అమ్మ .. మా అమ్మ గిరిజాదేవి .. అంది రచన .
గిరిజ ... గిరిజ కూతురివా నీవు ? ఆమె ఆశ్చర్యంగా అడిగింది .
ఆనందంగా కన్నీళ్ళతో వివసురాలై అవును .. అవును పెద్దమ్మా .. అంది రచన ...
నిన్ను ఇలా కలసి నందుకు సంతోషం గా ఉన్నా .. నిన్ను ఈ విధం గా .. ఈ పాడుబడిన కోటలో కలసి నందుకు
బాధగా ఉన్నది తల్లీ .. అన్నది మానసాదేవి ఆత్మ .
రచన సందేహం నిండిన చూపుతో ఆమె వైపు చూసింది .
జీవం తో నీవు నన్ను చూడ గలగటం ఆశ్చర్యకరం . దానికి కారణాలు ఏమిటో నేను ఎరగను . కానీ నీవిప్పుడు
ఆపదలో ఉన్నావు . ఈ కోటలో కొన్ని వందల ఆత్మలు బందీ గా ఉన్నాయి .. వారిలో నేను ఒకతె ను . కొన్నేళ్ళ
కిందట మీ పెదనాన్న తో రాణి మహల్ వారసత్వం కోసం ఇక్కడికి వచ్చాము .. కానీ ఆస్తి దక్కక పోగా చేదు
అనుభవాలు ఎదురైనాయి . వైజయంతి పైశాచికత్వానికి మీ పెదనాన్న ప్రాణాలు అర్పించారు . ఆయన వైష్ణవీ మాత
ఆలయాన్ని పునరిద్ధరించాలనే తలంపుతో ఉంటే .. వారసత్వపు ఆస్తి మీద ఆస తో నేను వచ్చాను . అందుకే
మరణించినా ఆయన ప్రేతాత్మ కాలేదు .
గోడలకి వేలాడేలా చేసింది వైజయంతి ... అశాంతి కూడిన నా ఆత్మ ఈలోకాన్ని వీడదు . ముక్తి లభించదు ..
కానీ చీకటిలో చిరుదీపం లా ఈనాడు నా కుటుంబం లోని ఒక వ్యక్తి ని చూడటం సంతోషం గా ఉన్నది .. అన్నదామె .
పెద్దమ్మా .. నేను కూడా రాణి మహల్ ని హస్తగతం చేసుకునేందుకే వచ్చాను . కానీ నా ఉద్దెశ్యం మాత్రం వేరు ..
ఈ ఆస్తి ని అనుభవించాలనె ఆలోచన నాకు లేదు .. అన్నది రచన . గుడి లో దీపాలు పెట్టాలి . నా పూర్వీకుల
ఆత్మలు శాంతి పొందాలి .. అదే నా ఆలోచన .. అన్నది రచన .
నీ వదనం చూస్తుంటే నీలో ఏదో తెలియని స్థిర నిశ్చయం కనబడుతుంది .. నీకు విజయం సిద్ధించాలని కోరుకోవటం
తప్ప నీకేమి సహాయం చేయలేను . అన్నదామె దీనం గా .
మీ ఆశీర్వచనాలు తప్ప వేరేమీ ఆశించను పెద్దమ్మా ........... అన్నది రచన .
తప్పకుండా తల్లీ........ కాని ఈ కోట కి ఎందుకు వచ్చావు ? ఇక్కడి నుండి తిరిగి వెళ్ళటం కష్ట సాధ్యం .. అయినా
ఎందుకు ఇక్కడికి రావలసి వచ్చింది నీవు? అని అడిగింది మానసాదేవి
నా స్నేహితురాలి కోసం ... అని చెప్పింది రచన .
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a comment