Monday, 12 May 2014

రుధిర సౌధం 143


రచన కళ్ళు సత్య కోసం వెదుకు తున్నాయి .. కోటలో గత చేదు అనుభవాలకి గుర్తులు గా పాత ఫర్నిచర్ ఇప్పటికి

ఉంది . కానీ కొన్ని విరిగిపోయి మరికొన్ని చెదలు పట్టి ఉన్నాయి . లోహాలతో చేసిన వేవీ మిగల్లేదు .. ఇంతలో

ఎక్కడి నుండో చిన్న మూలుగు వినిపించింది . నీరసంగా ఎవ్వరో ఊపిరి పీల్చుకోడానికి కూడా ఇబ్బంది

పడుతున్నట్లు గా ఆ శబ్దం . క్రమేపీ దగ్గరపడుతోంది రచన అడుగులు ముందుకు పడుతుంటే ........

ఆమె మనసు కెందుకో అది సత్య చేస్తున్న శబ్దమే అనిపించింది .. ఆమె మనసు ద్రవించింది .. సత్య ఎక్కడున్నావు .

నా కళ్ళకి కనబడటం లేదు నువ్వు .. కొన్నేళ్ళ నుండి ప్రేతాత్మలకి ఆనవాల మైపోయిన ఈ కోట లో ఎలా ఉన్నవో

ఏమో .. ఆమె మనసు బాధగా మూలిగింది . దాదాపు శిథిల మైపోయిన ఓ గదిలోంచి ఆ శబ్దం వినవస్తున్నట్టు

గుర్తించింది రచన .. తలుపుల ముందు నిలబడి ఓ క్షణం పరిశీలించి చూసింది .. పాత కాలపు ఘడియలు తుప్పు

పట్టేసి ఉన్నాయి .. ముట్టుకుంటే ఏమవుతుందో అన్నట్లు .. మెల్లిగా తలుపు ని ముందుకి తోసింది .. లోపల పాత

కుర్చీ పై పడిఉన్న ఓ స్త్రీ కుమిలి కుమిలి ఏడుస్తోంది .. ఆమె సత్య లా అనిపించలేదు .. మెల్లిగా ఆమె వైపు

అడుగులు వేసింది .. ఆమె కుర్చీ దండేనికి ముఖం ఆన్చి ఉండటం తో ఆమె ఎవరన్నది రచన కి అర్థం కావడం

లేదు .

ఆమె మెల్లిగా ఆ శోక మూర్తి దగ్గరకి చేరుకున్నాక .. ఎవరు మీరు ? ఒకసారి నా వైపు చూడండి .. అంది రచన ..

ఆమె మెల్లిగా కుర్చీ కి ఆంచిన మొహం తీసి మెల్లిగా రచన వైపు తిరిగింది .. అంతే ఆమె ని చూడగానే

హతాశురాలైంది .. రచన . శరీరం కంపించటం మొదలు పెట్టింది .. మీరు మీరు ... మిమ్మల్ని ఎక్కడో ,,చూసాను

అంది తడబడుతూ రచన ..

ఆమె రచన వైపు బాధగా చూసి నువ్వు నన్ను చూడగలుగు తున్నావంటే నువ్వు మరణించావా అని అడిగింది

ఆమె .

ఆ ప్రశ్న కి ఉలిక్కి పడింది రచన .

లేదు .. లేదు ..  నేను జీవించే ఉన్నాను .. అంది తడబడుతూ ..

అదెలా సాధ్యం .. నేను మరణించి 25  ఏళ్ళు గడిచాయి .. ఎవ్వరూ ఇలా వచ్చి నన్ను అడగనే లేదు .. అంది ఆమె .

గుర్తొచ్చింది .. మీ ఫోటో మా ఇంట్లో ఉంది .. మీరు .. మీరు .. మా పెద్దమ్మ కదూ .. బాధగా అంది రచన .

ఏమంటున్నావు నువ్వు ? పెళ్ళైన కొన్నాళ్ళకే నా ప్రాణం పోయింది .. ఇదుగో .. ఈ పాడుబడ్డ కోటలో బందీ ని ..

ముక్తి కోసం ,విముక్తి కోసం పరితపిస్తున్న ఆత్మ ని .. అంది ఆమె

మీరు మానసాదేవి .. అన్నయ్య విక్రాంత్ కి కన్నతల్లి .. నేను మిమ్మల్ని గుర్తుపట్టాను .. అంది రచన కన్నీళ్ళతో .

విక్రాంత్ .... అవును .. నా బిడ్డ .. నా బిడ్డ పేరు .. ఇన్నాళ్ళకి విన్నాను .. ఎవ్వరు నీవు ? అడిగిందామె ఆవేదనగా .
ఇంకా ఉంది

మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

2 comments:

స్వర్ణమల్లిక said...

Chaala bagundandi. Kanee content takkuva avutondi.

Anonymous said...

నా పేరు శ్ర్రిని,

నాకు హొరర్ర్ అనా థ్రిల్లెర్ అన్నా చాలా ఇష్టం.... మీ సీరియల్ రొజూ మిస్స్ అవకుండా చదువుతాను....చాల బాగా రాస్తునారు....మాంచి ఇంట్రెస్టింగ్ గా వుంది....

నాదొక చిన్న సలహ .... మీ తరువాత సీరియల్ మంచి ప్రేమ కధ అవాలని ఆశ పడుతునాను

ఇట్ట్లు ,
మీ అభిమాని
శ్ర్రిని