన్నాను యశ్వంత్ . కానీ నీకు విధాత్రి గురించి ముందే తెలిసి నప్పుడు నువ్వు
మాతో ఎందుకని చెప్పలేదు ? అన్నాడు శివ .
విధాత్రి నాకు తొలుత కలసినప్పుడు నన్ను వైజయంతి నుండి రక్షించింది . కానీ అలాంటి విధాత్రి ని కూడా
రక్షించింది మన రచన .. అన్నాడు యశ్వంత్ .
అవునా ? దేవత అయిన విధాత్రి కూడా ఆపద లో ఉండటం ఏమిటి ? ఆశ్చర్యం గా ఉంది అన్నాడు శివ ..
మన రచన తననెలా రక్షించింది ? అడిగాడు మురారి .
వాళ్ళిద్దర్నీ చూసి చిన్నగా నిట్టూర్చి మీ ఇద్దరికీ గుర్తుందా ? ఒకరోజు ఈ మహల్లో మనందరం తలో రకం గా
ఆపదలో ఉన్నారు .. మురారి లేవలేని స్థితి లోఉన్నాడు . ఆరోజు శివ కనబడటం లేదని వెతుకుతూ నేను
అనుకోకుండా వైజయంతి గదిలోకి వెళ్ళిపోయాను . వైజయంతి నన్ను చావు అంచువరకూ తీసుకువెళ్ళింది .. అదే
సమయం లో నన్ను వెతుకుతున్న రచన చీకటి కొట్లో ఒక పాత జాడీ లో బంధింప బడున్న విధాత్రి గురించి ఏమీ
తెలియక పోయినా ఆ పాత జాడీ ని పగల గొట్టి విధాత్రి ని బంధ విముక్తురాలిని చేసింది .. అందువల్లే సరైన
సమయంలో నన్ను విధాత్రి వైజయంతి నుండి రక్షించింది . తన గురించి ఎవ్వరితోనూ చెప్పవద్దని నాదగ్గర నుంచి
మాట తీసుకొంది . అందుకే ఈ నిజాన్ని నా మనసులోనే దాచేసాను .. అన్నాడు యశ్వంత్ .
అంతా ఓ చందమామ కథలా ఉంది .. కానీ ఈ కథలో పాత్రలమయ్యే అదృష్టం మనకి కలిగినందుకు సంతోషం గా
ఉంది .. అన్నాడు శివ .
కానీ యశ్ .. విధాత్రి చెప్పినా రచన వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఉండటం కష్టం గా ఉంది .. అన్నడు మురారి .
చిన్నగా తలూపాడు యశ్వంత్
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a comment