కాదు ఇంకేదో కరెక్ట్ స్టెప్ వేయాలి .. అన్నాడు శివ .
ఏం చేద్దాం ? అన్నాడు యశ్వంత్ .
వాళ్ళు సరస్వతి ని ఇంకా బంధించి ఉంచుతారు .. వాళ్ళెక్కడ బంధిస్తారో చూద్దాం .. తర్వాత మనం వాళ్లకి
తెలియకుండా సరస్వతి ని విడిపించోచ్చు అన్నాడు శివ .
సరే ఐతే వాళ్ళని గమనిద్దాం అన్నాడు మురారి . మళ్ళి వాళ్ళ వైపు ద్రుష్టి సారించారు .
ముందు దీన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి .. అన్నాడు ఒకడు .
ఊరవతల పాడుబడ్డ కోట ఉంది .. అక్కడికి ఎవ్వరూ పోరు .. పైగా దెయ్యాల దిబ్బ అని దానికి పేరు .. అందులో
ఉంచుదాం .. అన్నాడు వీరస్వామి .
అమ్మో ఆడికా ... నేను రాను బాబూ .. నిజంగానే అక్కడ దెయ్యలున్డాయి .. అన్నాడు ఒకడు .
యశ్ .. వాళ్ళు మాట్లడుకోనేది రచన వెళ్ళిన కోటకే అనుకుంటా .. అన్నాడు మురారి .
చిన్నగా తలూపి మళ్ళి వాళ్ళ మాటలు వినసాగాడు .. యశ్వంత్
దెయ్యాలుంటే ఏం .. ఆ భయం వల్లే ఆడికి ఎవ్వరూ రారు .. ఇది అరిసినా ఏ దెయ్యమో అనుకుంటారు .. ఇకపోతే
మన విషయమంటావ ? నేనున్డాను .. మీకేల భయం ? అన్నాడు వీరాస్వామి .
అలాగంటే సరే .. ఆడికే పోదాం .. అన్నారు మిగతా వాళ్ళు ..
వద్దు .. నన్నాడ పెట్టొద్దు .. నాకు ఆ కోట గురించి శానా బాగా తెల్సు .. వద్దు అని అరుస్తుంది సరస్వతి ..
ఆ .. మీకు మాబాగా ఎరుకే .. మాకు తెలవదా ఏమి ? ఈ మహల్ లో గుడేడ ఉందొ .. ఆ అమ్మోరు ఏడుందో .. కోట్ల
విలువ చేసే ఆ హారం ఏడుందో చెప్పరా అంటే చెప్పినాడా నీ మొగుడు ? చెప్పలే .. మా చేతిల చచ్చిండు .. అన్నాడు
బాలయ్య .
మాకు నిజంగా తెలవదయ్యా .. ఏడుస్తూ అంది సరస్వతి .
ముందు దీన్ని ఈడ్చుకు పదండి .. ఆడికి పోవాలె .. అంటూ నలుగురూ ఆమె ని బలవంతంగా లాక్కుపోసాగారు .
యశ్ .. భూపతి కూడా మనలాగే గుడిని వెతుకుతున్నాడా ..? వాళ్ళ మాటలు విన్నావా ? అన్నాడు మురారి .
మనం కేవలం గుడిలో దీపాలు పెట్టాలనే చూస్తున్నాం .. కానీ వీడు హారం అంటున్నాడు .. ఏంటో మరి ? అన్నాడు
శివ .
ముందు వాళ్లకి తెలియకుండా వాళ్ళని ఫాల్లో అవుదాం అన్నాడు యశ్వంత్ సాలోచన గా ..
ఎస్ .. లెట్స్ గో .. అన్నాడు మురారి ...
వాళ్లకి కొంత దూరం లో వాళ్లకి తెలియకుండా ఫాల్లో అవసాగారు మురారి ,యశ్వంత్ ,శివ
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a Comment