నీ స్నేహితురాలా ? ఇక్కడ నీ స్నేహితురాలు ఎందుకు ఉంటుంది ? అడిగింది ఆమె ఆందోళన గా .
వైజయంతి నా స్నేహితురాలి శరీరాన్ని ఆక్రమించుకొని ఇక్కడకి తీసుకొచ్చింది . తనని రక్షించి వెనక్కి
తీసుకుపోదామని వచ్చాను . కాని అనుకోకుండా మిమ్మల్ని ఇక్కడ చూశాను . అంది రచన .
మేము రావణ పురం వచ్చినప్పుడు నీవు చాలా చిన్నపిల్లవి .. ఆరోజు మాతో పాటు వర్ధన్ ,గిరిజ కూడా వచ్చారు ..
వారిద్దరూ క్షేమం గానే ఉన్నారు కదా .. అని అడిగింది మానసాదేవి .
నాన్న ని కొన్నేళ్ళ క్రితం కోల్పోయాం .. అమ్మ ,నేను ,అన్నయ్య విక్రాంత్ మన కుటుంబం లో మిగిలిన వాళ్ళం ..
అంటే నా చిన్నారి విక్రాంత్ ని గిరిజ అన్ని తానై పెంచిన్దా ? ఎలా ఉన్నాడు వాడు ?అడిగింది మానసాదేవి ..
అన్నయ్య అమెరికా లో ఉo టున్నాడు .. నేడో రేపో ఇండియా రాబోతున్నాడు పెద్దమ్మా .. అంది రచన .
సంతోషం తల్లీ .. నిన్ను చూసాను .. నీ ద్వారా నా బిడ్డ క్షేమం తెలుసుకున్నాను . అమ్మా .. రచనా .. నువ్విక్కడ
నుండి వెళ్ళాక మహర్షి రమణానoదుల వారిని కలసి నా పరిస్థితి ని వివరించు తల్లీ .. అంది మానసాదేవి .
పెద్దమ్మా .. వచ్చే పౌర్ణమి కి జరిగే సహస్ర యాగం వలన మీకే కాకుండా మన పూర్వీకుల ఆత్మలకి ముక్తి
లభిస్తుంది . ఈ యాతన మీకు అతి త్వరలో తొలగించే బాధ్యత నాది అన్నది రచన .
అలాగే తల్లీ .. ఆ శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంది మానసాదేవి ...
ఇంతలో " రచనా .......... " అంటూ గట్టిగా ఓ అరుపు వినబడింది .
కంగారుగా అటువైపు చూస్తున్న రచన ని చూసి " అది నీ స్నేహితురాలే అయిఉండొచ్చు .. ఆ అరుపు వినబడిన
విధానాన్ని బట్టి అది ఆ పశ్చిమ గదిలోంచి వస్తున్నట్టు ఉంది .. వెళ్ళు తల్లీ .. ఆలస్యం చేయకు .. అంది మానసా
దేవి ..
అవును పెద్దమ్మా .. నేను మిమ్మల్ని మళ్ళి కలుస్తాను .. అంటూ వెనుదిరగక ఆ అరుపు వినబడిన వైపు పరుగు
తీసింది రచన .
********************************
నిద్ర పట్టక అటు ఇటూ దొర్లుతున్న గిరిజాదేవి చిరాగ్గా లేచి కూర్చుంది . ఆమె మదిలో కలవరం గా ఉంది ..
ఏం జరగబోతుంది ? రచన మీద ఎంతో నమ్మకం ఉన్నా కన్నతల్లి మమకారం ఆమె ని నిలవ నీయటం లేదు ..
సాయంత్రం గోపాలస్వామి వచ్చిన దగ్గరనుండి మనసు స్థిమితం లేదు . ఇంత హటాత్తుగా రమనానంద మహర్షి
రావణ పురానికి బయలుదేరటం ఏమిటి? ఆయన తీసుకున్న ఈ నిర్ణయం వెనుక కారణాలు ఏమై ఉండి ఉంటాయి ?
అని ఆమె మనసు పదేపదే ఆలోచిస్తుంది ..
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
1 comment:
Chalaa bagundi
Post a Comment