యశ్ కానీ రాకుమారి విధాత్రి మాటల్లో నమ్మకం కనబడుతుంది . నిజంగా రచన అంత సమర్థురాలు కూడా ..
అన్నాడు శివ .
రచన సమర్థత మీద మనందరికీ నమ్మకం ఉంది .. కానీ తన మీద ఉన్న అభిమానమే తనకి ఏ ఆపద ఉందొ నన్న
కలవరానికి గురిచేస్తుంది . ఏదేమైనా పరిష్కారం తెలిసీ మనం సమయం వ్యర్థం చేస్తున్నామేమో . మరో రెండు
రోజులలో పౌర్ణమి ఉంది . ఆ పౌర్ణమి నాటికి గుడి తెరవబడాలి . రచన చేతుల మీదుగా ఆ పని జరగాలి . మళ్ళి
పౌర్ణమికి గుడిలో సహస్ర యాగం జరగాలి . పౌర్ణమికి గుడిలో రచన చేతులతో దీపాలు వెలిగించాలి . అప్పుడే ఈ
మహల్ మనుషులు నివసించడానికి వీలుగా దోషరహితం గా తయారవుతుంది . అన్నాడు యశ్వంత్ .
అవును యశ్వంత్ .. దీనితో పాటూ ఆ కాలం లో తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవటం కూడా ముఖ్యమే ..
అన్నాడు మురారి .
అవును యశ్వంత్ .. వీరిద్దరూ రాకుమార్తెలె .. కానీ వైజయంతి ఓ పిశాచి గా ఎలా తయారయింది ? అన్నాడు శివ .
అది మళ్ళి మనం విధాత్రి నోటివెంటే వినాలి .. విధాత్రి మల్లి ఇక్కడికి వచ్చే వరకు వేచి చూద్దాం ... అన్నాడు
యశ్వంత్.
*******************************************
పరుగు పరుగున ఆ శిథిల కోట కి చేరుకుంది రచన .
ఆ కోట మూడొంతులు శిథిల మైపోయింది . పల్చగా వున్న వెన్నెల వెలుగులో ఎందుకో భయానకం గా కనిపిస్తుంది
దూరంగా ఎక్కడో ఓ నక్క దిక్కులు పిక్కటిల్లేలా హృదయ విదారకం గా అరుస్తుంది .
మెల్లిగా అడుగు అడుగు వేసుకుంటూ కోట లోకి ప్రవేశించింది రచన . లబ్ డబ్ అని కొట్టుకుంటున్న గుండె సవ్వడి
ఆమె కె వినిపిస్తోంది . గాఢ మైన ఆ నిశ్శబ్దం లో ఆమె వెనుక ఏవో అడుగుల సవ్వడి .. నుదుటికి పట్టిన చెమట
తుడుచుకోకుండా ఓరకంట చూడటానికి ప్రయత్నించింది . కానీ ఆమె ఆ విధం గా ఆగగానే అడుగుల సవ్వడి
కూడా ఆగిపోయింది . ఒక్క క్షణం ఆమె గుండె శరవేగంగా కొట్టుకోసాగింది . ఎవరో నా వెనుక ఉన్నారు ..
కానీ మనుషులెవరో అయి ఉండరు .. ఈ ప్రదేశం అంతా నిర్జన ప్రదేశం లా ఉంది ... అంటే ఈ పాడుబడ్డ కోటలో
ఆశ్రయం పొందుతున్న ప్రేతాత్మలై ఉండొచ్చు . ఆమె ధైర్యాన్ని కూడగట్టుకొని ముందుకి నడిచింది .. మళ్ళి అదే
సవ్వడి వినవస్తుంది . ఈసారి ఆమె ఆగలేదు .. వెనక్కి తిరగాలనుకొనే ఆలోచనా చేయలేదు .. ఆమె ముందుకి
నడుస్తుంది .. మూకుమ్మడిగా నవ్వులు వినిపిస్తున్నాయి ..
రాకుమారీ .. మీ జడ కి పూల శోభ ని తీసుకువస్తాను .. అన్న మాటలు ఏమూల నుంచో లీలగా వినిపిస్తున్నాయి
రచన అప్రయత్నం గా అటుకేసి నడచింది .
ఇంకా ఉంది .
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a comment