అతడి వెనుక పరుగుతీశారు మురారి ,శివ .
గోడ మీద పడుతున్న నీడలకి ఆపోజిట్ గా వెళ్లారు . తడికలతో ఆ ప్రాంతం అంతా కంచె లా కట్ట బడి ఉంది . గడ్డి
మోపులు వెనుక ఏవో మాటలు వినిపించటం తో ఆ గడ్డి మోపుల వెనుకన నక్కి వినసాగారు .. మాటల ను బట్టి
అక్కడ నలుగురు ఉన్నారు .. వారితో పాటు ఓ స్త్రీ .. పెనుగులాడుతూ .. నన్ను వదిలేయండి .. అంటూ
ప్రాధేయపడుతుంది .
యశ్వంత్ .. ఆమె కొంపదీసి సరస్వతి కాదుగా .. మెల్లిగా అన్నాడు శివ .
అయ్యుండొచ్చు శివా .. అన్నాడు యశ్వంత్ ..
ముందు వారెం మాట్లాడుకుంటున్నారో విందాం .. అన్నాడు మురారి .
దయచేసి మా తాత ని ఏం చేయమాకండి .. మీరు చెప్పినట్టే సేత్తాను అంటున్న దామె .
ఈరాసామీ .. ఈ పిల్ల నిజం సేప్పకూడదు .. ఆ పట్నామోల్ల మాటల బట్టి దీన్ని ఎక్కడ పెట్టామో తెలిసి పోనాదేమో
అని అనుమానం .. ముందు స్థలం మార్చాలే .. అంటున్నాడు ఒకతను .
యశ్ .. అవి బాలయ్య మాటలు .. ఆమె తప్పని సరిగా సరస్వతే .. అన్నాడు శివ .
ఇడియట్స్ .. దొరికారు వెధవలు అన్నాడు మురారి .
మురారీ తొందర పడకూడదు .. అవకాశం కోసం వేచి చూద్దాం .. సరస్వతి ని వీళ్ళెం చేయాలనుకుంటున్నారో ..
తెలుసుకోవాలి .. మెల్లిగా నసిగాడు యశ్వంత్ .
దీని సంగతి నాకోగ్గేయండి .. వీళ్ళ తాత మనకాడ లేకపోయినా గానీ ఇది మన మాటే ఆడుద్ది .. ఒక్క మంత్రం
చదివినాన్నంటే దీని మనసు ,శరీరం కూడా మన వశ మయిపోద్ది అంటున్నాడు ఒకడు .
ఇంకొకడు గట్టిగా నవ్వుతున్నాడు ..
వద్దు .. నా భర్త ని చంపారు .. ఆ ఆవేశం లో మిమ్మల్ని అడిగానంతే .. నన్నూ , తాతని ఒగ్గేయండి .. చిన్నోల్లం
మీదారి కి అడ్డు రామ్ .. అంటున్నదామే భయం నిండిన స్వరం తో .
రాములు కెంత పొగరొ .. నీకంత కన్నా ఉండాది ... వదిలితే నువ్వేం సేస్తావో నాకు తెల్దా ? ఆ పట్నమోల్లతో నీకు
స్నేహమేందే .. ఈరోజు ఉంటరు .. రేపు పోతరు .. కానీ భూపతి బాబు ఈ వూరికి రాజు .. ఆర్ని కాదని బతకాలను
కోవట మేందే ? అంటున్నాడు ఇంకొకడు .
యశ్ .. డెఫినిట్ గా మన అనుమానం నిజమే .. ఏం చేద్దాం చెప్పు అన్నాడు ? మురారి ఆవేశం గా .
మురారీ .. ఒక్కసారి వాతావరణం గమనించు .. గాలి వేగం పెరుగుతోంది .. వీళ్ళకి దెయ్యామంటే భయం .. ఆ
బలహీనత తోనే వీళ్ళ పని పడదాం .. అన్నాడు యశ్వంత్ .
కానీ యశ్వంత్ .. ఆ వీరస్వామి ఉన్నాడు కదా వాడు భయ పడడు .. అన్నాడు శివ .
అసలు వీళ్ళందర్నీ మనం కిడ్నాప్ చేస్తే .. ఏం చేస్తారు వీళ్ళు ? అన్నాడు మురారి .
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

No comments:
Post a Comment