తన కళ్ళ ముందు కదలాడుతున్న దృశ్య మాలిక మెదడు లో నిక్షిప్తం చేస్తూ ముందుకి కదిలింది రచన ..
ఏ క్షణం అయినా ఆ మొండి గోడలు కూలిపోవటానికి సిద్ధం గా ఉన్నట్లున్నాయి ... నేలంతా బీటలు వారినట్లుంది ..
నేలపై ఎండిపోయిన ఆకులు కదులుతున్న చప్పుడు తప్ప మరేం వినబడటం లేదు .. గాలి ఏం లేకుండా ఆకులు
చిత్రంగా కదలటం చూసి కిందకి ఒంగి ఆ ఆకుని తన చేతిలోకి తీసుకొని చూసింది . ఎందుకో ఆ ఆకులు ఉన్నచోట
హటాత్తుగా భూమి కంపించసాగింది . రచన కళ్ళింత చేసి ఆశ్చర్యం గా చూసింది .. ఆమె చూస్తుండగానే భూమి
బద్దలై ఒక పెద్ద గొయ్యి ఏర్పడి అందులోంచి గబ్బిలాలు కుప్పలు తెప్పలుగా బయటికి ఒక్కసారిగా రాసాగాయి ..
రచన తన పెద్దగా అరుస్తూ తన రెండు చేతులతో మొహాన్ని దాచుకుంది .. ఆమె భయంగా అరవగానే ఆ కోటంతా
ప్రతిధ్వనించేలా నవ్వులు వినబడ సాగాయి.. ఆ నవ్వు చెవుల్లో నరాలు తెగిపోయేలా ఉంది . బాధతో తన చెవులని
మూసుకుంది రచన .
ఆమె చెవులు మూసుకుంటుంటే ఆమె చేతులకి తగిలిన వెచ్చని రక్తపు స్పర్స ఆమె లో భయందోళన ను
కలిగించింది ..
పరుగున అక్కడ్నించి ముందుకి కదిలింది రచన .
*****************************
యశ్వంత్ .. చాలా సమయం గడచింది . ఇంకా విధాత్రి రాలేదేం ? అసహనం గా అన్నాడు మురారి ..
నేను తన కోసమే వేచి చూస్తున్నాను .. విధాత్రి మనల్ని వేచి ఉండమని చెప్పింది .. అక్కడ రచన ఎలాంటి పరిస్థితి
లో ఉందొ ఏమో .. అన్నాడు యశ్వంత్ .
ఇది నిజంగా పరీక్ష కాలం లాగానే ఉంది యశ్ .. ఓ పక్క సరస్వతి గొడవ .. మరో పక్క మన సమస్య .. ఏం
చేయాలో అర్థం కాని పరిస్థితి .. అన్నాడు శివ .
అవును ఈ గొడవ లో పడి ఆ విషయం అడగడమే మర్చిపోయాను . ఏమైంది ? ఏమైనా తెలిసి0దా ? అని అడిగాడు
మురారి ..
లేదు మురారీ .. పైగా సమస్య పెద్దదైంది .. అంటూ జరిగిన దంతా వివరంగా చెప్పాడు యశ్వంత్ .
అవునా ? అనుమానం లేదు యశ్వంత్ .. భూపతి మనల్ని ఇక్కడినుంచి పంపే ఉద్దేశ్యం లోనే ఉండి ఉంటె ఖచ్చితం
గా అతడే సరస్వతి ని మాయం చేసుంటాడు . అన్నాడు మురారి .
అవును .. కానీ అది మనం నిరూపించాల్సి ఉంటుంది .. అన్నాడు శివ .
ఏదో ఒక దారి .. అంటూ నొసలు చిట్లించి దూరం గా కదులుతున్న నీడలను చూసి ... ,యశ్వంత్ .. అటు చూడు ..
ఎవరో ఆడమనిషి ని బలవంతంగా తీసుకెళ్తున్నారు .. ఆ గోడ మీద నీడ చూడు .. అన్నాడు మురారి .
అవును .. లెట్స్ గో .. ఎవ్వరో చూద్దాం .. అని మెరుపులా కదిలాడు యశ్వంత్
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

No comments:
Post a comment