ఆమె అటువైపు నడుస్తున్నపుడు వినబడుతున్న మాటలు ఆమెకి ఆశ్చర్యానికి గురిచేశాయి ..
మహారాజా .. ఆంగ్లేయుల దురాగతాలు మితిమీరిపోతున్నాయి .. రాజ్యం లో సుఖశాంతులు కరువై పోతున్నాయి
ప్రభూ .. అంటున్న ఓ మగ గొంతు ..
ఆమె మరింత ముందుకి నడుస్తుంటే మహారాజా .. యువరాణి వైజయంతి పెళ్లీడు కి వచ్చింది .. ఇకనైనా మీరు
తన విషయం లో సరైన నిర్ణయం తీసుకొనండి .. అంటున్న ఒక ఆడ గొంతు ..
మహా రాజా .. సోదరీమణుల నడుమ పొరపొచ్చాలు దొర్లుతున్నాయి .. ఇది మనకి మన రాజ్యానికి అంత శోభ
నీయం కాదు .. అంటున్న ఒక మాతృమూర్తి గొంతు ..
ఇంతటి ఉత్కృష్ట స్థితి ఏ తండ్రి కి రాకూడదు గాక రాకూడదు .. వారసుడి కోసం చేయని పూజలే లేవే .. అలాంటిది
సవతి తల్లి వైనంత మాత్రాన మరో తల్లి కి కడుపు కోత ఎలా రానిచ్చావు హైమావతీ .. దీనం గా ఒక మగ గొంతు ..
రచన ఆశ్చర్యం గా ఆగి పోయింది .. ఆమె పెదవులు అస్పష్టం గా ఉచ్చారించాయి... హేమావతీ ... ఈ పేరు నేను
విన్నాను .. గుర్తొచ్చింది .. ఈ పేరు మాహారాజు పెద్దభార్య పేరు .. అంటే ఈ సంభాషణ లన్ని ఆ కాలం నాటివి ..
ఇప్పుడు నేనెలా వినగలుగుతున్నాను . ఆనాటి జ్ఞాపకాలను దాచుకొన్న ఈ కోట నాకు వినిపిస్తోందా లేక ఇదంతా
నా భ్రాంతి కాదు కదా .. అనుకొంటుండగా ఆమె ఇంకో స్వరం వింది .
అమ్మా .. వైష్ణవీ మాత పూజకి వేళ అయినది .. నా చెలికత్తెలతో కూడి నేను రాణి మహల్ కడకి వెల్లివచ్చెద .. అన్న
తీయని గొంతు .. ఆ గొంతు విన్నవైపు ఆమె చూసింది అప్రయత్నంగా .. ఓ క్షణం ఆ పాడుబడ్డ భవనం అంతా
సుందర భవన మల్లె ఆనాటి సంస్కృతి ని ప్రతిబింబిస్తూ కనిపించసాగింది . హంస తూలికా తల్పం మీద హొయలు
పోతూ ఓ సుందరాంగి .. ఆమె రాకుమారి కావొచ్చు .. ఆమె చుట్టూ ఆమె కి సేవలు చేస్తూ ,ఛలోక్తులు విసురుతూ
చెలికత్తెలు .. వారి నవ్వులు .. ఆ భవన మంతటా మారుమోగి నట్లుగా ..
రచన తన కళ్ళని తానె నమ్మలేకపోయింది . ఆ దృశ్యాన్ని చూస్తూ .. ఆమె చూస్తుండగానే ఆ దృశ్యం ఆమె కళ్ళ
ముందు నుంచి మాయం అయిపొయింది . సకల హంగులతో కనిపించిన ఆ గది శూన్యంగా కనిపించింది ..
ఆమె ఆశ్చర్యంగా అక్కడి నుంచి కదిలింది .. నేను చూస్తున్నది నిజమేనా ? లేక ఇదంతా నా భ్రమ ..
అనుకొంటుండగా ఆమె కళ్ళ ముందు కనిపించిన ఇంకో దృశ్యం ఆమె కాళ్ళకి కంచె వేసింది .
నునుసిగ్గు తో ఓ రాకుమారి .. ఆమె జడ ని వేస్తూ ఓ చెలికత్తె .. ముగ్దమనోహర రూపం ఆమెది .. ఆ చెలికత్తె
అంటుంది .. ఈ ఏడు మీ ఇరువురి పెళ్లి జరిపించాలని మహారాజుగారు సంకల్పించారు రాకుమారీ అంటూ ..
ఆ ముగ్ధ మనోహరి .. ఆ విషయం అమ్మ నాతొ సంప్రదించింది . యువరాజు .. మా సోదరుడి మనువు కుదిరాకే
నా పెళ్లి అని అమ్మ కి తేల్చి చెప్పాను .. అని అంటున్న్న దామె .
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a comment